Moviesతండ్రి కాబోతోన్న దిల్ రాజు... పుట్టేది వార‌సుడేనా ?

తండ్రి కాబోతోన్న దిల్ రాజు… పుట్టేది వార‌సుడేనా ?

టాలీవుడ్‌లో అగ్ర నిర్మాత దిల్ రాజు ప్ర‌స్థానం ఎంత విజ‌య‌వంత‌మైందో తెలిసిందే. కాస్ట్యూమ్స్ కృష్ణ స‌హ‌కారంతో చిన్న డిస్ట్రిబ్యూట‌ర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన దిల్ రాజు ఈ రోజు నైజాం డిస్ట్రిబ్యూష‌న్ శాసించే కింగ్‌గా ఎదిగాడు. ఇక 2003లో వివి. వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో నితిన్ హీరోగా వ‌చ్చిన దిల్ సినిమాతో రాజు నిర్మాత అయ్యారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై నిర్మించిన దిల్ సినిమా సూప‌ర్ హిట్ అయ్యింది.

ఆ త‌ర్వాత వ‌రుస హిట్ల‌తో రాజు ఇండ‌స్ట్రీలో మ‌హామ‌హా నిర్మాత‌ల‌నే తొక్కి ప‌డేశారు. ఒకానొక టైంలో స్టార్ హీరోల‌కు వ‌రుస‌గా అడ్వాన్స్‌లు ఇస్తూ వాళ్ల డేట్లు అన్నీ బ్లాక్ చేసి పెద్ద సినిమాలు తీసి హిట్లు కొట్టారు. ఇక డిస్ట్రిబ్యూష‌న్ రంగంలో నైజాంలో రాజుకు తిరుగులేదు. ఒకానొక టైంలో రాజు డిస్ట్రిబ్యూట్ చేసిన సినిమాలు అన్నీ సూప‌ర్ హిట్‌. అలాగే ఆయ‌న తీసిన సినిమాలు అంతే హిట్‌. దీంతో రాజు జ‌డ్జ్‌మెంట్ అంటేనే ఇండ‌స్ట్రీలో ఒక గురి ఉండేది.

రాజు జ‌ర్నీలో సోద‌రుడు శిరీష్‌తో పాటు భార్య దివంగ‌త అనిత ప్రోత్సాహం ఎప్పుడూ ఉండేది. అయితే రాజు 2017లో అమెరికాలో ఉన్న టైంలో అనిత గుండెపోటుతో మృతి చెందారు. రాజు ఒంట‌రిగా ఉండ‌డం ఇష్టంలేని కుమార్తె హ‌న్షితా రెడ్డి త‌న తండ్రికి ఈ వ‌య‌స్సులో తోడు కావాల‌ని ప‌ట్టుబ‌ట్టి మ‌రీ రెండో పెళ్లి చేసింది. నిజామాబాద్‌లో కొద్ది మంది స‌న్నిహితుల స‌మక్షంలో తేజ‌స్వినిని వివాహం చేసుకున్నారు. లాక్‌డౌన్ టైంలో ఈ పెళ్లి జ‌ర‌గ‌డంతో కొద్ది మంది స‌న్నిహితులే హాజ‌ర‌య్యారు.

ఇక ఇప్పుడు దిల్ రాజు త‌న రెండో భార్య ద్వారా మ‌రోసారి తండ్రి కాబోతున్నాడ‌న్న వార్త‌లు ఇండ‌స్ట్రీ ఇన్న‌ర్ స‌ర్కిల్స్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. రాజు భార్య తేజ‌స్విని ప్రెగ్నెంట్ అని టాక్ ? ఇక రాజుకు మొద‌టి భార్య అనిత ద్వారా ఒక కుమార్తె హ‌న్షిత మాత్ర‌మే ఉన్నారు. ఆయ‌న‌కు వార‌సులు లేరు. అయితే ఇప్పుడు తేజ‌స్విని ప్రెగ్నెంట్ అన్న వార్త‌ల‌తో ఆయ‌న‌కు వార‌సుడు లేని కోరిక తీర‌బోతోంద‌ని కూడా ఆయ‌న కాంపౌండ్‌లో సంబ‌రాలు షురూ అయ్యాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news