Moviesకుర్ర డైరెక్టర్ తో వెంకటేష్ సినిమా..ఖచ్చితంగా హిట్టే..ఎందుకంటే..?

కుర్ర డైరెక్టర్ తో వెంకటేష్ సినిమా..ఖచ్చితంగా హిట్టే..ఎందుకంటే..?

సినీ ఇండస్ట్రీలో విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్న ఈయన కు మహిళల ఫాలోయింగ్ ఎక్కువ. ఈ వయసులోను యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ..చకచకా సినిమాలకు సైన్ చేస్తూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఏ హీరో ఆయన చేసే సినిమాలు చేయట్లేదు. ప్రతి ఒక్కరూ ఒకటి రెండు సినిమాలతోనే సరిపెట్టుకుంటుంటే వెంకటేష్ మాత్రం నాలుగైదు సినిమాలు ఒకేసారి చేస్తూ అందరి హీరోల కంటే ఫాస్ట్ గా సినిమాలు ఓకే చేస్తున్నాడు.

వరుసగా సినిమాలను రిలీజ్ చేస్తూ వెంకటేష్ సీనియర్ హీరోలతో పాటు కుర్ర హీరోలకు సైతం షాక్ ఇస్తున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ హీరోలు చాలా వరకు కుర్ర డైరెక్టర్లకు అవకాశాలు అందిస్తున్నారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వీళ్లంతా కుర్ర దర్శకులకే ప్రాధాన్యతనిస్తూ సినిమాలు చేస్తూ ఉన్నారు. విక్టరీ వెంకటేష్ ఈ తరహా ఐడియా తో సీనియర్ హీరోల అందరి కంటే ముందుగా సినిమాలు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే.

కాగా వెంకటేష్ ప్రస్తుతం మరో కూర డైరెక్టర్ తో సినిమా చేయడానికి సిద్ధపడ్డారట. జాతి రత్నాలు సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న అనుదీప్‌ కేవి దర్శకత్వంలో సినిమా చేసేందుకు వెంకీమామ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు ఒక వార్త ఇండస్ట్రీ వర్గాల్లో వైరల్ అవుతోంది. ఒక్క సినిమాతోనే స్టార్ డైరెక్టర్ డైరెక్టర్ గా పేరు తెచుకున్న అనుదీప్ వెంకీ కోసం అంచి కామెడీ కధను రెడి చేశారని..త్వరలోనే ఈ సినిమా పై అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తుంది. ఒక్కవేళ ఈ సినిమా ఫైనల్ అయితే అనుదీప్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ పక్కా అని చెప్పక్క తప్పదు. మరి అఫిషియల్ ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే..!!

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news