Moviesఆ మాట అనగానే ఏడ్చేసిన కృతి..వీడియో వైరల్..!!

ఆ మాట అనగానే ఏడ్చేసిన కృతి..వీడియో వైరల్..!!

ఈ మధ్య కాలంలో మనం ఎక్కువుగా వింటున్న పదం ప్రాంక్. ఈ ప్రాంక్ వీడియోలతో నే యూట్యూబ్ లో కొందరు లక్షలు లక్షలు సంపాదిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఇలా ప్రాంక్ వీడియోలు చేసే..పాపులర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ప్రాంక్ అన్నది సరదాగా ఉండాలి కానీ..ఇలా బాధపెట్టే విధంగా ఉండకూడదు అంటున్నారు కృతి శెట్టి ఫ్యాన్స్. రీసెంట్ గా ఆమెకు సంబంధించిన ఓ ప్రాంక్ వీడియో వైరల్ గా మారింది. దాంట్లో కృతి కన్నీళ్లు పెట్టుకున్న విసువల్స్ అందరిని బాధిస్తున్నాయి..

కృతి శెట్టి ..పాప పేరుకి పరిచయం అవసరం లేకుండా చేసుకుంది. ఉప్పెన సినిమా తో తన తల రాతను మార్చేసుకున్న ఈ బ్యూటీ..ప్రజెంట్ టాలీవుడ్ , కోలీవుడ్ లో మంచి మంచి సినిమా ఆఫర్లు పట్టేసి..నెం 1 హీరోయిన్ స్దానానిని ఆక్రమించుకోవడానికి ట్రై చేస్తుంది. అమ్మడు స్పీడ్ చూస్తుంటే..ఆ స్దానాని అందుకోవడానికి పెద్ద టైం తీసుకునే విధంగా కనిపించడంలేదు. వరుసగా హ్యాట్రిక్ హిట్ లు కొట్టిన ఈ బ్యూటీ ప్రజెంట్ రామ్ సరసన ది వారియర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా తెలుగుతో పాటు తమిళంలో కూడా విడుదల కానుంది. ఈ సినిమా జూలై 14న ప్రేక్షకుల ముందుకు రానుండటంతో ప్రస్తుతం ఈ సిని బృందం ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే కృతి శెట్టి కూడా ప్రమోషన్ లో భాగంగా బిహైండ్ వుడ్స్ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన అవార్డ్ ఫంక్షన్ కు హాజరు అయ్యింది. అంతా బాగానే ఉన్నా.. ఆ ఇంటర్వ్యూలో ఆమెను ప్రంక్ పేరుతో కాసేపు బయపెట్టేశారు.

ప్రాంక్ స్టర్స్ అయిన ఆశిక్, సారథిరన్ ఆమెను ఇంటర్వ్యూ చేస్తున్న సమయంలోనే.. మధ్యలో ప్రాంక్ చేశారు. దీంతో కృతి భయపడిపోయి..చెమటలు పట్టేశాయి. ఆల్ మోస్ట్ కళ్లల్లో నీళ్ళు వచ్చేశాయి. ఇది గమానించిన వాళ్ళు ..ఇది ప్రాంక్ అంటూ ఓపెన్ అప్ అయయరు. అయినా కానీ కృతి తన ఏదూపును ఆపుకోలేకపోయింది..పాపం చిన్న పిల్లలా ఏడ్చేసింది. దీంతో వారు ఏమైంది ..సారీ సారీ అంటూ ఆమెను కూల్ చేశారు. ఇక ఆతరువాత నార్మల్ అయినా కృతిని వాళ్లు ఏమైందని ప్రశ్నించడంతో.. ఎవరైనా కఠినంగా మాట్లాడితే తనకు నచ్చదు అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news