Moviesబ్లాక్ బస్టర్ డైరెక్టర్ తో చరణ్ సినిమా ఫిక్స్..కాకపోతే అదే డౌటు..?

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ తో చరణ్ సినిమా ఫిక్స్..కాకపోతే అదే డౌటు..?

రాంచరణ్..ఈ మెగా పవర్‌ స్టార్ గురించి ఎంత చెప్పినా తక్కువే. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కొడుకుగా ..ఆయన వారసత్వాని అందిపుచ్చుకుని టాలీవుడ్ లోకి హీరోగా అడుగు పెట్టి ..ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా హీరో గా సినిమాలు చేసే స్దాయికి ఎదిగిపోయాడు  ఆయనలోని టాలెంట్..ఎలాంటిదో మనం అర్ధం చేసుకోవచ్చు. తండ్రి పేరు చెప్పుకుని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన చరణ్.. తన దైన స్టైల్లో నటిస్తూ.. కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. రీసెంట్ గా RRR సినిమా తో కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ మెగా హీరో ..ప్రజెంట్ వరుస సినిమాలకు కమిట్ అవుతూ..మిగతా హీరోలకి గట్టి పోటీ సితున్నాడు.

ప్రజెంట్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తో సినిమా చేస్తున్న ఈయన..ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయబోతున్నాడు. ఈ సినిమాలో చరణ్ కి జోడీగా కీయరా, అంజలి నతిస్తున్నారు. ఈ సినిమా 60 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకునేసింది. ఇక మిగిన పార్ట్ కంప్లీట్ అయ్యాక..సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తారు మేకర్స్. ఇక ఈ సినిమా కంప్లీట్ అవ్వగానే..చరణ్.. ‘జెర్సీ’ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో కలిసి ఓ క్రేజీ ప్రాజెక్ట్ కు వర్క్ చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా లో చరణ్ యంగ్ లవర్ భాయ్ గా కనిపించనున్నాడట. ఈ సినిమాలో చర్ణ్ ని మనం కొత్త కోణంలో చూడబోతున్నాం అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

కాగా..ఈ రెండు ప్రాజెక్ట్స్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ మూవీని యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. ఈ రెండు సినిమాలు హిట్ అయితే చరణ్ కి టాలీవుడ్ , కోలీవుడ్ లో తిరుగుండదు. తాజాగా చరణ్ మరో క్రేజీ సినిమాపై సంతకం చేసిన్నట్లు తెలుస్తుంది. కోలీవుడ్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్..తో చరణ్ ఓ సినిమాకి కమిట్ అయ్యాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కార్తితో తీసిన ఖైదీ సినిమాతో భారీ హిట్ అందుకున్న లోకేష్ ఆ తర్వాత విజయ్‌కు భారీ హిట్ ఇచ్చాడు.

ప్రస్తుతం ఆయన విశ్వ నటుడు కమల్ హాసన్ హీరోగా విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్, సూర్య ఇతర కీలక పాత్రల్లో విక్రమ్ సినిమాను రూపొందిస్తున్నారు. ఇది రిలీజ్‌కు రెడీ అవుతోంది. అయితే ఈ క్రేజీ కాంబినేషన్ లో సినిమా వస్తున్నట్టు ఎప్పటి నుంచో టాక్ వినిపిస్తోంది. కానీ ఇప్పటివరకు కన్ఫమ్ అయినట్టు సమాచారం రాలేదు. కానీ తాజాగా రామ్ చరణ్ ఫ్యాన్స్ మాత్రం లోకేష్ కనగరాజుతో సినిమా పక్కా అంటూ సంకేతాలు వస్తున్నాయి. మరో ఆయన అభిమానులు కూడా సినిమా ఒకే అనట్టు సోషల్ మీడియాలో కొంతమేర ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే రామ్ చరణ్‌ను కూడా డైరెక్ట్ చేయనున్నట్టు తాజా సమాచారం. మరి దీనికి సంబంధించిన అఫీషియల్ కన్‌ఫర్మేషన్ ఎప్పుడొస్తుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news