Moviesమహేశ్ జీవితంలో అలా జరుగుతుందని మేం ఎప్పుడు అనుకోలేదు..కృష్ణ సంచలన వ్యాఖ్యలు..!!

మహేశ్ జీవితంలో అలా జరుగుతుందని మేం ఎప్పుడు అనుకోలేదు..కృష్ణ సంచలన వ్యాఖ్యలు..!!

సోషల్ మీడీయా పుణ్యమా అని..ఒకప్పటి విషయాలను మళ్ళి గుర్తు చేసుకుంటున్నారు జనాలు. ముఖ్యంగా యూట్యూబ్ అందుబాటులోకి వచ్చాక చాలా మందికొత్త గా యూట్యూబ్ ఛానెల్స్ క్రియేట్ చేసి..వాళ్లకి సంబంధించిన మ్యాటర్స్ ..వాళ్ళకి తెలిసిన సలహాలు ఇస్తున్నారు. ఇక అదే క్రమంలో కొందరు స్టార్స్ కూడా ..ఇలా యూట్యూబ్ ఛానెల్స్ పెట్టి..అభిమానులకు మరింత దగ్గరవుతున్నారు. తద్వారా, తమ జీవితంలోని మధురమైన మూమెంట్స్ ని అభిమానులకు తెలియ జేస్తున్నారు.

ఈ క్రమంలోనే సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కూతురు మంజుల ఘట్టమనేని కూడా ఓ యూట్యూబ్ ఛానెల్ నడుపుతుంది. కాగా, రీసెంట్ గా తన తండ్రి కృష్ణ తో ఓ ఇంటర్వ్యూ తీసుకుంది. జనరల్ గా పెద్దగా బయట ఫంక్షన్ల కి రాని కృష్ణ..కూతురు కోసం ఈ ఇంటర్వ్యుల్లో పాల్గొన్నాడు. ఈ క్రమంలోనే అభిమానులకు తెలియని బోలెడు విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా ఈ ఇంటర్వ్యుల్లో మహేశ్ బాబుకి సంబంధించిన మ్యాటర్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

టాలీవుడ్ సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ వారసుడిగా సినీ ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టిన మహేష్ బాబు తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపు పొందాడు. ఇప్పటికే టాలీవుడ్ కి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను అందించిన మహేశ్ బాబు..తాజా గా మరోసారి సర్కారువారి పాట తో బాక్స్ ఆఫిస్ ని షేక్ చేశాడు. కాగా, మహేశ్ బాబు ఇంత పెద్ద స్టార్ అవుతారని అనుకున్నారా..? అని ప్రశ్న ఎదురవ్వగా..ఆయన ఇచ్చిన ఆన్సర్ అందరికి ఆశ్చర్యంగా అనిపించింది. కృష్ణ మాట్లాడుతూ..”అస్సలు మేం వాడు హీరో అవుతాడని అనుకోలేదు. చిన్నపుడే సూపర్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకోవడం చాలా గొప్ప విషయం.

ఇది అనుకొకుండ జరిగిపోయింది. నేను షూటింగ్ కు వెళ్తున్నప్పుడే ఓ రోజు నేనుకూడా వస్తాను అంటూ షూటింగ్‌ చూస్తానని చెప్పి స్టూడియోకు వచ్చాడు. అక్కడ సినిమా షూటింగ్‌ జరుగుతుంటే మహేశ్ దూరం నుంచి చూస్తు అలా నిలబడ్డాడు..అప్పుడు నేను దగ్గరి పిలిచి ..ఏం మహేశ్ ఒకసారి యాక్ట్‌ చేస్తావా అని అడిగాను..అంతే వామ్మో, నేను చేయను చేయను అంటూ స్టూడియో అంతా పరిగెత్తించాడు మమ్మల్ని..ఇప్పటికి ఆ రోజును నేను మర్చిపోలేను. ఇక ఇప్పుడు ఇంత పెద్ద స్టార్ అయ్యాడు..ఎన్నో మంచి పనులు చేస్తున్నాడు..చాలా గర్వంగా ఉంది’ అంటూ కృష్ణ చెబుతూ మురిసిపోయారు.ఇక మహెష్ బాబు కేవలం సినిమాలతోనే కాకుండా ఎన్నో సామాజిక సేవలతో ఇండ‌స్ట్రీలో ముందున్నాడు. ఇంకా మహేశ్ బాబు గురించి తన తండ్రి కృష్ణ ఏం చెప్పారో తెలుసుకోవాలంటే పూర్తి ఇంటర్య్వూ చూడాలంటే మే 31 వరకు ఆగాల్సిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news