Moviesత‌న మాజీ భ‌ర్త రాస‌లీల‌లు భ‌య‌పెట్టిన హీరోయిన్‌.. అందుకే విడిపోయాన‌ని సంచ‌ల‌నం..!

త‌న మాజీ భ‌ర్త రాస‌లీల‌లు భ‌య‌పెట్టిన హీరోయిన్‌.. అందుకే విడిపోయాన‌ని సంచ‌ల‌నం..!

సారా ఖాన్ – ఆలీ మ‌ర్చంట్ ప్రేమ ఓ సెన్షేష‌న్‌. వీరి ప్రేమ వ్య‌వ‌హారం అటు బాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కే కాదు.. ఇటు సౌత్ ప్రేక్ష‌కుల‌కు కూడా తెలిసిందే. వీరిద్ద‌రు బిగ్‌బాస్ వేదిక మీదే పెళ్లిచేసుకున్నారు. బిగ్‌బాస్ ప్రేక్ష‌కులే వీరి పెళ్లికి సాక్షులు. వీరి పెళ్లి అనేక నాట‌కీయ ప‌రిణామాల మ‌ధ్య జ‌రిగింది. ఎంత విచిత్రంగా వీరి పెళ్లి జ‌రిగిందో అంతే నాట‌కీయంగా వీరు విడిపోయారు. కేవ‌లం మూడంటే మూడు నెల‌ల్లోనే వీరి ఒక‌రిపై మ‌రొక‌రు కోపంతో విడిపోవ‌డం సంచ‌ల‌నంగా మారింది.

అస‌లు వీరు ఎందుకు ప్రేమించుకున్నారు ? ఎందుకు పెళ్లి చేసుకున్నారు ? ఎందుకు విడిపోయారో ఎవ్వ‌రికి అర్థం కాదు. అస‌లు వీరు విడిపోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం ఏంట‌న్న‌ది చాలా మందికి తెలియ‌దు. దీనిపై సారా ఖాన్ తాజాగా క్లారిటీ ఇచ్చింది. బాలీవుడ్ కాంట్ర‌వ‌ర్సీ క్వీన్ కంగ‌నా ర‌నౌత్ హెస్ట్ ఉన్న టాక్ షో లాక‌ప్ షోకు సారా ఖాన్ గెస్ట్‌గా వ‌చ్చింది. ఈ షోలో త‌న మాజీ భ‌ర్త‌కు సంబంధించి ప‌లు షాకింగ్ విష‌యాలు బ‌య‌ట పెట్టింది.

ఆలీ మ‌ర్చంట్‌కు ఉన్న అక్ర‌మ సంబంధాల కార‌ణంగానే తాను అత‌డికి దూరం అయ్యాన‌ని సారా చెప్పింది. ఆలీకి లోఖండ్ వాలాలో ఓ స్పా ఉండేద‌ని.. అక్క‌డ అమ్మాయిల‌తో అత‌డు చాలా దారుణంగా బిహేవ్ చేసేవాడ‌ని.. ఆ సంబంధాల‌ను తాను చాలా సార్లు చూశాన‌ని. అత‌డికి అలా చేయ‌డం క‌రెక్ట్ కాద‌ని రెండు, మూడు వంద‌ల సార్లు చెప్పి చూశానిన‌.. వేరే అమ్మాయిల‌తో అక్ర‌మ సంబంధాలు పెట్టుకోవడంపై తాను నిల‌దీసినా.. అత‌డి ప్ర‌వ‌ర్త‌న‌లో మార్పు లేద‌ని. అందుకే విడాకులు ఇవ్వాల్సి వ‌చ్చింద‌ని చెప్పింది.

ఆలీ మ‌ర్చంట్ వేరే అమ్మాయిల‌తో ఉన్న‌ప్పుడు కూడా తాను ప‌ట్టించుకోలేదు.. అత‌డిని తాను చాలా ప్రేమించాను.. అత‌డితో త‌న జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంద‌ని అనుకున్నాను.. అయితే అందుకు అత‌డు అర్హుడు కాద‌ని త‌న‌కు అర్థ‌మైంద‌ని.. అందుకే విడిపోయాన‌ని చెప్పింది. తాను త‌న జీవితంలో మ‌రింత ముందుకు వెళ్లేందుకే అత‌డికి దూరం అయ్యాన‌ని కూడా సారా తెలిపింది.

మ‌నం ఎంతో ఇష్టంగా ప్రేమించిన వ్య‌క్తి ఇత‌రుల‌తో సంబంధాలు పెట్టుకున్నాడ‌ని తెలిసిన‌ప్పుడు అంత‌కు మించిన బాధ ఏం ? ఉంటుంద‌ని కూడా సారా ప్ర‌శ్నించింది. అలాంటి బాధ‌ను తాను చాలా త‌క్కువ టైంలోనే ఎక్కువ సార్లు ప‌డాల్సి వ‌చ్చింద‌ని త‌న ఆవేద‌న అంతా చెప్పుకుని భోరుమంది. సారా మాత్ర‌మే కాదు.. ఇటీవ‌ల కాలంలో ఈ షోలో పాల్గొన్న చాలా మంది త‌మ ఆవేద‌న, ఇత‌ర విష‌యాల‌పై ఓపెన్ అవుతూ ఉండ‌డంతో ఈ షోకు తిరుగులేని రేటింగ్ ద‌క్కుతోంది.

Latest news