Moviesఎన్టీఆర్‌పై క‌న్నేసిన శ్రీలీల‌.. వీడియోల‌తో దొరికేసిందిగా..!

ఎన్టీఆర్‌పై క‌న్నేసిన శ్రీలీల‌.. వీడియోల‌తో దొరికేసిందిగా..!

ద‌ర్శ‌క‌ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ నెల 25న గ్రాండ్ రిలీజ్ అవుతోంది. ఈ సినిమాపై ఏ స్థాయిలో అంచ‌నాలు ఉన్నాయో చెప్ప‌క్క‌ర్లేదు. ఇప్ప‌టికే రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు టిక్కెట్ రేట్లు పెంచుకునేందుకు స్వ‌యంగా హామీ ఇచ్చారు. ఏపీ, తెలంగాణ‌లో అద‌న‌పు షోల విష‌యంలోనూ ప్ర‌భుత్వాలు ఫుల్లుగా కోప‌రేట్ చేస్తున్నాయి. విచిత్రంగా ఇది తెలుగు సినిమా అయినా క‌ర్నాక‌ట సీఎం బ‌స‌వ‌రాజ్ బొమ్మై స్వ‌యంగా ఈ సినిమా క‌ర్నాక‌ట ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వ‌చ్చి ఈ సినిమాను చూడ‌డం దేశ‌భ‌క్తిని పెంపొందించ‌డ‌మే అని చెప్పారు.

చిక్‌బ‌ళ్లాపూర్‌లో జ‌రిగిన త్రిబుల్ ఆర్ ఈవెంట్‌లో క‌ర్నాక‌ట వైద్య ఆరోగ్య‌శాఖా మంత్రి సుధాక‌ర్‌తో పాటు కొంద‌రు మంత్రులు కూడా హాజ‌ర‌య్యారు. అటు దుబాయ్‌, ఇటు హైద‌రాబాద్‌, ముంబై, గుజ‌రాత్‌, ఢిల్లీ ప్ర‌మోష‌న్ల‌తో త్రిబుల్ ఆర్ మామూలుగా దుమ్ము రేప‌డం లేదు. అస‌లు అంచ‌నాలు ఆకాశ‌మే హ‌ద్దు అన్న‌ట్టుగా ఉన్నాయి. ప్ర‌తి ఈవెంట్‌లోనూ తార‌క్‌, చెర్రీతో పాటు రాజ‌మౌళి స్పెష‌ల్ హైలెట్‌గా నిలుస్తున్నారు.

అయితే క‌ర్నాక‌ట‌లోని చిక్‌బ‌ళ్లాపూర్ ఈవెంట్‌లో పెళ్లిసంద‌D హీరోయిన్ శ్రీలీలా కూడా సందడి చేసింది.
ఆమె అనూహ్యంగా ఈ ఈవెంట్‌లో క‌న‌ప‌డ‌డంతో పాటు ఎన్టీఆర్ మాట్లాడుతున్న టైంలో ప‌దే ప‌దే చ‌ప్ప‌ట్లు కొడుతూ ఆ స్పీచ్ బాగా ఎంజాయ్ చేసింది. ఈ వీడియోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతున్నాయి. కొద్ది రోజుల నుంచి ఎన్టీఆర్ సినిమాలో శ్రీలీల‌కు సెకండ్ హీరోయిన్ ఛాన్స్ వచ్చింద‌న్న ప్ర‌చారం బాగా జ‌రుగుతోంది.

అయితే ఇప్పుడు ఎన్టీఆర్ ప్ర‌సంగానికి ఆమె ఫిదా అవ్వ‌డంతో పాటు చ‌ప్ప‌ట్లు కొట్ట‌డంతో ఆమె ఎన్టీఆర్ సినిమాలో న‌టిస్తోందా ? అన్న సందేహాలు వ‌స్తున్నాయి. అయితే ఎన్టీఆర్ ప‌క్క‌న న‌టించేందుకు ఆమె ఇంట్ర‌స్ట్‌తోనే ఉంద‌న్న‌ది మాత్రం ఈ వీడియోల‌తో క్లారిటీ వ‌చ్చేసింది. ఇక శ్రీలీల ఈ ఈవెంట్‌కు రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం.. క‌ర్నాక‌ట‌కు చెందిన ఓ డిస్ట్రిబ్యూట‌ర్ అని తెలుస్తోంది. ఈ పెద్ద ఈవెంట్‌లో ఒక్క హీరోయిన్ కూడా లేక‌పోతే వెలితిగా ఉంటుంద‌నే అక్క‌డ డిస్ట్రిబ్యూట‌ర్లు శ్రీలీల‌తో మాట్లాడి ఈ ఫంక్ష‌న్‌కు ర‌ప్పించార‌ని తెలుస్తోంది.

అయితే శ్రీలీల స్టేజ్‌మీద‌కు మాత్రం రాలేదు. ఆమె జ‌నాల్లోనే ఉండి మంచి అటెన్ష‌న్ సొంతం చేసుకుంది. ఇక రాఘ‌వేంద్ర‌రావు లాంటి పెద్ద ద‌ర్శ‌కుడి కంట్లోనే ప‌డింది అంటే శ్రీలీల‌ది మామూలు అందం కాద‌నే చెప్పాలి. పెళ్లిసంద‌డి యావ‌రేజ్ అయినా క‌మ‌ర్షియ‌ల్‌గా మాత్రం బాగానే వ‌ర్క‌వుట్ అయ్యింది. ఈ సినిమా త‌ర్వాత ఆమె అందానికి ఫిదా అయిన టాలీవుడ్ జ‌నాలు ఆమెకు వ‌రుస ఆఫర్లు ఇస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news