Moviesబన్నీ తో డ్యాన్స్ కి కండీషన్స్ పెట్టిన బాలీవుడ్ భామ ..సుక్కు...

బన్నీ తో డ్యాన్స్ కి కండీషన్స్ పెట్టిన బాలీవుడ్ భామ ..సుక్కు అద్దిరిపోయే రిప్లై ..?

టాలీవుడ్ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్. లుక్స్ లోనే కాదు డ్యాన్స్ లోను ఎప్పటికప్పుడు తన బాడీని మౌల్డ్ చేసుకుంటూ..అభిమానుల అభిరుచికి తగ్గట్లుగా ఫాలో అయిపోతుంటాదు. బన్నీ ని ఎక్కువ మంది అభిమానులు ఇష్టపడటానికి కారణం ఆయన డ్యాన్సే. బన్నీ లా బాడీని మెలికలు తిప్పుతూ డ్యాన్స్ చేసే హీరో మరెవరు లేరు అనడంలో సందేహం లేదు.

ఈ మధ్యనే పుష్ప సినిమాతో తిరుగులేని విజయం అందుకున్న ఈ అల్లు వారి అబ్బాయి..ఈ సినిమాతో సరికొత్త రికార్డులు క్రియేట్ చేశారు. ఈ సినిమాలో బన్నీ డ్యాన్స్ వేయడానికి పెద్దగా స్కోఫ్ లేకపోయినా..ఐటెం సాంగ్ లో మాత్రం వేసిన నాలుగు స్టెప్పులైనా చించేశాడు. ఊర మాస్ లుక్ లో అద్దిరిపోయే డ్యాన్స్ స్టెప్పులతో అందరిని ఆకట్టుకున్నాడు. కాగా, మరి కొన్ని వారాల్లో పుష్ప పార్ట్ 2 సినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది. దీని కోసం సుకుమర్ పెద్ద ప్లాన్ నే వేసిన్నట్లు ఉన్నారు.

నార్త్ లో పుష్ప సినిమాకి పెద్ద గా ప్రమోషన్స్ చేయలేదు సుకుమార్. అయినా కానీ సినిమా మంచి టాక్ ను సంపాదించుకుంది. ఈ క్రమంలోనే పుష్ప పార్ట్ 2 లో ఐటెం సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ దింపుతున్నారట సుకుమార్. దిశా పటానీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హాట్ డ్రెస్ లతో కిల్లింగ్ లుక్స్ తో చంపేస్తుంది. అలాంటి అమ్మడికి బన్నీ పక్కన డ్యాన్స్ చేసే అవకాశం వస్తే..కండీషన్లు పెట్టి పరువు తీసుకుంటుంది. ఈ ఒక్కపాటలో అంటించినందుకు గాను ఆమె 4కోట్లు పారితోషకం అడుగుతుందట. బాలీవుడ్ హీరోయిన్లకి ఈ అమౌంట్ చిన్నదే అయినా.. తెలుగు డైరెక్టర్లకి ఈ రెమ్యూనరేషన్ చాలా పెద్దది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news