Moviesబాల‌య్య సినిమా క‌థ మొత్తం చెప్పేసిన అనిల్‌... కూతురు రోల్లో శ్రీలీల‌..!

బాల‌య్య సినిమా క‌థ మొత్తం చెప్పేసిన అనిల్‌… కూతురు రోల్లో శ్రీలీల‌..!

ఎఫ్3 సినిమా మ‌రో ఐదారు రోజుల్లో థియేట‌ర్ల‌లోకి దిగ‌బోతోంది. ఐదు వ‌రుస స‌క్సెస్‌ల‌తో ఉన్న అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన సినిమా కావ‌డంతో అంచ‌నాలు అయితే మామూలుగా లేవు. పైగా ఎఫ్ 2కు కంటిన్యూగా అదే టీంతో ఎఫ్ 3 వ‌స్తుండ‌డంతో భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఎఫ్ 3 ప్ర‌మోష‌న్ల‌లో బిజీగా ఉన్న ద‌ర్శ‌కుడు అనిల్ తాను నెక్ట్స్ బాల‌య్య‌తో చేయ‌బోయే సినిమా క‌థ మొత్తం రివీల్ చేసి పడేశాడు. ఈ సినిమాలో బాల‌య్య పాత్ర ఎలా ? ఉండ‌బోతోందో కూడా చెప్పేశాడు.

అస‌లు గ‌తంలోనే రామారావు గారు టైటిల్‌తో బాల‌య్య హీరోగా అనిల్ ఓ సినిమా చేయాల‌నుకున్నాడు. ఆ సినిమా సెట్ కాలేదు. అయితే ఇప్పుడు ఎట్ట‌కేల‌కు ఈ సినిమా సెట్ అయ్యింది. ఎఫ్ 3 త‌ర్వాత ఈ సినిమా క‌థ‌పై ద‌ర్శ‌కుడు అనిల్ చాలా క‌స‌ర‌త్తులే చేయ‌నున్నాడు. ఇక ఈ సినిమా లైన్ ఎలా ఉంటుందో చెప్పిన అనిల్ ఇది తండ్రి – కూతురు మ‌ధ్య న‌డిచే క‌థ అని.. బాల‌య్య వ‌య‌స్సు మ‌ళ్లిన తండ్రిగా క‌నిపిస్తే.. కూతురుగా శ్రీలీల క‌నిపిస్తార‌ని అనిల్ చెప్పారు.

సినిమా అంతా బాల‌య్య మీదే డిపెండ్ అయ్యి ఉంటుంద‌ని.. వ‌య‌స్సు మ‌ళ్లినా కూడా బాల‌య్య క్యారెక్ట‌ర్ చాలా ప‌వ‌ర్ ఫుల్‌గా ఉంటుంద‌ని అనిల్ చెప్పారు. ఇక పోకిరి, గ‌బ్బ‌ర్‌సింగ్‌, అర్జున్‌రెడ్డి లాంటి సినిమాలు అన్నీ హీరోల పాత్ర‌ల చుట్టూనే తిరుగుతాయ‌ని… ఇప్పుడు బాల‌య్య సినిమాను కూడా అదే టెంప్లేట్‌లో చేసేందుకు ట్రై చేస్తున్నాన‌ని.. 50 ఏళ్ల వ‌య‌స్సు ఉన్న ఓ తండ్రి పాత్ర ఎలా బిహేవ్ చేస్తుందో ? అన్న‌దే ఈ సినిమా క‌థ అని అనిల్ అన్నారు.

ఇక బాల‌కృష్ణ సినిమా అవుట్ లుక్ ఎలా ? ఉంటుందో అనిల్ ఓపెన్‌గానే చెప్పేశాడు. ఇప్ప‌టి వ‌ర‌కు బాల‌య్య‌ను ఎవ్వ‌రూ చూపించ‌ని కొత్త కోణంతో అయితే అనిల్ చూపిస్తున్నాడు. ఇక బాల‌య్య‌ను తాను వేరే కోణంలో చూస్తున్నాన‌ని.. అది నాకో థ్రిల్లింగ్‌గా ఉంటుంద‌ని.. సినిమా రిలీజ్ అయ్యాక బాల‌య్య‌ను ఇలాగ కూడా చూపించ‌వ‌చ్చా ? అనిపించేంత కొత్త‌గా బాల‌య్య స్టైల్‌, ఆయ‌న మాస్ లుక్, డైలాగ్స్ ఉంటాయ‌ని అనిల్ చెప్పాడు.

ఈ సినిమా కోసం అనిల్ త‌న బ్రాండ్ కూడా ప‌క్క‌న పెట్టేస్తున్నాడు. చివ‌ర‌కు త‌న కామెడీ మార్క్ కూడా త‌క్కువే ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశాడు. ఏదేమైనా అనిల్ పూర్తిగా త‌న ఇమేజ్ ప‌క్క‌న పెట్టి చేసే ఈ ప్ర‌యోగం బాల‌య్య కెరీర్‌లోనే బెస్ట్ వ‌ర్క్‌గా మిగిలిపోతుంద‌ని ధీమాతో చెపుతున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news