Moviesసమంత మనసు మార్చడానికి రంగంలోకి దిగిన ఈ కొత్త హీరో ఎవరు..?

సమంత మనసు మార్చడానికి రంగంలోకి దిగిన ఈ కొత్త హీరో ఎవరు..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ పోతుంది. విడాకుల తరువాత అందరు సమంత కెరీర్ అయిపోయిందని..సినీ జీవితానికి ఎండ్ కార్డ్ పెట్టేసిందని..ఇష్టమొచ్చిన్నట్లు మాట్లాడుకున్నారు. కానీ సీన్ కట్ చేస్తే..అమ్మడు పెళ్లికి ముందుకన్నా..పెళ్ళి తరువాత కన్నా కూడా ఇప్పుడే జెట్ స్పీడ్ లో దూసుకెళ్తుంది . ఇక రెమ్యూనరేషన్ కూడా బాగానే పుచ్చుకుంటుంది. రీసెంట్ గా కెరీర్ లోనే ఫస్ట్ ఐటెం సాంగ్ చేసిన సమంత ఊ అంటావా ఊ ఊ అంటావా మావ పాటకు చిందులేసినందుకు ఏకంగా 5 కోట్లు తీసుకుంది అంటూ వార్తలు షికారు చేశాయి.

ఇక విడాకుల తరువాత నచ్చిన్నత్లు ఉంటూ..ఇష్టమొచ్చిన్నట్లు బీహేవ్ చేస్తున్న సమంత మనసు మార్చడానికి ఓ యంగ్ ఖ్రికేటర్ రంగలోకి దిగుతున్నాడట. సమంత కాతువాకుల రెండు కాదల్‌ అనే సినిమాలో లీడ్ రోల్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నయనతార..విజయ్ సేతుపతి కూడా నటిస్తున్నారు. నయన్ కాబోయే భర్త ఈ సినిమాను డై రెక్ట్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో సమంత ది నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ అంటూ ఓ వార్త బయటకు వచ్చింది. నయన్-విజయ్ ఇష్ట పడుతారని లవ్ చేసుకుంటుంటారని..కానీ లవ్ లో ఫెయిల్ అయిన సమంత కు వాళ్లు సంతోషంగా ఉండటం ఇష్టం లేక వాళ్ళను విడతీయ్యడానికి ప్లాన్ చేస్తుందట.

ఇక అప్పుడు సీన్ లోకి ఎంటర్ అయ్యి సమంతకు మళ్లీ ప్రేమ అంటే ఎలా ఉంటుందో రుచి చూపిస్తాడట ఓ యువకుడు. ఆయన మరెవరో కాదు..టీమిండియా క్రికెటర్ శ్రీశాంత్‌. లాస్ట్‌ షెడ్యూల్‌తో పాటు పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రంలో ఒకప్పటి టిమిండియా ఆటగాడు కీ రోల్‌ పోషిస్తున్నట్లు తాజాగా చిత్ర బృందం ప్రకటించింది. ఈ సినిమాలో ఆయనిది చిన్న రోల్ అయినా కధను మార్చే వ్యక్తి ఆయనేనట. శ్రీశాంత్‌ వచ్చాకనే సమంత మళ్లీ మామూలు మనిషలాగా అవుతుందట. ఈ సినిమాలో శ్రీశాంత్‌, సమంత మధ్య హాట్ సీన్స్ కుడా ఉంటాయంటూ ప్రచారం జరుగుతుంది. మరి చూడాలి ఈ సినిమా సమంతకు ఎలాంటి పేరు తెచ్చిపెడుతుందో..?

 

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news