Moviesఅవకాశం వస్తే ఖచ్చితంగా ఆమెతోనే.. యాష్ మాటలకు అంతా షాక్ ..!!

అవకాశం వస్తే ఖచ్చితంగా ఆమెతోనే.. యాష్ మాటలకు అంతా షాక్ ..!!

కన్నడ స్టార్ హీరో యష్..ఒక్కే ఒక్క సినిమాతో తన తల రాతను తానే మార్చేసుకున్నాడు. ‘కేజీఎఫ్’ సినిమాతో యాష్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన మెయిన్ టైన్ చేసిన గడ్డానికే సగం మంది అమ్మాయిలు ఫిదా అవుతున్నారు. KGF సినిమా విడుదలైన అన్ని భాషల్లో సూపర్ హిట్ అయ్యింది. ఒక్క సినిమాతో యష్ కు అన్ని భాషల్లో అభిమానులు పెరిగిపోయారు అనడంలో సందేహం లేదు.

ఇక రీసెంట్ గానే ఈ సూపర్ స్టార్ నుంచి ‘కేజీఎఫ్ 2’ సినిమా వచ్చి..బాక్స్ ఆఫిస్ దగ్గర రికార్డ్ల సునామి సృష్టిస్తుంది. ఖ్ఘ్F2 సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దీంతో ఇప్పుడు బాలీవుడ్ స్టార్స్ సైతం అతనితో సినిమాలు చేయడానికి సిద్ధమౌతున్నారు. కన్నడ స్టార్ యశ్ క్రేజ్ ఇప్పుడు అంతలా పెరిగిపోయింది. సినీ ప్రేమికులు అతడి పేరునే జపం చేస్తున్నారు. ముఖ్యంగా ఆ Violence Dialogue ని బాగా హైలెట్ చేస్తున్నారు. సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో..యాష్ కి బాగా పాపులారిటీ పెరిగిపోయింది.

కోలీవుడ్, బాలీవుడ్ సహా అన్ని ఇండస్ట్రీల్లో అతడి పేరు వినిపిస్తోంది.. అతడికి మహిళా అభిమానులు కూడా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. చాలా మంది బాలీవుడ్ నటీమణులు ఇప్పుడు అతనితో కలిసి పనిచేయాలనుకుంటున్నారు. అయితే తాజా పాల్గొన్న ఇంటర్వ్యుల్లో యాష్ తన మనసులోని మాట బయటపెట్టేశారు. “మీరు బాలీవుడ్ లో సినిమాలు చేసే అవకాశం వస్తే..హీరోయిన్ గా ఎవరిని చూస్ చేసుకుంటారు”..? అని ప్రశ్నించగా..

యష్ రిప్లై ఇస్తూ..”ఇప్పడు..ఎప్పుడు నాకు ఇష్టమైన హీరోయిన్ దీపిక పదుకుణే. ఆమె యాక్టింగ్ స్టైల్ నాకు చాలా ఇష్టం. ఆమె నటించిన అన్ని సినిమాలు మిస్ కాకుండా చూస్తాను. ఆమె నటన అద్భుతంగా ఉంటుంది. ఖచ్చితంగా ఆమె తో సినిమా చేసే అవకాశం వస్తే చేస్తాను. ఆమెతో కలిసి నటించాలనేది తన కోరిక అంటూ ఓపెన్ అయ్యారు. KGF సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన యష్ ఇలా దీపికపై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపడంతో ఇరువురి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. మరికొందరు అయితే యాష్ ఎక్కడ..దీపికా ఎక్కడ.. అంటూ యాష్ ని పొగిడేస్తూ..దీపికాని ని చులకనగా చేస్తున్నారు. మొత్తానికి తవరలో నే యాష్ కోరిక తీరబోతున్నాట్లు తెలుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news