Moviesహీరోయిన్‌గా సురేఖ‌వాణి కుమార్తె సుప్రీత‌ ఎంట్రీ...!

హీరోయిన్‌గా సురేఖ‌వాణి కుమార్తె సుప్రీత‌ ఎంట్రీ…!

టాలీవుడ్‌లో హీరోల్లో వార‌స‌త్వ ప‌ర‌గా మూడో త‌రం హీరోలు కూడా ఉన్నారు. నంద‌మూరి, అక్కినేని కుటుంబాల్లో మూడో త‌రం హీరోలు కూడా ఎంట్రీ ఇచ్చి స‌క్సెస్ ఫుల్‌గా దూసుకు పోతున్నారు. ఇక హీరోయిన్ల విష‌యానికి వ‌స్తే బ‌ల‌మైన సినీ నేప‌థ్యం ఉన్న కుటుంబాల నుంచి ఎవ్వ‌రూ హీరోయిన్లుగా రాలేదు. ఒక్క మెగా ఫ్యామిలీ నుంచి నాగ‌బాబు కుమార్తె నిహారిక కొణిదెల మాత్ర‌మే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి రెండు, మూడు సినిమాల్లో హీరోయిన్‌గా చేసింది. ఆమె న‌ట‌న‌కు మంచి మార్కులే వ‌చ్చాయి. అయితే ఆమెను ఫుల్ టైం హీరోయిన్‌గా కొన‌సాగించేందుకు మెగా ఫ్యామిలీ ఇష్ట‌ప‌డిన‌ట్టు లేదు. కార‌ణం ఏదైనా ఆమె పెళ్లి కూడా చేసేసుకుంది.

ఇక ఇప్పుడు సీనియ‌ర్ క్యారెక్ట‌ర్ న‌టి సురేఖ‌వాణి కుమార్తె సుప్రీత కొంత కాలంగా సోష‌ల్ మీడియాలో బాగా హ‌డావిడి చేస్తున్నారు. కాలంతో పాటు వేగాన్ని అందుకుని ఎప్ప‌టిక‌ప్పుడు ఎలా అప్‌డేట్ అవ్వాలో సురేఖ‌వాణి బాగా వంట ప‌ట్టించుకున్నారు. ఆమెకు సోష‌ల్ మీడియాలో ఉన్న క్రేజ్ చాలా మంది స్టార్ హీరో, హీరోయిన్ల‌కు కూడా లేదు. సోష‌ల్ మీడియాలో ఆమె అంత యాక్టివ్‌గా ఉండ‌డంతోనే ఆమెతో పాటు ఆమె కుమార్తెకు తిరుగులేని క్రేజ్ వ‌చ్చింది.

సుప్రీత‌ను హీరోగా ప‌రిచ‌యం చేయాల‌న్న తాప‌త్ర‌యం ఆమెలో ఉన్న‌ట్టే ఉంది. అందుకే గ‌త కొంత కాలంగా వ‌రుస పెట్టి ఫొటో షూట్లు, వీడియోలు, వ‌గైరాలు ఇంట‌ర్నెల్లో వైర‌ల్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. కుమార్తె కెరీర్ విష‌యంలో సురేఖ వాణి చాలా ప‌క‌గ్డందీ ప్లాన్‌తోనే ఉన్న‌ట్టు తెలుస్తోంది. అస‌లు ఈ వ‌య‌స్సులో సురేఖ వాణికి కూడా చెక్కు చెద‌ర‌ని అందం.. వ‌య‌స్సు పెరిగినా కూడా ఆమె వ‌న్నే ఏ మాత్రం త‌గ్గ‌లేదు. ఒక్కోసారి సురేఖ‌ను, ఆమె కుమార్తె సుప్రీత‌ను చూస్తుంటే వీరిద్ద‌రు అక్కాచెళ్లెళ్లా రా బాబు అన్న‌ట్టుగా ఉంటారు.

ముఖ్యంగా లాక్‌డౌన్ టైం నుంచి కూడా సురేఖ త‌న‌లోని గ్లామ‌ర్ యాంగిల్‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌జెంట్ చేస్తూ వ‌చ్చారు. దీంతో ఆమె డ్రెస్సింగ్ రూమ్ ఫొటోలు, యోగా, జిమ్ ఫొటోలు పోస్టు చేయ‌డంతో ఆమెకు ల‌క్ష‌ల్లో ఫాలోవ‌ర్స్ ఏర్ప‌డ్డారు. ఇక త‌ల్లి, కుమార్తె ఇద్ద‌రూ చాలా సార్లు ఒకే డ్రెస్ కోడ్‌తో క‌నిపించి మ‌రింత ఆక‌ర్ష‌ణ‌గా మారారు. సుప్రీత్ బ‌ర్త్ డే రోజు ఈ త‌ల్లికూతుళ్లు ఇద్ద‌రూ ఎంత‌లా ఎంజాయ్ చేశారో ఆ ఫోటోలు చూస్తేనే అర్థ‌మ‌వుతోంది.

ఇక సురేఖ వాణి త‌న కుమార్తెను హీరోయిన్‌గా ఎంట్రీ చేయించే ప్ర‌య‌త్నాల్లో ఉంద‌న్న వార్తలు కూడా ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో చ‌క్కెర్లు కొడుతున్నాయి. స‌రైన క‌థ‌.. హీరో, ద‌ర్శ‌కుడు దొరికితే ఆమెను వెండితెరం గ్రేటం చేసేందుకు త‌ల్లి సురేఖ రెడీగానే ఉంద‌ట‌. ఏదేమైనా తెలుగులో స‌హాయ‌న‌టిగా పాపుల‌ర్ అయిన సురేఖ‌ను మించిన హీరోయిన్‌గా సుప్రీత రాణిస్తుందేమో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news