Moviesమోస్ట్ అవైటెడ్ “ కేజీఎఫ్ 2 ” పై ఫ్యీజులు ఎగిరే...

మోస్ట్ అవైటెడ్ “ కేజీఎఫ్ 2 ” పై ఫ్యీజులు ఎగిరే అప్‌డేట్ వ‌చ్చేసింది..!

ఇప్పుడు సౌత్ ఇండియాలో తెర‌కెక్కుతోన్న పాన్ ఇండియా సినిమాల కోసం నార్త్ ప్రేక్ష‌కులు, బాలీవుడ్ వాళ్లు క‌ళ్లు కాయ‌లు కాచేలా వెయిట్ చేస్తున్నారు. బాహుబ‌లి సీరిస్‌, సాహో, కేజీఎఫ్‌, పుష్ప సినిమాల త‌ర్వాత ఇప్పుడు నార్త్ సినిమాలు వ‌స్తున్నాయంటే బాలీవుడ్ వాళ్లు సైతం బెదిరిపోతున్నారు. ఇక త్వ‌ర‌లోనే వ‌రుస‌గా సౌత్ సినిమాలు పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. ఈ లైన‌ఫ్ చూస్తుంటేనే బీ టౌన్ వాళ్ల‌కు బిగ్ టెన్ష‌న్ స్టార్ట్ అవుతోంది.

బాహుబ‌లి, లేదా సాహో మాత్ర‌మే కాదు.. బ‌న్నీ లాంటి హీరో చేసిన పుష్ప కూడా అక్క‌డ రు. 100 కోట్లు కొల్ల‌గొట్టింది అంటే వాళ్ల‌కు మాట‌లు రావ‌డం లేదు. ఇక త్వ‌ర‌లోనే వ‌రుస‌గా త్రిబుల్ ఆర్‌, రాధేశ్యామ్ సినిమాల‌తో పాటు క‌న్న‌డ రాకింగ్ స్టార్ య‌శ్ న‌టించిన కేజీఎఫ్ 2 సినిమా సైతం త్వ‌ర‌లోనే రిలీజ్‌కు రెడీ అవుతోంది. కేజీఎఫ్ 2018లో వ‌చ్చి దేశ‌వ్యాప్తంగా ఎన్నో సంచ‌ల‌నాలు క్రియేట్ చేసింది.

క‌న్న‌డ రాకింగ్ స్టార్ య‌శ్ హీరోగా ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ సినిమాతో య‌శ్‌, ప్ర‌శాంత్ నీల్ ఓవ‌ర్‌నైట్ స్టార్లు అయిపోయారు. ఈ సినిమా దేశ‌వ్యాప్తంగా క‌న్న‌డ బాహుబ‌లిగా ప్ర‌శంస‌లు అందుకుంది. బిగ్గెస్ట్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమా సీక్వెల్ కేజీఎఫ్ 2 కోసం ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు అంద‌రూ ఎంతో ఆస‌క్తితో వెయిట్ చేస్తున్నారు.

ఇక కేజీఎఫ్ 2 ట్రైల‌ర్‌ను మార్చి 27 సాయంత్రం 6.40 గంట‌ల‌కు భారీ ఈవెంట్‌తో లాంచ్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. దీంతో ఫైన‌ల్‌గా ఈ భారీ సినిమా ట్రైల‌ర్ లాంచ్ ఎదురు చూపుల కోసం పెద్ద బ్రేక్ ప‌డింద‌నే చెప్పాలి. ఇప్ప‌టికే వ‌చ్చిన గ్లింప్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది. ఇక ట్రైల‌ర్ ఎంత విధ్వంసం క్రియేట్ చేస్తుందో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news