Moviesబ్లాక్‌బ‌స్ట‌ర్ ' అఖండ‌ ' ను బాల‌య్య ఎవ‌రికి అంకితం ఇచ్చాడో...

బ్లాక్‌బ‌స్ట‌ర్ ‘ అఖండ‌ ‘ ను బాల‌య్య ఎవ‌రికి అంకితం ఇచ్చాడో తెలుసా…!

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ లేటెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ అఖండ‌. గ‌తేడాది డిసెంబ‌ర్లో రిలీజ్ అయిన ఈ సినిమా సూప‌ర్ హిట్ అయ్యి.. బోయ‌పాటి శ్రీను – బాల‌య్య కాంబినేష‌న్లో హ్యాట్రిక్ హిట్ అని ఫ్రూవ్ చేసింది. ఈ సినిమా 50, 100, 150 రోజులు దాటేసి తాజాగా 175 రోజులు పూర్తి చేసుకుంది. ఈ రోజుల్లో ఎంత పెద్ద హిట్ సినిమా అయినా డైరెక్టు 4 షోల‌తో 175 రోజులు ఆడ‌డం మామూలు విష‌యం కాదు. కానీ అఖండ ప‌ల్నాడు జిల్లా చిల‌క‌లూరిపేట‌లోని రామ‌కృష్ణ థియేట‌ర్లో డైరెక్టు 4 షోల‌తో 175 రోజులు పూర్తి చేసుకుని 200వ రోజు వైపు ప‌రుగులు పెడుతోంది.

బాల‌య్య – బోయ‌పాటి కాంబోలో వ‌చ్చిన సింహా, లెజెండ్ సినిమాలు రెండూ కూడా 175 రోజులు ఆడాయి. ఇప్పుడు అఖండ కూడా ఆ రెండు సినిమాల స‌ర‌స‌న చేరింది. క‌రోనా రెండో వేవ్ త‌ర్వాత థియేట‌ర్లు మూత‌ప‌డి అస‌లు థియేట‌ర్ల‌కు ప్రేక్ష‌కులు వ‌స్తారా ? రారా ? అన్న సందేహాలు ఉన్న వేళ అఖండ‌ను ధైర్యంగా రిలీజ్ చేశారు మేక‌ర్స్‌.

థియేట‌ర్ల‌కు పూర్వవైభ‌వం తీసుకువ‌చ్చిన ఘ‌న‌త మాత్రం అఖండ‌దే. ఇక చిల‌క‌లూరిపేట‌లో ఈ సినిమా 175 రోజులు ఆడ‌డంతో రామ‌కృష్ణ థియేట‌ర్లో జ‌రిగిన వేడుక‌ల్లో బాల‌య్య‌, ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను పాల్గొన్నారు. ఈ వేడుక‌ల్లో బాల‌య్య కేక్ క‌ట్ చేసి నిర్మాత‌, ఎగ్జిబిట‌ర్లు, డైరెక్ట‌ర్లు, ఫ్యాన్స్‌కు షీల్డులు అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా బాల‌య్య మాట్లాడుతూ అఖండ సినిమాను త‌న తండ్రి నంద‌మూరి తార‌క రామారావుకు అంకిత‌మిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

ఈ క్ర‌మంలోనే ఈ సినిమా ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను గురించి బాల‌య్య ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. తన‌కు బోయ‌పాటి శ్రీను అంటే ఎంతో న‌మ్మ‌కం అని… అత‌డు ఎంతో చిత్త‌శుద్ధితో ప‌ని చేస్తాడ‌ని బాల‌య్య మెచ్చుకున్నారు. ఇక థియేట‌ర్లో బాల‌య్య అభిమానులు మ‌ళ్లీ బాల‌య్య‌తో సినిమా కావాల‌ని అడ‌గ‌గా.. బోయ‌పాటి మాట్లాడుతూ తాను అన్నీ మీకంటే ఎక్కువ గుర్తు పెట్టుకుంటాన‌ని.. అన్నీ ఉంటాయ‌ని బోయ‌పాటి చెప్పాడు.

 

ఇక ప్ర‌స్తుతం మలినేని గోపీ సినిమా చేస్తోన్న బాల‌య్య ఆ త‌ర్వాత అనిల్ రావిపూడి సినిమా చేసి.. మ‌ళ్లీ బోయ‌పాటి శ్రీను సినిమా చేస్తాడు. 2024 ఎన్నిక‌ల‌ను దృష్టిలో ఉంచుకుని ఈ సినిమా ఉంటుంద‌ని.. పొలిటిక‌ల్ నేప‌థ్యంలో ఈ సినిమా ఉంటుంద‌ని స‌మాచారం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news