Moviesనా చేతులారా చేసిన తప్పు అదే..అందుకే ఇప్పుడు బాధపడుతున్న..ఓపెన్ గా చెప్పేసిన...

నా చేతులారా చేసిన తప్పు అదే..అందుకే ఇప్పుడు బాధపడుతున్న..ఓపెన్ గా చెప్పేసిన యమున

యమున.. ఈ పేరు నేటి కాలం యువతి యువకులకు పెద్దగా తెలియకపోవచ్చు కానీ..అప్పట్లో సినీ ఇండస్ట్రీలో అమ్మడు అందానికి ఓ రేంజ్ లో డిమాండ్ ఉండేది. చూడటానికి చక్కటి రూపం..చూడగానే ఆకర్షించే అందం ఉన్న యమున వెండి తెర పై పలు సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

వెండితెర ప్రేక్షకులకు మాత్రమే కాదు బుల్లితెర ఆడియన్స్‌కు కూడా బాగా సుపరిచితురాలు నటి యమున..గతంలో పలు సినిమాల్లో నటించిన ఆమె తర్వాత టీవీ ఇండస్ట్రీలో కాలు మోపి..అక్కడ కూదా తన నటనకు మంచి మార్కులే వేయించుకుంది. ఇక ఆ తరువాత సినిమాల్లో కంటే సీరియళ్లలో నటిస్తూనే బుల్లితెరపై స్థిరపడిపోయింది. ఎంతోమంది నటీనటులు వస్తూపోతున్నా యమున మాత్రం పోటీని తట్టుకుని ఇండస్ట్రీలో గట్టిగా నిలబడింది.

అయితే ఒక‌ప్పుడు హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన య‌మున ఆ త‌ర్వాత బెంగ‌ళూరులో ఓ హోట‌ల్లో వ్య‌భిచారం చేస్తూ అడ్డంగా దొరికిపోయింద‌న్న వార్త‌లు వ‌చ్చాయి. అప్పట్లో ఈ విషయాలు బాగా దుమారం రేపాయి. అయితే త‌న‌ను కావాల‌నే బ్లేమ్ చేసేందుకు ఎవ‌రో ఈ వార్త‌లు క్రియేట్ చేశార‌ని.. ఈ వార్త‌ల వ‌ల్ల డిప్రెష‌న్లోకి వెళ్లిపోయానని చెప్పుకొచ్చింది ఈ భామ. అంతేకాదు చివ‌ర‌కు ఆమె ఆత్మ‌హ‌త్య కూడా చేసుకోవాల‌నుకున్నాన‌ని చెప్పి షాక్ ఇచ్చింది.

ఈ మధ్య ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన వ్యక్తిగత వివరాలు పంచుకుంది ఈ నటీమణి. ఇక ఇ ఇమె అందానికి నటనకి స్టార్ హీరోల సైతం మెచ్చి అవకాశం ఇచ్చారట. కానీ తెలియని తనంతో మెగాస్టార్ చిరంజీవి పక్క్న , నందమూరి బాలయ్య పక్కన నటించే ఛాన్స్ వచ్చిన రిజెక్ట్ చేసిందట. 1990 రమా ఫిలిమ్స్, కె.నాగేశ్వర్ రావు నిర్మాణం. మురళిమోహన్ రావు దర్శకత్వంలో “కొదమ సింహం” చిత్రం విడుదలయిన సంగతి తెలిసిందే. ఇందులో చిరంజీవి, వాణివిశ్వనాథ్, రాధ, సోనం హీరో, హీరోయిన్లుగా నటించారు. అయితే మొదటగా ఈ సినిమాలో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న యమునను సోనమ్ చేసిన పాత్రకు ముందుగా సంప్రదించారట.

కానీ అప్పటికే యమున పలు చిత్రాలతో బిజీగా ఉండడంతో.. చిరంజీవి డేట్స్ కి యమున డేట్స్ కుదరక‌ పోవడంతో ఆ స్థానంలో బాలీవుడ్ నటి “సోనమ్”ను తీసుకోవడం జరిగిందట. బాలకృష్ణ సినిమా కోసమని నా గురించి ఉషా కిరణ్ మూవీస్ వారిని కూడా సంప్రదించారని తెలిసింది. ఇప్పటిలా అప్పుడు సెల్ ఫోన్ లేకపోవడం వల్ల సరైన సమాచారం లేకపోవడంతో కొన్ని అవకాశాలు మిస్సయ్యానాని చెప్పుకొచ్చింది. తాను స్టార్ హీరోల పక్కన నటించలేనందుకు ఇప్పటికీ బాధపడుతున్నట్టు ఆమె చెప్పుకొచ్చింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news