Moviesప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆ డైరెక్ట‌ర్‌ను కొట్టాడా... షూటింగ్‌లో ఏం జ‌రిగింది...!

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆ డైరెక్ట‌ర్‌ను కొట్టాడా… షూటింగ్‌లో ఏం జ‌రిగింది…!

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు 20 ఏళ్ల క్రితం ఇప్పుడున్న క్రేజ్ కంటే యూత్‌లో పిచ్చ పిచ్చ క్రేజ్ ఉండేది. ఇప్పుడు ప‌వ‌న్‌కు పోటీగా జూనియ‌ర్ ఎన్టీఆర్‌, మ‌హేష్‌బాబు, బ‌న్నీ, చెర్రీ, విజ‌య్ దేవ‌ర‌కొండ లాంటి హీరోలు చాలా మందే ఉన్నారు. ఇప్పుడు యూత్ అంతా పైన చెప్పుకున్న హీరోల అభిమానులుగా చీలిపోయారు. అదే 20 ఏళ్ల క్రితం యూత్‌లో క‌నీసం 50 – 60 మంది ప‌వ‌న్ అభిమానులుగా ఉంటూ ప‌వ‌న్ స్టైల్స్ అనుక‌రించేందుకు ఇష్ట‌ప‌డేవారు.

ప‌వ‌న్ సినిమాలు స‌రిగా ఆడ‌క‌పోవ‌డం.. అటు రాజ‌కీయాల్లోకి వెళ్ల‌డం.. స‌రైన క‌థ‌లు, డైరెక్ట‌ర్ల‌ను ఎంచుకోక‌పోవ‌డంతో ప‌వ‌న్ ఛ‌రిష్మా కాస్త త‌గ్గినట్టుగా ఉంటోంది. స‌రే కార‌ణం ఏదైనా ప‌వ‌న్ ఇప్ప‌ట‌కీ యూత్‌లో త‌న‌దైన ముద్ర అయితే బ‌లంగా వేయ‌గ‌లిగాడు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు డైరెక్ష‌న్ అంటే మ‌క్కువ‌. ఖుషీ సినిమాకు ముందు వ‌ర‌కు త‌న సినిమాల‌కు ఆయ‌నే స్వ‌యంగా ఫైట్లు కంపోజ్ చేసుకునేవాడు.

కొన్ని సీన్ల‌కు ప‌వ‌నే డైరెక్ష‌న్ చేసేవాడు. ఖుషీ సినిమాకు సంబంధించి క‌ల‌క‌త్తా వెర్ష‌న్ అంతా ప‌వ‌నే డైరెక్ట్ చేసుకున్నాడు. అయితే ప‌వ‌న్ త‌న సినిమా డైరెక్ట‌ర్ల‌ను ప‌క్క‌న పెట్టేసి తానే డైరెక్ట్ చేసే విష‌యంలో కొన్ని విమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొంటూ ఉంటాడు. గ‌తం నుంచి ఈ టాక్ ఉంది. తాజాగా సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు గీతాకృష్ణ సైతం ఈ విష‌యాన్ని మ‌రోసారి చెప్ప‌డంతో పాటు ప‌వ‌న్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

త‌న గురించి కూడా ఓ కామ‌న్ ఫ్రెండ్ ద‌గ్గ‌ర ఇష్టానుసారం మాట్లాడాడు అని.. ఆ విష‌యాన్ని త‌న స్నేహితుడు ఆరేడేళ్ల త‌ర్వాత త‌న‌కు చెప్పాడ‌ని ఆయ‌న చెప్పారు. ప‌వ‌న్ మొత్తం త‌న‌కే తెలుసు అన్న‌ట్టుగానే తానే డైరెక్ష‌న్ చేస్తాడ‌ని… మ‌రి అంత తెలిసిన వ్య‌క్తి జానీ లాంటి మెమ‌ర‌బుల్ డిజాస్ట‌ర్ సినిమా ఎందుకు తీశాడ‌ని ప్ర‌శ్నించారు. త‌ర్వాత త‌న డైరెక్ష‌న్‌లోనే స‌త్యాగ్రాహి అనే సినిమా అంటూ హ‌డావిడి చేసినా ఆ సినిమా అడ్ర‌స్ లేద‌ని గీతాకృష్ణ ఎద్దేవా చేశారు.

ఓ సినిమాకు డైరెక్ట‌ర్ ఈజ్ యే క్రియేటివ్ హిట్ల‌ర్‌.. ఆయ‌న ప‌నుల్లో నువ్వు వేలుపెట్ట‌కు అని ప‌వ‌న్‌కు సూచ‌న‌లు చేశారు. ఇక ప‌వ‌న్ రీమేకులే ఎక్కువుగా ఎందుకు చేస్తున్నాడో ? కూడా గీతాకృష్ణ చెప్పారు. రీమేక్ సినిమా అంటే మ‌రో చోట హిట్ అయిన సినిమా కావ‌డంతో ఆ సినిమాను అక్క‌డ చూసి ఇక్కడ తీసేయ‌వ‌చ్చ‌న్న ప్లాన్‌తోనే ఉన్నాడ‌ని.. అస్స‌లు ప‌వ‌న్ డైరెక్ట‌ర్ చెప్పేది విన‌డ‌ని.. వాళ్లు చెప్పేవి విన‌క్క‌ర్లేదు అన్న మూడ్‌లో ఉండ‌డంతో పాటు డైరెక్ట‌ర్ల‌కు విలువ ఇవ్వ‌డ‌నే గీతాకృష్ణ చెప్పారు.

ఇక ఎస్‌జె. సూర్య‌పై ప‌వ‌న్ మ్యాన్ హ్యాండ్‌లింగ్ చేసిన విష‌యాన్ని కూడా ఆయ‌న బ‌య‌ట పెట్టారు. ఓ సీన్ షూట్ చేస్తున్న‌ప్పుడు సూర్య‌పై ప‌వ‌న్ చేయిచేసుకున్నాడ‌న్న విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింద‌ని గీతాకృష్ణ చెప్పారు. సూర్య – ప‌వ‌న్ కాంబోలో ఖుషీ, కొమ‌రం పులి సినిమాలు వ‌చ్చాయి. గీతాకృష్ణ విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు ఎలా ఉన్నా ప‌వ‌న్ సీనియ‌ర్‌, పేరున్న ద‌ర్శ‌కుల‌తో ఎక్కువుగా సినిమాలు చేయ‌డం లేదు. కాల్షీట్లు పోయినా పెద్ద‌గా ఇబ్బంది ప‌డ‌ని చిన్న, మీడియం రేంజ్ ద‌ర్శ‌కుల‌తోనే ఎక్కువుగా సినిమాలు చేస్తున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news