Moviesబాలీవుడ్ లో 'పుష్ప' సినిమా హిట్ అవ్వడానికి రీజన్ అదే.. రాజమౌళి...

బాలీవుడ్ లో ‘పుష్ప’ సినిమా హిట్ అవ్వడానికి రీజన్ అదే.. రాజమౌళి కామెంట్స్ వైరల్..!!

పుష్ప..పుష్ప రాజ్..నీ యవ్వ తగ్గేదేలే.. వామ్మో ఈ డైలాగ్ వచ్చి సంవత్సరాలు గడుస్తున్నా..సినిమా రిలీజ్ అయ్యి ఆరు నెలలు అవుతున్నా కానీ..సినిమా సృష్టించిన భ్హిబత్సం మాత్రం అస్సలు తగేదేలే అన్నట్లు ఉంది. డైలాగ్ అంటే పడి చచ్చిపోతున్నారు జనాలు. అంత బాగా అందరికి నచ్చేసింది. సినిమా లో బన్నీ మాస్ లుక్ లో కనిపించడం ఓ ఎత్తు అయితే.. బన్నీ చెప్పే డైలాగ్..ఆ మాస్ స్టైల్ లో అయితే సూపర్ గా ఉంటుంది.

టాలీవుడ్ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ – లెక్కల మాస్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన సినిమానే ఈ “పుష్ప”. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయిన పుష్ప మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సినిమా రిలీజ్ అయ్యి..ఓటీటీలోకి కూడా వచ్చేసినా ఈ సినిమాకి ఉన్న క్రేజ్ మాత్రం తగ్గట్లేదు. సుకుమార్ అంత బాగా మాయ చేశాడు ఈ సినిమాతో. బన్నీ కెరీర్ లో ఎప్పుడు లేని కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా రికార్డ్ నెలకొల్పింది. ఈ సినిమాను డైరెక్ట్ చేసిన తరువాత సుకుమార్ పేరు కూడా పాన్ ఇండియా లెవల్ లో మారుమ్రోగిపోయింది. ఇక మరి కొద్ది రోజుల్లోనే పుష్ప పార్ట్ 2 లాంఛనంగా ప్రారంభంకానుంది.

ఈ క్రమంలో దర్శకధీరుడు రాజమౌళి చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతూ.. పుష్ప చిత్రం గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ సినిమా నార్త్ లో అంత పెద్ద హిట్ కావడానికి అసలైన సీక్రెట్స్ రివీల్ చేసి..షాక్ ఇచ్చారు.

“నార్త్ లో ఇప్పటి వరకు క్లాస్, సాఫ్ట్ మూవీస్ నే వస్తున్నాయి. ఇలాంటి క్రమంలో ..సుకుమార్ తన కొత్త ప్రపంచాని పుష్ప ద్వారా పరిచయం చేసాడు. నిజమే పుష్ప లో కొన్ని లోపాలు ఉన్నప్పటికి..సుకుమార్ క్రియేటివిటీ..దానిని డామినేట్ చేసి..జనాలను మాస్ ప్రపంచంలోకి తీసుకెళ్లి సక్సెస్ అయ్యింది. పుష్ప లాంటి మాస్, రస్టిక్ క్యారెక్టర్ తగలడంతో హిందీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు” అని రాజమౌళి చెప్పుకొచ్చారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news