Moviesఇలియానా సూసైడ్‌... షాకింగ్ కార‌ణాలు..!

ఇలియానా సూసైడ్‌… షాకింగ్ కార‌ణాలు..!

టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగిన స‌న్న న‌డుము సుంద‌రి ఇలియానా ప్ర‌త్యేక ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. తొలి సినిమా దేవదాసు ద‌గ్గ‌ర నుంచే ఆమె త‌న బ‌క్క‌పల్చ‌ని అందాల‌తో కుర్రాళ్ల‌ను టార్గెట్ చేసింది. ఆ త‌ర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. పోకిరి సినిమాతో ఏకంగా కుర్ర‌కారు గుండెళ్లో కాపుర‌మే పెట్టేసింది. ద‌శాబ్దం పాటు ఎంత‌మంది హీరోయిన్లు వ‌చ్చినా ఆమె టాలీవుడ్‌ను ఏలేసింది. స్టార్ హీరోల ప‌క్క‌న వ‌రుస పెట్టి ఛాన్సులు ద‌క్కించుకుంది.

అయితే ఇక్క‌డ కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండ‌గానే బాలీవుడ్‌లో రాణించాల‌ని క‌ల‌లు క‌ని అక్క‌డ‌కు చెక్కేసింది. అయితే అక్క‌డ ఆమె ఆశ‌లు నెర‌వేర‌లేదు. అదే స‌మ‌యంలో ప్ర‌ముఖ ఆస్ట్రేలియా ఫొటోగ్రాఫ‌ర్ ఐ ఆండ్రూతో పీక‌ల్లోతు ప్రేమ‌లో ప‌డ‌డం పాటు కొన్నేళ్లు స‌హ‌జీవ‌నం చేసింది. పైగా త‌న‌కు శృంగారం అంటే ఎంతో ఇష్టం అని.. శృంగారం లేకుండా తాను ఉండ‌లేనంటూ పిచ్చి పిచ్చిగా బోల్డ్ స్టేట్‌మెంట్లు కూడా ఇచ్చింది.

పెళ్లికి ముందే ఆమెకు ప్రెగ్నెంట్ వ‌చ్చిన‌ట్టు కూడా ఆమెపై వ‌చ్చిన క‌థ‌నాలు హీటెక్కించేశాయి. అయితే ఆ త‌ర్వాత ఆండ్రూ ఆమెను మోసం చేయ‌డంతో ఆమె అబార్ష‌న్ చేయించుకుని ఆత్మ‌హ‌త్య‌కు సైతం ప్రేరేపించింద‌న్న ప్ర‌చారం జ‌రిగింది. ఈ వార్త‌లు బాగా వైర‌ల్ అయ్యాయి. దీనికి తోడు ఇలియానా ఫిజిక్ కూడా బాగా మారిపోయింది.

అయితే ఈ వార్త‌ల‌పై ఇలియానా క్లారిటీ ఇచ్చింది. తాను సూసైడ్ చేసుకునేందుకు ప్ర‌య‌త్నించ‌లేద‌ని.. తాను బాగానే ఉన్నాన‌ని చెప్పింది. అయితే ఆమె సూసైడ్ వార్త‌లు ఖండించినా తీవ్ర‌మైన డిప్రెష‌న్‌లోకి వెళ్లిపోయింద‌న్న‌ది నిజం. బాగా లావెక్కిపోయిన ఇలియానా ఇప్పుడిప్పుడే కాస్త స‌న్న‌బ‌డేందుకు ట్రై చేస్తోంది. ఆమె బాడీ షేమింగ్‌పై కూడా మామూలుగా కామెంట్లు రాలేదు.

ఇక ఇలియానా ఇప్పుడు బాలీవుడ్‌లో రెండు, మూడు సినిమాలు చేస్తోంది. ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ బికినీలు వేసుకుని బీచ్‌ల్లో పోజులు ఇస్తూ కుర్రాళ్ల‌కు హీటెక్కిస్తూనే ఉంటుంది. ఆమె తెలుగులో చివ‌రిసారిగా శ్రీను వైట్ల ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ర‌వితేజ అమర్ అక్భర్ ఆంటోనిలో న‌టించింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news