Moviesవారెవ్వా..మహేష్‌ సినిమాలో బాలయ్య..డైనమిక్ "డైరెక్ట"ర్ డేరింగ్ స్టెప్..?

వారెవ్వా..మహేష్‌ సినిమాలో బాలయ్య..డైనమిక్ “డైరెక్ట”ర్ డేరింగ్ స్టెప్..?

నందమూరి బాలకృష్ణ .. ఎనర్జీ కి మారు పేరు. డ్యాన్స్ చేసేటప్పుడు కానివ్వండి, డైలాగ్స్ చెప్పేటప్పుడు కానివ్వండి.. హోస్ట్ చేసేటప్పుడు కానివ్వండి..అస్సలు తగ్గేదేలే అన్న రీతిలో చెలరేగిపోతారు. ఈ వయసులోను యంగ్ హీరోలకు ఏ మాత్రం తీసిపోకుండా వరుస సినిమాలకు సైన్ చేస్తూ కేక పుట్టిస్తున్నారు. సినిమా కి సైన్ చేశాం మనకు టైం ఉన్నప్పుడు చేద్దం లే అని కాకుండా..అటు సినిమాల్లోను ఇటు రాజకీయాల్లోను తనదైన మార్క్ తో దూసుకుపోతున్నాడు బాలయ్య.

కాగా, బాలయ్య ప్రస్తుతం గోఫీచంద్ మల్లినేని డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్య సరసన స్టార్ డాటర్ శృత్ హాసన్ నటిస్తుంది. ఈ సినిమా అయిపోగానే మరో స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు అతి త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. కాగా మరో మూడు ప్రాజెక్ట్ లని లన్లో పెట్టుకుని ఉన్న బాలకృష్ణ గురించి రీసెంట్ గా ఓ వార్త నెట్టింట వైరల్ గా మారింది.

త్వరలోనే మహేష్ బాబుతో దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో ఓ సినిమా ఉంటుందని ఇప్పటికే అనౌన్సు చేశారు. దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా బ్యాక్ గ్రౌండ్ లో జరుగుతోంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ని తీసుకునే ఆలోచనలో ఉన్నాడు జక్కన్న అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కాగా తాగా గా ఇండస్ట్రీ వర్గాల పెద్దల దగ్గర నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో మహేష్ తో పాటు మరో స్టార్ హీరో కూడా నటించబోతున్నాడట.

ఓ కీలకమైన పాత్రకి నందమూరి బాలకృష్ణని తీసుకోవాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే బాలయ్యకి పాత్రని వివరించారట జక్కన్న.ఇద్దరు హీరోల ఇమేజ్‌కి తగ్గట్టు జక్కన్న బ్రహ్మాండమైన స్క్రిప్ట్ రెడీ చేశారని అంటున్నారు. .అయితే బాలయ్య దీనికి ఓకే చెప్పాడా లేదా అన్నది తెలియాలి . ప్రస్తుతం సర్కారు వారి పాటతో బిజీగా ఉన్న మహేష్‌ ఆ సినిమా పూర్తి కాగానే త్రివిక్రమ్‌తో మొదలు పెట్టనున్నారు. ఆ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయడం లేదా, ఒక కాలంలో రాజమౌళి సినిమాలో నటించనున్నారా తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news