Moviesవావ్ కేక పెట్టించే కాంబినేష‌న్‌.. చిరంజీవి - ప్ర‌శాంత్ నీల్ సినిమా...

వావ్ కేక పెట్టించే కాంబినేష‌న్‌.. చిరంజీవి – ప్ర‌శాంత్ నీల్ సినిమా వ‌స్తోంది..!

ప్రస్తుతం ఇండియన్ సినిమా అంతా సౌత్ ఇండియా వైపు చూస్తోంది. ఒక‌ప్పుడు సౌత్ సినిమాలు అంటే నార్త్ వాళ్ల‌కు.. ముఖ్యంగా బాలీవుడ్ వాళ్ల‌కు చిన్న చూపు ఉండేది. అయితే ఇప్పుడు సౌత్ సినిమాలు వ‌స్తున్నాయంటే చాలు నార్త్ వాళ్లు.. ఇంకా చెప్పాలంటే బాలీవుడ్ అంతా భ‌య‌ప‌డుతోంది. బాలీవుడ్ వాళ్లు మూస ధోర‌ణిలో వెళుతుంటే సౌత్ సినిమా అంతా కొత్త‌ద‌నంతో కొత్త పుంత‌లు తొక్కుతోంది.

ఒక‌ప్పుడు సౌత్‌లో శంక‌ర్ లాంటి వాళ్లు చేసిన సినిమాలు మాత్ర‌మే కాస్తో కూస్తో నార్త్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునేవి. శంక‌ర్‌కు మాత్ర‌మే నార్త్‌లో క్రేజ్ ఉండేది. ఇక తెలుగు సినిమాలు అంటే ఎంతో చిన్న చూపు. అలాంటి వాళ్ల పొగ‌రు కింద‌కు దించేశాడు బాహుబ‌లి సినిమాతో రాజ‌మౌళి. ఇక బాహుబ‌లి 2 వ‌చ్చ‌కా అస‌లు ప్ర‌పంచ సినిమాయే తెలుగు సినిమా వైపు చూసేలా చేశాడు. ఆ క్రెడిట్ అంతా నూటికి నూరు శాతం రాజ‌మౌళికే ద‌క్కుతుంది.

ఆ త‌ర్వాత కేజీయ‌ఫ్ సినిమాతో క‌న్న‌డ సినిమా ఇండ‌స్ట్రీ అంటే కూడా బాలీవుడ్‌కు భ‌యం పుట్టేలా చేశాడు ప్ర‌శాంత్ నీల్‌. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా కేజీయ‌ఫ్ 2 వ‌స్తోంది. ఈ సినిమా ప్ర‌మోష‌న్లు జోరుగా న‌డుస్తున్నాయి. ఇక ప్ర‌శాంత్ నీల్ – తెలుగు హీరోల కాంబినేష‌న్లో వ‌రుస‌గా పాన్ ఇండియా సినిమాలు సెట్ అవుతున్నాయి. కేజీయ‌ఫ్ త‌ర్వాత ఇప్పుడు ప్ర‌భాస్ – నీల్ కాంబోలో స‌లార్ వ‌స్తోంది. పైగా స‌లార్ పార్ట్ 1, 2లుగా వ‌స్తోంది.

ఆ త‌ర్వాత నీల్ – ఎన్టీఆర్ కాంబినేష‌న్ కూడా దాదాపు సెట్ అయిన‌ట్టే. కొర‌టాల శివ త‌ర్వాత ఎన్టీఆర్ సినిమా నీల్‌తోనే ఉండే ఛాన్సులు ఉన్నాయి. ఇక ఇప్పుడు మ‌రో అదిరిపోయే అప్‌డేట్ వ‌స్తోంది. మెగాస్టార్ చిరంజీవి – ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్లో సినిమా వ‌చ్చే ఛాన్సులు ఉన్నాయి. మైత్రీ మూవీస్ వాళ్లు ఈ కాంబినేష‌న్‌ను సెట్ చేసే ప‌నిలో బిజీగా ఉన్నారు.

ఈ ప్ర‌య‌త్నాలు అయితే మొద‌ల‌య్యాయి. తాజాగా ప్ర‌శాంత్ నీల్ చేసిన వ్యాఖ్య‌ల‌తో కూడా ఈ కాంబినేష‌న్ షురూ అవుతోంద‌న్న చ‌ర్చ‌లు వ‌స్తున్నాయి. ప్ర‌శాంత్ నీల్ మాట్లాడుతూ త‌న సినిమాల్లో మాసీవ్ ఎలిమెంట్స్‌కు తెలుగు సినిమాలే చాలా వ‌ర‌కు ప్రేర‌ణ‌గా నిలిచాయ‌ని.. 1990ల్లో అయితే త‌న ఫేవ‌రెట్ హీరో మెగాస్టార్ అని స్వ‌యంగా చెప్పాడు.

చిరంజీవి గారిని అప్ప‌టి సినిమాల్లో చూపించిన విధానం కాని.. ఆయ‌న మాస్ ఎలివేష‌న్లు.. త‌న‌ను చాలా ప్ర‌భావితం చేశాయ‌ని నీల్ చెప్పాడు. అటు మైత్రీ వాళ్లు నీల్ – చిరు కాంబినేష‌న్ సెట్ చేసే ప్ర‌య‌త్నాలు చేస్తోన్న క్ర‌మంలోనే మ‌నోడు ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. నిజంగానే నీల్ – చిరు కాంబినేష‌న్ సెట్ అయితే చిరుకు పాన్ ఇండియా వైడ్‌గా అదిరిపోయే బొమ్మ ప‌డ‌డం ప‌క్కా..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news