Newsబాల‌య్య అఖండ - 2పై అదిరిపోయే అప్‌డేట్ వ‌చ్చేసింది...!

బాల‌య్య అఖండ – 2పై అదిరిపోయే అప్‌డేట్ వ‌చ్చేసింది…!

బాల‌య్య కెరీర్ ఎప్పుడు కాస్త డౌన్‌లో ఉన్నా బోయ‌పాటి ఎంట్రీ ఇచ్చి బాంబు పేలిన‌ట్టు స్వింగ్ చేస్తాడు. సింహాకు ముందు బాల‌య్య‌కు అన్ని ప్లాపులే. ఆ సినిమాతో బాల‌య్య ఫుల్ ఫామ్లోకి రావడంతో పాటు సూప‌ర్ హిట్ త‌న ఖాతాలో వేసుకున్నాడు. సింహా త‌ర్వాత బాల‌య్య మ‌రో ఐదారేళ్లు వెన‌క్కు తిరిగి చూసుకునే ఛాన్స్ రాలేదు. 2010లో వ‌చ్చిన సింహా త‌ర్వాత నాలుగేళ్లు బాల‌య్య‌కు స‌రైన బొమ్మ ప‌డ‌లేదు. క‌ట్ చేస్తే 2014 ఎన్నిక‌ల‌కు ముందు మ‌రోసారి బాల‌య్య – బోయ‌పాటి కాంబోలో వ‌చ్చిన లెజెండ్ సినిమా బాల‌య్య ఖాతాలో తిరుగులేని హిట్ ఇవ్వ‌డంతో పాటు ఆ ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీ కేడ‌ర్‌కు సైత మాంచి ఊపు ఇచ్చింది.

లెజెండ్ తిరుగులేని బ్లాక్‌బ‌స్ట‌ర్‌. ఏకంగా రెండు కేంద్రాల్లో 400 రోజులు.. ఓ కేంద్రంలో అయితే 1000 రోజులు ఆడింది. ఇక క‌రోనా దెబ్బ‌తో ఇండ‌స్ట్రీ అంతా అత‌లాకుత‌లం అవుతోన్న టైంలో బాల‌య్య డేర్ చేసి అఖండ‌ను థియేట‌ర్ల‌లోకి వ‌దిలేశారు. అఖండ గ‌ర్జ‌న ముందు ప్రేక్ష‌కులు పూన‌కాల‌తో ఊగిపోయారు. అఖండ అలాంటి ఇలాంటి విజ‌యం న‌మోదు చేయ‌లేదు. బాల‌య్య అభిమానులే కాదు.. మాస్ జ‌నాలు కూడా రెండు మూడు సార్లు థియేట‌ర్ల‌కు వ‌చ్చి మ‌రీ సినిమాను ఎంజాయ్ చేశారు.

అందుకే అఖండ‌కు ఇంత అఖండ విజ‌యం సాధ్య‌మైంది. తాజాగా 20 కేంద్రాల్లో 100 రోజులు ( 4 డైరెక్ట్ + 16 షిఫ్టులు) పూర్తి చేసుకుంది. ఇక గ‌తంలోనే బోయపాటి అఖండ‌కు సీక్వెల్‌గా అఖండ 2 వ‌స్తుంద‌ని చెప్పారు. తాజాగా అఖండ 100 రోజుల ఫంక్ష‌న్ నేప‌థ్యంలో అఖండ 2 గురించి బోయ‌పాటిని విలేక‌ర్లు అడిగితే.. అందుకు స్క్రిఫ్ట్ రెడీ చేసేందుకు కొంత టైం ప‌డుతుంద‌ని… అఖండ 2 ఎప్పుడు వ‌చ్చినా కూడా నంద‌మూరి అభిమానుల‌ను మెప్పించి.. బాల‌య్య‌కు బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ ఇచ్చేలా ఉంటుంద‌ని బోయ‌పాటి తెలిపారు.

అయితే అఖండ 2 బాల‌య్య‌తో ఎప్పుడు తెర‌కెక్కిస్తారు ? అన్న‌ది మాత్రం చెప్ప‌లేదు. ప్ర‌స్తుతం బాల‌య్య 107వ సినిమా చేస్తున్నాడు. మ‌లినేని గోపీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా త‌ర్వాత అనిల్ రావిపూడి సినిమా ఉంది. ఆ త‌ర్వాత మ‌హేష్ – రాజ‌మౌళి సినిమాలో కూడా బాల‌య్య 40 నిమిషాల రోల్ చేస్తున్నాడ‌ని అంటున్నారు. ఇక ఆ లోగా బోయ‌పాటి యంగ్ హీరో రామ్‌తో మ‌రో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. ఆ సినిమా పూర్త‌య్యాకే అఖండ 2 గురించి బోయ‌పాటి ఆలోచ‌న చేయ‌వ‌చ్చు. ఇదంతా ఏ 2024లోనో జ‌రిగే అవ‌కాశాలు ఉన్నాయి. అప్ప‌టి వ‌ర‌కు అఖండ 2 గురించి నిరీక్ష‌ణ త‌ప్ప‌దు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news