Moviesఇండస్ట్రీలో లక్కి హీరో ఇతనే..ఎందుకంటే..?

ఇండస్ట్రీలో లక్కి హీరో ఇతనే..ఎందుకంటే..?

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ.. అభిమానులను మెప్పిస్తున్నాడు. సందీప్ కిష‌న్ వ‌రుస సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్టైన్ చేస్తూ ఉంటాడు. హిట్లు ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వినూత్న క‌థ‌ల‌ను ఎంచుకుంటూ సినీరంగంలో త‌నకంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పటి వరకు కెరీర్ లో ఆయనకు చెప్పుకోతగ్గ హిట్ ఉంది అంటే అది వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మాత్రమే. సినిమా లు చేసింది కూడా తక్కువే.. వాటిల్లో మనం గుర్తు పెట్టుకునే రేంజ్ సినిమాలు చాలా తక్కువ. కానీ , ఈ యంగ్ హీరో నేచురల్ యాక్టింగ్ కి బడా స్టార్స్ సైతం ఫిదా అవుతున్నారు. అందుకే డైరెక్టర్స్ పిలిచి అవకాశమిస్తున్నారు.


టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ తన సత్తా చాటుతున్నాడు. ఇటీవల ఆయన ఎంచుకుంటున్న సినిమాలు వైవిధ్యమైన కథాంశాలతో వస్తుండటంతో ప్రేక్షకులు వాటిని ఆదరిస్తున్నారు దీని ద్వారానే సందీప్ ఖాతాలో అమంచి మంచి సినిమాలు ఉన్నాయి. ఇక గల్లీ రౌడీ మూవీ తరువాత సందీప్ కిషన్ చాలా గ్యాప్ తీసుకున్నారు. మూవీకి కమిట్ అవ్వలేదు. లేట్ అయినా లేటెస్ట్ గా రావడానికి సందీప్ రెడీ అవుతున్నాడు. మైఖేల్ గా పలకరించడానికి వస్తున్నాడు సందీప్. గల్లీ రౌడీ మూవీ తరువాత సందీప్ చేస్తున్న మూవీ ‘మైఖేల్’. తొలిసారి కెరీర్‌లో పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నాడు ఈ యంగ్ హీరో. ఈ సినిమాను దర్శకుడు రంజిత్ జెయకోడి తెరకెక్కిస్తుండగా, పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమాను చిత్ర యూనిట్ తీర్చిదిద్దుతోంది.

శ‌నివారం సందీప్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ..మైకేల్ అనే త‌మిళ, తెలుగు చిత్రం ఫ‌స్ట్ లుక్ లాంచ్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో విజ‌య్ సేతుప‌తి, గౌత‌మ్ మీన‌న్ లాంటి ఆర్టిస్టులు కీల‌క పాత్ర‌లు చేస్తున్నారు. కాస్టింగ్, బ‌డ్జెట్ చూస్తే ఇది పెద్ద రేంజి సినిమాలాగే ఉంది.త‌మిళంలో పేరున్న నిర్మాత‌లు మంచి బ‌డ్జెట్లో చేస్తున్న సినిమా కావడంతో సినిమా పై ఎక్స్ పెక్టేషన్స్ భారీగానే ఉన్నాయి.

బడా బడా హీరోలు వరుసగా సినిమాలు చేస్తూ కోట్లు పారితోషకం తీసుకుంటున్నా రానీ ఆఫర్లు వరుస ఫ్లాప్ సినిమాలు పదుతున్న హీరోకి వస్తున్నాయంటే నిజంగానే ఇతను లక్కి హీరో అనాలి.కాగా కరోనా మహమ్మారితో తో చనిపోయిన వారి పిల్లల చదువులు, తినడానికి తిండి చూసుకుంటాన సందీప్ కెరీర్ లో మంచి మంచి సినిమాలు చేయ్యలని అభిమానులుకోరుకుంటున్నారు. ప్రస్తుతానికి సందీప్ చేతిలో మూడు సినిమాలున్నాయి. మూడు బడా సినిమాలే. ఈ మూడు హిట్ అయితే సందీప్ కెరీర్ ఫాంలోకి వస్తుందంటున్నారు సినీ విశ్లేషకులు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news