Gossipsఎట్టకేలకు ఐటెం సాంగ్ చేయబోతున్నరష్మిక..ఆ బడా హీరో సినిమాలోనే ..?

ఎట్టకేలకు ఐటెం సాంగ్ చేయబోతున్నరష్మిక..ఆ బడా హీరో సినిమాలోనే ..?

ప్రజెంట్ వస్తున్న సినిమాలో ఐటెం సాంగ్ కంపల్సరీ అయిపోయింది. పెద్ద హీరో నుంచి చిన్న హీరో వరకు ఏ సినిమాలోనైనా ఐటమ్ సాంగ్ ఉండాల్సిందే. ఒకప్పుడు సినిమాల్లో ఐటమ్ సాంగ్ అంటే ప్రత్యేకించి కొందరు నటులు మాత్రమే ఐటమ్ సాంగ్ చేసేవాళ్లు. కానీ రానురాను ఐటమ్ సాంగ్స్ కు పెరిగిన క్రేజ్ తో పెద్ద హీరోయిన్లు కూడా ఐటమ్ సాంగ్ చేస్తామంటూ ముందుకోస్తున్నారు. అంతే కాదు.. జనాలకు కూడా ఎక్స్ పెక్ట్ చేసినంత కిక్కిస్తోంది. సినిమాకు హీరో, హీరోయిన్లతో పాటు.. స్పెషల్ సాంగ్ కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.

ఐదు నిమిషాల పాటు అందాలు ఆరబోసేందుకు కోట్ల రూపాయలు రెమ్యునురేషన్ తీసుకుంటున్నారు. ఇలా ఆల్ మోస్ట్ అందరూ హీరోయిన్లు ఐటెం సాంగ్ చేయడానికి ముందుకోస్తున్నారు. జ‌న‌తా గ్యారేజ్‌లో కాజ‌ల్ అగ‌ర్వాల్‌..గ‌నికి అంత‌కు ముందు అల్లుడు శీను, కె.జి.య‌ఫ్, స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రాల్లో త‌మ‌న్నా.. రంగ‌స్థలంలో పూజా హెగ్డే స్పెష‌ల్ సాంగ్స్‌లో మెరిశారు, అభిమానుల‌ను అల‌రించారు.

ఈ మధ్యనే సమంత కూడా పుష్ప సినిమాలో “ఊ అంటావా మావ ఊ ఊ అంటావా మావ” సాంగ్ కు మాస్ స్టెప్పులేసి ఇరగదీసింది. ఈ పాట సృషిటించిన హంగామా అంత ఇంతాకాదు. ఇప్పటికీ ఈ పాట ఓ ఊపు ఊపేస్తుంది. అయితే తాజా గా ఈ లిస్ట్ లో కన్నడ బ్యూటీ రష్మిక కూడా చేరిపోయిన్నత్లు తెలుస్తుంది. యస్..తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం..రష్మిక ఓ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన్నట్లు తెలుస్తుంది.

అర్జున్ రెడ్డితో టాలీవుడ్‌లో సెన్సేషన్ సృష్టించిన సందీప్ వంగా..ఇప్పుడు బాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ల లిస్ట్ లో ఉన్నాడు. ఈ క్రమంలోనే మరో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకొవడానికి బాగా ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరో రణభీర్ కపూర్ తో ఓ మూవీ తెరకెక్కిస్తున్నాడు సందీప్. కాగా ఈ సినిమాలో పరిణీతి చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా… స్పెషల్ సాంగ్ కోసం రష్మిక ను ఫైనల్ చేశారట సందీప్.

ఆమె డేట్స్ కోసం సందీప్ వంగా ట్రై చేస్తున్నాడనే టాక్ గట్టిగా వినిపిస్తుంది. సందీప్ లాంటి డైరెక్టర్ అడిగితే రష్మిక కాదు అంటుందా,..పైగా ఆయన పెద్ద మాయగాడు అనే పేరుకూడా ఉంది. ఆయన ఎవ్వరినైనా ఒప్పించేగల సత్త ఉన్నోడు అని టాక్ ఉంది. స్టార్ హీరోయిన్ గా తెలుగు, త‌మిళం, హిందీ, క‌న్న‌డ భాష‌ల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో న‌టిస్తూ స్టార్ స్టేట‌స్‌తో బిజీగా ఉన్న ర‌ష్మిక మ‌రి స్పెష‌ల్ సాంగ్‌లో క‌నిపిస్తుందా..? లేదా అనేది చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news