Moviesఓరి నీ దుంప తెగ.. ఇంత ఓవర్ యాక్టింగ్ అవసరమా..వ‌రుణ్ పరువుపాయ్యే..!

ఓరి నీ దుంప తెగ.. ఇంత ఓవర్ యాక్టింగ్ అవసరమా..వ‌రుణ్ పరువుపాయ్యే..!

సమంత..స్టార్ హీరోయిన్ ప్లేస్ కాపుడుకొవదానికి విడాకుల తరువాత కూడా క్షణం కూడా టైం వేస్ట్ చేయకుండా..వరుస సినిమాలకు కమిట్ అవుతూ బిజీగా ఉంది. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’తో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన సమంత… ఈ సిరీస్ ద్వారా ఎంత మ్మచి పేరు దక్కించుకుందో అందరికి తెలిసిందే. అశేష ప్రేక్షకాదరణ దక్కింది. ఇందులో సమంత పెర్ఫార్మన్స్ కి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అంతేకాదు ఆమె నటించిన బోల్డ్ పెర్ఫార్మన్స్ తో బడా స్టార్స్ ని కూడా ఆకట్టుకుంది సమంత.

కాగా ఇప్పుడు మరో వెబ్ సిరీస్ లో కూడా నటించడానికి సిద్ధమైంది ఈ బ్యూటీ. ఇందులో భాగంగానే ఫ్యామిలీ మ్యాన్‌ సిరీస్‌ను తెరకెక్కించిన రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వంలోనే మరో వెబ్‌సిరీస్‌కు పచ్చ జెండా ఊపింది. స్పై థ్రిల్లర్‌ యాక్షన్‌ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్‌లో వ‌రుణ్ ధావ‌న్ హీరోగా న‌టిస్తున్నారు. సిటడెల్‌ అనే వెబ్‌సిరీస్ కోసం స‌మంత‌, వ‌రుణ్ ధావ‌న్ జత కడుతున్నారు. ఈ క్రమంలో ఈ ప్రాజెక్ట్‌ టీం గత రాత్రి సమావేశమాయ్యారు. మీటింగ్‌ అనంతరం సమంత, వరుణ్‌ తిరిగి వెళ్లిపోతున్న సందర్భంలో ఫోటో జర్నలిస్టులు తెగ హడావిడి చేశారు.

దీంతో వరుణ్..అక్కడున్న జర్నలిస్టులు పై అరుస్తూ..”తనని భయపెట్టకండి” అంటూ..సమంతని దగ్గరుండి కార్ వరకు తీసుకెళ్ళి కారు ఎక్కించి పంపించారు. ఇక ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో..నెటిజన్స్ వరుణ్ పై ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. నీ ఓవర్ యాక్టింగ్ కాకపోతే సమంత లాంటి స్టార్ హీరోయిన్ కి ఇలాంటివి కొత్త కాదు..ఇలాంటి సిట్యూవేషన్ ఆమె చూడనిది కాదు..ఆమె ముందు నువ్వు పిల్ల బచ్చావి అంటూ మీమ్‌స్ తో ట్రోలింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె ‘యశోద’ అనే సినిమాలో నటిస్తోంది. దీని తరువాత బాలీవుడ్ లోనే ఓ సినిమా చేయబోతుందని.. దానికి తాప్సి నిర్మాతగా వ్యవహరించనుందని మాటలు వినిపిస్తున్నాయి. ఇవి కాకుండా అమ్మడు చేతిలో మరో రెండు సినిమాలు ఉన్నాయి.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news