Moviesఫస్ట్ టైం ఆ సినిమా కోసం కండీషన్ పెట్టిన పవన్..ఒక్క రోజుకు...

ఫస్ట్ టైం ఆ సినిమా కోసం కండీషన్ పెట్టిన పవన్..ఒక్క రోజుకు అన్ని కోట్లా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..రీ ఎంట్రీ తరువాత వరుస సినిమాలకు కమిట్ అవుతూ..తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నాడు. సినిమాల్లోకి రీ- ఎంట్రీ ఇచ్చాక పవన్ కళ్యాణ్ రికార్డుల సునామీ సృష్టిస్తున్నారు. వకీల్ సాబ్ రూపంలో పలు రికార్డులు తిరగరాసిన పవర్ స్టార్ ఈ సారి భీమ్లా నాయక్ అంటూ బాక్సాఫీస్ దాడికి దిగారు. రీసెంట్ ఆయన నటించి విడుదలైన చిత్రం ‘భీమ్లా నాయక్’. పవన్ పోలీస్ ఆఫిసర్ గా కనిపించిన ఈ చిత్రంలో రానా దగ్గుబాటి విలన్ గా నటించగా..మలయాళ ముద్దు గుమ్మలు..నిత్య మీనన్, సం యుక్త మీనన్ ఈ సినిమాలో హీరోయిన్లు నటించి వాళ్ల పాత్రలకు న్యాయం చేశారు.

సాగర్ చంద్ర డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఫిబ్రవరి 25 న ప్రపంచ్ వ్యాప్తంగా రిలీజ్ అయ్యి..సూపర్ డూపత్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. అంతేనా రిలీజైన మూడు రోజుల్లోనే..100 కోట్ల క్లబ్ లో చేరి..సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఇక కలెక్షన్స్ పరంగా మాంచి ఫామ్‌లో ఉన్న ఈ సినిమా ఐదో రోజుతో పోల్చితే ఆరవ రోజుకు వచ్చేసరికి కాస్త డీలా పడింది. అయితే, ఈ సినిమా తరువాత కూడా పవన్ వరుస సినిమాలు లైన్ లో పెట్టుకుని ఉన్నాడు. బడా బడా డైరెక్టర్స్ తో పెద్ద నిర్మాణ సంస్ధల బ్యానర్ లో మూవీలు తీస్తున్నాడు. మరో వైపు రాజకీయంగా కూడా బిజీగా ఉన్నాడు.

ఇక తాజా గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ మరో తమిళ సినిమా ను కూడా రీమేక్ చేయడానికి సిద్ధంగా ఉన్నారట. ఈ సినిమాలో మరో మెగా హీరో కూడా నటించనున్నట్లు సమాచారం. తమీళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ‘వినోద‌య సిత్తం’ సినిమాను పవన్ తెలుగులో రీమేక్ చేయనున్న‌ట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండ‌గానే తాజాగా ఈ చిత్రానికి ప‌వ‌న్‌క‌ళ్యాణ్ తీసుకుంటున్న‌ రెమ్యున‌రేష‌న్ టాలీవుడ్ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. పవన్ జనరల్ గా ఏ సినిమాకి కూడా కండీషన్స్ పెట్టడట.

రాజకీయాలల్లో చూసుకుంటూనే మరో వైపు అన్ని సినిమాలకు టైం ఇస్తూ రెండింటిని సమానంగా బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నాడు. కానీ ఈ సినిమాకి మాత్రం పవన్ కేవలం 20 రోజుల కాల్ షీట్లు మాత్రమే ఇస్తాను అని కమిట్ అయ్యాడట. త్వరలో రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో పలు ప్రజా కార్యక్రమాలల్లో బిజీ గా మారబోతున్న పవన్ ఇంతకన్నా ఎక్కువ టైం ఇవ్వలేను అని చెప్పేసాడట. కాగా ఈ సినిమాకి ఇస్తున్న 20 రోజుల కాల్ షీట్ల కు గాను ఆయన మొత్తంగా 50కోట్ల వ‌ర‌కు పారితోష‌కం అందుతున్న‌ట్లు తెలుస్తుంది. అదేగ‌నుక నిజ‌మైతే ప‌వ‌న్‌కు ఒక్క రోజుకు 2.5 కోట్ల చొప్పున పారితోష‌కం ద‌క్క‌నుందన మాట.

Html code here! Replace this with any non empty raw html code and that's it.

Latest news