Gossipsఆ టాలీవుడ్ హీరోను, ఆ ఫ్యామిలీని ప‌క్క‌న పెట్టేసిన స్టార్ హీరోయిన్‌..!

ఆ టాలీవుడ్ హీరోను, ఆ ఫ్యామిలీని ప‌క్క‌న పెట్టేసిన స్టార్ హీరోయిన్‌..!

ఇత‌ర భాష‌ల‌కు చెందిన హీరోయిన్లు టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన‌ప్పుడు వారికి బ్రేక్ ఇచ్చిన సినిమాల హీరోల‌ను, ఆ సినిమా ద‌ర్శ‌కులు, నిర్మాత‌ల‌ను గుర్తు పెట్టుకోవ‌డం ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రుగుతూ వ‌స్తోంది. వాళ్లు ఆ త‌ర్వాత ఎంత పెద్ద హీరోయిన్ స్థాయికి వెళ్లినా త‌మ‌కు బ్రేక్ ఇచ్చిన వాళ్ల‌ను మాత్రం ఎప్ప‌ట‌కి గుర్తుంచుకుంటూ ఉంటారు. ఇప్పుడు అంతా సోష‌ల్ మీడియా మ‌యం కావ‌డంతో టైం వ‌చ్చిన‌ప్పుడు త‌మ‌కు లైఫ్ ఇచ్చిన వారికి కృత‌జ్ఞ‌త చెపుతూ ఉంటారు.

ఇదిలా ఉంటే ప్ర‌స్తుతం తెలుగులో మాత్ర‌మే కాకుండా సౌత్‌లో పెద్ద స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతోన్న హీరోయిన్ ఇప్పుడు త‌న మొద‌టి సినిమా హీరోతో పాటు స‌ద‌రు హీరో ఫ్యామిలీని ప‌క్క‌న పెట్టేసిన వైనం ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఓ కుర్ర హీరో స్వ‌యంగా త‌మ బ్యాన‌ర్లో నిర్మించిన సినిమాతో స‌ద‌రు హీరోయిన్ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే ఆమెకు ఇక్క‌డ తిరుగులేని క్రేజ్ వ‌చ్చింది.

రెండ‌క్ష‌రాల టైటిల్‌తో వ‌చ్చిన ఆ సినిమా సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో ఆమెకు వ‌రుస‌గా విజ‌య్ దేవ‌ర‌కొండ‌, మ‌హేష్‌బాబు,బ‌న్నీ సినిమాల‌తో పాటు ఇప్పుడు బాలీవుడ్‌లోనూ అవ‌కాశాలు వ‌స్తున్నాయి. ఆమె రేటు కొండెక్కేసింది. అలాంటి హీరోయిన్ న‌టించిన తొలి సినిమా తాజాగా నాలుగేళ్లు పూర్తి చేసుకుంది. ఆ సినిమా నాలుగేళ్లు అయిన సంద‌ర్భంగా స‌ద‌రు డైరెక్ట‌ర్ చేసిన ట్వీట్‌ను రీ ట్వీట్ చేసిన ఆ స్టార్ హీరోయిన్ ఆ సినిమా హీరోను కాని.. అత‌డి ఫ్యామిలీ లేదా ఆ బ్యాన‌ర్ గురించి ఏ మాత్రం ప్ర‌స్తావించ‌లేదు.

స‌ద‌రు హీరోయిన్ స్టేట‌స్ మారిపోవ‌డంతో పాటు ఇప్పుడు స్టార్ హీరోయిన్ అయిపోవ‌డంతో.. త‌న రేంజ్‌కు ఆ హీరో స‌రిపోడ‌నే అత‌డిని ప‌క్క‌న పెట్టేసింద‌న్న గుస‌గుస‌లు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news