Moviesరాజ‌మౌళికి అనిల్ రావిపూడి కౌంట‌ర్‌... కోడిగుడ్డు మీద ఈక‌లు..!

రాజ‌మౌళికి అనిల్ రావిపూడి కౌంట‌ర్‌… కోడిగుడ్డు మీద ఈక‌లు..!

ఇదిగో పులి.. అదిగో తోక చందంగా ఉంటాయి గాసిప్‌లు. ఇక గ్లామ‌ర్ ఫీల్డ్ అయిన సినిమా ఇండ‌స్ట్రీలో గాసిప్‌ల‌కు కొద‌వే ఉండ‌దు. హీరోలు, హీరోయిన్ల‌కు మ‌ధ్య ఏవేవో లింకులు ఉన్న‌ట్టు రాసేస్తూ ఉంటారు. ఒక‌రు అన్న మాట‌ల‌కు మ‌రో వ్య‌క్తికి సంబంధం లేక‌పోయినా.. వీళ్లు మాత్రం ఏదో ఒక లింక్ క‌లిపేస్తారు. ఈ గాసిప్‌ల దెబ్బ‌కు బ‌లైపోయిన వారు ఎందరో ఉన్నారు. చివ‌ర‌కు ఈ గాసిప్‌ల వ‌ళ్లే కొంద‌రు స్టార్ హీరో, హీరోయిన్లు, హీరోలు, ద‌ర్శ‌కుల‌కు మ‌ధ్య కూడా గ్యాప్‌లు వ‌చ్చిన సంద‌ర్భాలు ఉన్నాయి.

తాజాగా స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి చేసిన వ్యాఖ్య‌ల‌ను డైరెక్ట‌ర్ రాజ‌మౌళికి కౌంట‌ర్‌గా కొంద‌రు సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం చేస్తున్నారు. వ‌రుస హిట్ల‌తో ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు అనిల్‌. వెంక‌టేష్ – వ‌రుణ్‌తేజ్‌తో తెర‌కెక్కించిన ఎఫ్ 3 సినిమా త్వ‌ర‌లోనే రిలీజ్ కానుంది. ఈ సినిమా కంప్లీట్ అయిన వెంట‌నే బాల‌య్య – క‌ళ్యాణ్‌రామ్ కాంబోలో ఓ మ‌ల్టీస్టార‌ర్ ప్లాన్ చేసుకుంటున్నాడు. అయితే తాజాగా అనిల్ మాట్లాడుతూ త‌న‌కు పాన్ ఇండియా సినిమాల‌పై పెద్ద‌గా ఆస‌క్తి లేద‌ని.. తాను పాన్ ఇండియా సినిమాలు చేయాల‌ని కూడా కోరుకోవ‌డం లేద‌ని అన్నారు.

తాను చేసే ప్ర‌తి సినిమా పైసా వ‌సూల్ సినిమా అవ్వాల‌నే తాను కోరుకుంటున్నా అని.. అందుకు త‌గిన‌ట్టుగానే త‌న స్క్రిఫ్ట్‌లు రెడీ అవుతున్నాయ‌ని చెప్పాడు. ఇక ప్ర‌తి సినిమా కూడా ఎక్కువ రోజులు చేయ‌డం త‌న‌కు బోర్ కొడుతుంద‌ని కూడా అనిల్ చెప్పాడు. అయితే ఇప్పుడు ఇవే డైలాగుల‌ను ప‌ట్టుకున్న కొంద‌రు ఇవి రాజ‌మౌళి టార్గెట్‌గా చేసిన‌వే అని పుకార్లు అల్లేస్తున్నారు.

ఇప్పుడు ఉన్న ద‌ర్శ‌కుల్లో రాజ‌మౌళియే ఒక్కో సినిమాను మూడు సంవ‌త్స‌రాల పాటు తీస్తూ ఉంటాడు. ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ కూడా క‌లుపుకుంటూ రాజ‌మౌళికి ఒక్కో సినిమాయే దాదాపుగా మూడు నుంచి.. నాలుగేళ్లు ప‌డుతోంది. ఇక బాహుబ‌లి సినిమా నుంచి రాజ‌మౌళి టార్గెట్ అంతా పాన్ ఇండియా మీదే ఉంది. అయితే అవ‌న్నీ క‌మ‌ర్షియ‌ల్‌గా సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో పాటు.. తెలుగు సినిమా స్థాయిని వ‌ర‌ల్డ్ వైడ్‌గా చాటి చెప్పాయి. అది రాజ‌మౌళి ఆలోచ‌న‌.. అనిల్ స్టైల్ వేరు. కామెడీ ఎక్కువుగా ప్ర‌యార్టీ ఇస్తూ త‌న‌దైన స్టైల్లో సినిమాలు చేసుకుంటూ వెళ‌తాడు.

త‌న గురించి తాను చెప్పుకున్నంత మాత్రానా అనిల్ రాజ‌మౌళికే కౌంట‌ర్ ఇచ్చాడ‌నుకోవ‌డం మూర్ఖ‌త్త్వం అవుతుంది. రాజ‌మౌళి ది గ్రేట్ డైరెక్ట‌ర్‌. ఆయ‌న్ను కావాల‌ని ఎవ్వ‌రూ టార్గెట్ చేయ‌రు. కాకపోతే కోడి గుడ్డు మీద ఈక‌లు పీకే గ్యాంగ్ మాత్రం ఇలా పుల్ల‌లు పెడుతూ ఆనందం పొందుతూ ఉంటుంది. ఇక అనిల్ ఎఫ్ 3 త‌ర్వాత బాల‌య్య సినిమా.. రాజ‌మౌళి త్రిబుల్ ఆర్ త‌ర్వాత మ‌హేష్‌బాబు సినిమా చేస్తారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news