Moviesఎన్టీఆర్‌ కు అక్కగా మహేష్ హీరోయిన్..కేక పెట్టించే కాంబో సెట్ చేసిన...

ఎన్టీఆర్‌ కు అక్కగా మహేష్ హీరోయిన్..కేక పెట్టించే కాంబో సెట్ చేసిన కొరటాల..

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ – డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో ఓ సినిమా వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. ఎన్టీఆర్ కెరీర్‌లో 30వ సినిమాగా ఈ క్రేజీ ప్రాజెక్టు వ‌స్తోంది. ఎన్టీఆర్ తో ఇప్పటికే జనతా గ్యారేజ్ సినిమాను చేసిన కొరటాల శివ మరోసారి అదిరిపోయే క‌మ‌ర్షియ‌ల్ బ్లాక్‌బ‌స్ట‌ర్ ఇస్తాడ‌ని ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆశ‌తో ఉన్నారు. నిజానికి ఈ సినిమా అనౌన్స్ చేసి చాలా కాలమే అవుతుంది..కానీ ఇప్ప‌ట‌కీ కూడా షూటింగ్ ప్రారంభించ‌లేదు. అన్ని అనుకున్నట్లు జరిగి ఉంటే ఈ టైంకి RRR రిలీజ్ అయిపోయి.. ఎన్టీఆర్ – కొరటాల సినిమా షూటింగ్ స్టార్ట్ అయిపోయుండాలి. కానీ అలా జరగలేదు. దీంతో తారక్ అభిమానులు కొర‌టాల‌పై గుర్రుతో ఉన్నారు.

అయితే ఈ సినిమాను నందమూరు ఫ్యాన్స్ కు నచ్చే అన్ని ఎలిమెంట్స్ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారట శివ. అంతేకాదు ఈ సినిమా ను పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కించే విధంగా ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాలో హీరోయిన్‌గా ఆలియాభ‌ట్ ఫైన‌లైజ్ అయ్యింది. కాగా ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉందని..ఆ రోల్ కోసం సమంత ని తీసుకునే ప్లాన్ లో ఉన్నట్లు మేకర్స్ తెలుస్తుంది. కాగా ఈ సినిమాలో హీరోయిన్లకు సమానంగా ఉండే ఓ సిస్టర్ రోల్ ఉందని..ఇక ఆ పాత్ర కోసం కొరటాల బాలీవుడ్ బ్యూటీ సోనాలీ బింద్రేను ఫిక్స్ చేసిన్నట్లు తెలుస్తుంది.

మురారి సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ బాలీవుడ్‌ బ్యూటీ సోనాలీ బింద్రే..అప్పట్లో ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది. తొలి సినిమానే సూపర్‌ హిట్‌ కావడంతో ఆ తర్వాత డైరెక్టర్లు వరుసగా ఆఫర్లు ఇస్తూ అమ్మడుని టాప్ ప్లేస్ లో నిల్చోపెట్టారు. ‘ఖడ్గం, మన్మధుడు, ఇంద్ర,శంకర్ దాదా ంభ్భ్స్ వంటి పలు సూపర్‌ హిట్‌ చిత్రాల్లో నటించి స్టార్ స్టేటస్ సంపాదించుకుంది సోనాలీ.

 

పెళ్లి తరువాత సినిమాలకు దూరమైన ఈ అమ్మడు… కొన్నాళ్ల క్రితం ఆమె క్యాన్సర్‌ బారిన పడి… అమెరికాలోని న్యూయార్క్‌లో చికిత్స తీసుకొని పూర్తిగా కోలుకుంది. దాదాపు 18ఏళ్ళ తరువాత సినిమాలోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధపడింది. దీంతో కొరటాల తాను తెరకెక్కించే సినిమాలో ఎన్టీఆర్‌ కు అక్కగా ఓ క్యారెక్టర్ ఫిక్స్ చేసిన్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. దీని పై మరికొన్ని రోజుల్లోనే అఫిషీయల్ ప్రకటన రానున్నట్లు తెలుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news