Moviesమ‌హేష్‌బాబు - త్రివిక్ర‌మ్ సినిమాలో నంద‌మూరి హీరో...!

మ‌హేష్‌బాబు – త్రివిక్ర‌మ్ సినిమాలో నంద‌మూరి హీరో…!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు – మాట‌ల మాంత్రికుడు త్రివిక్రమ్ కలయికలో రాబోతున్న క్రేజీ సినిమా గురించి ఏ అప్‌డేట్ వ‌చ్చినా ఆస‌క్తిగా ఉంటోంది. ఈ క్ర‌మంలోనే ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీద‌కు వెళుతుంది ? కాస్టింగ్ ఎవ‌రు ? అన్న వార్త‌లు వస్తుంటే మామూలు అంచ‌నాలు ఉండ‌డం లేదు. ఇప్ప‌టికే ప‌లానా హీరోయిన్ సెకండ్ హీరోయిన్‌గా న‌టిస్తోంది ? విల‌న్‌గా ఆ న‌టుడు న‌టిస్తున్నాడు అంటూ ఏదో ఒక వార్త వైర‌ల్ అవుతూనే ఉంది.

ఈ క్ర‌మంలోనే ఇప్పుడు ఈ సినిమాలో మ‌రో న‌టుడు పేరు వినిపిస్తోంది. ఈ సినిమా సెకండాఫ్‌లో ఓ రోల్ ఉంద‌ని.. ఆ రోల్లో నంద‌మూరి తార‌క‌ర‌త్న కూడా న‌టించ‌బోతున్నాడ‌ట‌. ఈ సినిమాలో తార‌క‌ర‌త్న‌ది నెగిటివ్ షేడ్ ఉన్న రోల్ అని తెలుస్తోంది. జూలై నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ స్టార్ట్ అయ్యే ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డే న‌టిస్తోంది.

ముందుగా మ‌హేష్‌పై సోలో సాంగ్‌తో పాటు ఓ ఫైట్‌ను షూట్ చేస్తార‌ట‌. ఆ త‌ర్వాత నార్త్ ఇండియాలో లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేస్తార‌ట‌. ఇక 2010లో వ‌చ్చిన ఖలేజా సినిమా త‌ర్వాత మ‌హేష్‌బాబు – త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్లో సినిమా వ‌స్తుండ‌డంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. గ‌తంలో అత‌డు, ఖ‌లేజా సినిమాలు మ‌హేష్ – త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్లో ఈ రెండు సినిమాలు మంచి పేరు తెచ్చుకున్నా క‌మ‌ర్షియ‌ల్‌గా మాత్రం స‌క్సెస్ కాలేదు.

ఈ సారి మాత్రం త్రివిక్ర‌మ్ మ‌హేష్‌కు ఎలాగైనా హిట్ ఇవ్వాల‌న్న క‌సితో అయితే ఉన్నాడు.భారీ కాస్టింగ్‌తో వ‌స్తున్నాడు. పూజాహెగ్డేకు తోడు ఇప్పుడు నంద‌మూరి వంశం హీరో తార‌క‌ర‌త్న‌ను కూడా తీసుకోవ‌డంతో సినిమాకు మ‌రింత హైప్ రావ‌డం ఖాయం. అర‌వింద స‌మేత‌వీర‌రాఘ‌వ‌, అల వైకుంఠ‌పురంలో లాంటి రెండు సూప‌ర్ హిట్ సినిమాల త‌ర్వాత త్రివిక్ర‌మ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాపై భారీ అంచ‌నాలే ఉన్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news