Movies18 ఏళ్ల క్రిత‌మే ఆ హీరోయిన్‌తో ప్ర‌భాస్ పెళ్లి.. ఎవ‌రి వ‌ల్ల...

18 ఏళ్ల క్రిత‌మే ఆ హీరోయిన్‌తో ప్ర‌భాస్ పెళ్లి.. ఎవ‌రి వ‌ల్ల క్యాన్సిల్ అయ్యిందో తెలుసా..!

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవ‌రంటే ట‌క్క‌నే గుర్తుకువ‌చ్చే పేరు ప్ర‌భాస్. ప్ర‌భాస్ కంటే చిన్న వ‌య‌సు హీరోల‌కు కూడా పెళ్లిల్లు అయిపోయాయి. ప్ర‌భాస్ కంటే వ‌య‌స్సులో చిన్న హీరోలుగా ఉన్న స్టార్ హీరోల్లో ఎన్టీఆర్ కు ఇద్ద‌రు పిల్ల‌లు…అల్లు అర్జున్ కు ఇద్ద‌రు పిల్ల‌లు కూడా ఉన్నారు. కానీ ప్ర‌భాస్ మాత్రం ఇంకా పెళ్లి చేసుకోలేదు. అంతే కాకుండా పెళ్లి ఊస కూడా లేదు. దాంతో బాలీవుడ్ స‌ల్మాన్ ఖాన్ టాలీవుడ్లో ప్ర‌భాస్ అనే పేరు కూడా తెచ్చుకున్నాడు. అప్ప‌ట్లో ప్ర‌భాస్ పెళ్లి గురించి ప్ర‌శ్నిస్తే కూల్ గా సమాధానాలు ఇచ్చిన కృష్ణం రాజు ఇప్పుడు ప్ర‌భాస్ పెళ్లి గురించి అడిగితే విసిగిపోయి ఫైర్ అవుతున్నారు కూడా… !

బాహుబ‌లి సినిమాతో ప్ర‌భాస్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఇక ఇప్పుడు ప్ర‌భాస్ మరింత బిజీగా మారిపోయాడు. రీసెంట్ గా రాధేశ్యామ్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఈ సినిమా అనుకున్నమేర విజ‌యం సాధించ‌లేదు. ఇక ప్ర‌స్తుతం ప్ర‌భాస్ ఆదిపురుష్ అనే సినిమాలో రాముడి పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఇదిలా ఉండ‌గానే ప్ర‌భాస్ కేజీఎఫ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో స‌లార్ అనే సినిమాలో కూడా న‌టిస్తున్నారు. ఈ సినిమా 30శాతం షూటింగ్ ను పూర్తి చేసుకుంది. పైగా స‌లార్ 2 కూడా ఉంది. ఇక నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో ప్రాజెక్ట్ కే కూడా ఉంది.

ఇలాంటి బిజీ షెడ్యూల్‌లో ప్ర‌భాస్ పెళ్లి చేసుకోవ‌డం క‌ష్ట‌మే అనిపిస్తోంది. అయితే ప్ర‌భాస్ పెళ్లి 25 ఏళ్ల‌కే అయిపోవాల్సిందట. కానీ కృష్ణంరాజు వ‌ల్లే ఆ పెళ్లి ఆగిపోయింద‌ట‌. అప్ప‌ట్లో ఈ మ్యాట‌ర్ టాలీవుడ్ లో హాట్ టాపిక్‌గా కొన్నాళ్లు న‌డిచింది. ప్ర‌భాస్ ఓ హీరోయిన్ తో మూడు సినిమాలు చేశాడు. అయితే ఆ సినిమాల షూటింగ్ స‌మ‌యంలోనే హీరోయిన్‌తో ప్రేమ‌లో ప‌డ్డాడ‌న్న ప్ర‌చారం బాగా న‌డిచింది. అంతే కాకుండా ఆ హీరోయిన్ నే ప్ర‌భాస్ పెళ్లి కూడా చేసుకోవాల‌ని నిర్ణ‌యం తీసుకున్నార‌ని అప్ప‌ట్లో టాక్.

కానీ కృష్ణం రాజు ఆ పెళ్లికి ఒప్పుకోలేద‌ట‌. దాంతో పెద‌నాన్న‌కు ఇష్టం లేని పెళ్లి చేసుకోకూడ‌ద‌ని ప్ర‌భాస్ కూడా డ్రాప్ అయ్యాడ‌ట‌. అయితే ఆ హీరోయిన్ మ‌రెవ‌రో కాదు త్రిష అని అప్ప‌ట్లో పుకార్లు వ‌చ్చాయి. కానీ ఈ వార్త‌ల‌పై అటు ప్ర‌భాస్ కానీ ఇటు త్రిష కానీ స్పందిచ‌లేదు.ఇదిలా ఉండ‌గా మిర్చి, బాహుబ‌లి త‌రువాత ప్రభాస్ అనుష్క కూడా ప్రేమించుకున్నార‌నే వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. కానీ ఆ పెళ్లి వార్త‌ల‌ను ఇద్ద‌రూ ఖండిస్తూ తాము ఫ్రెండ్స్ అని చెప్పేశారు. ఇక ఇలాంటి వార్త‌ల‌కు చెక్ పెడుతూ ఇండియా స్టార్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో చూడాలి మ‌రి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news