Moviesశ‌ర్వా ' ఆడాళ్లు మీకు జోహార్లు ' ప్రి రిలీజ్ బిజినెస్‌......

శ‌ర్వా ‘ ఆడాళ్లు మీకు జోహార్లు ‘ ప్రి రిలీజ్ బిజినెస్‌… టార్గెట్ ఎన్ని కోట్లు అంటే..!

యంగ్ హీరో శ‌ర్వానంద్ ఇటీవ‌ల అనుకున్న స్థాయిలో ప్రేక్ష‌కుల‌ను మెప్పించ లేక‌పోతున్నాడు. కుటుంబ సమేతంగా ఫ్యామిలీల‌ను థియేట‌ర్ల‌కు ర‌ప్పించాల‌న్న టార్గెట్‌తో శ‌ర్వా తాజాగా చేసిన సినిమా ఆడవాళ్లు మీకు జోహార్లు. తిరుమ‌ల కిషోర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఈ నెల 4న ప్ర‌పంచ వ్యాప్తంగా థియేట‌ర్ల‌లోకి వ‌స్తోంది. ఓ వైపు భీమ్లానాయ‌క్ థియేట‌ర్ల‌లోకి వ‌చ్చి వారం రోజులు అవుతోంది.

ఈ సినిమా హిట్ టాక్‌తో ఇంకా చాలా థియేటర్ల‌లో ర‌న్ అవుతోంది. మ‌ల్టీఫ్లెక్స్‌ల సంగ‌తి ఎలా ? ఉన్నా సింగిల్ స్క్రీన్లు ఆడాళ్లు సినిమాకు అనుకున్న స్థాయిలో దొరికే ప‌రిస్థితి లేదు. అయినా ఆ సినిమా టీం డేర్ చేసి త‌మ సినిమాను థియేట‌ర్ల‌లోకి తీసుకువ‌స్తోంది. శ‌ర్వా గ‌త నాలుగైదు సినిమాల‌ను క‌థా ప‌రంగా కొత్త‌గానే ట్రై చేసినా అనుకున్న ఫ‌లితాలు అయితే ఇవ్వ‌లేదు.

ఈ సినిమా కోసం శ‌ర్వా ఎంత గ‌ట్టిగా క‌ష్ట‌ప‌డ్డాడో ఈ సినిమా టైటిల్ సాంగ్‌కు తాను ప‌డిన క‌ష్టం చూస్తే అర్థ‌మ‌వుతోంది. ఈ పాట కోస‌మే శేఖ‌ర్ మాస్ట‌ర్ ఉద‌యం 10 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కు నిర్విరామంగా షూట్ చేస్తే అన్ని గంట‌ల పాటు ఓర్పుతో ఉండ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురి చేసింద‌ట‌.
ఇక ఈ సినిమా ర‌న్ టైం 2.21 గంట‌లుగా లాక్ చేశఃఆరు.

ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రు. 19 కోట్లు రాబ‌ట్టాల్సి ఉంది. ఈ సినిమాతో స‌క్సెస్ ట్రాక్‌లోకి ఎక్కాల‌ని చూస్తోన్న శ‌ర్వానంద్ మ‌రి హిట్ ట్రాక్‌లోకి వ‌స్తాడో లేదో రేపు తేలిపోనుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news