Moviesప్రభాస్ రాముడు కానేకాదు..డైరెక్టర్ అన్బిలీవబుల్ కామెంట్స్..!!

ప్రభాస్ రాముడు కానేకాదు..డైరెక్టర్ అన్బిలీవబుల్ కామెంట్స్..!!

ప్రభాస్.. ఇప్పుడు భారత సినీ రాజ్యానికి ఏకఛత్రాధిపతి అయ్యాడు. అసలు సిసలు పాన్ ఇండియన్ హీరోగా మారిపోయాడు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బహుబాలి సినిమాతో దేశవ్యాప్తంగానే కాదు జపాన్ వంటి ఇతర దేశాలల్లో కూడా అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక పాన్ ఇండియా స్టార్ గా కెరీర్ లో దూసుకుపోతున్న డార్లింగ్ ప్రభాస్ పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణరాజు వారసుడిగా ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్ లో హీరోగా అడుగు పెట్టాడు. ఇక అంతర్జాతీయ స్థాయిలోనూ ఎవ్వరికీ సొంతం కానటువంటి క్రేజ్‌ను తెచ్చుకున్నాడు. ఇప్పుడు ప్రభాస్ అంతర్జాతీయ స్థాయి కథలను ఎంచుకుంటున్నాడు.

ప్రభాస్ అంటే ఇష్టపడని వాళ్లు ఉంటారా..చెప్పండి. ఆ హైట్టు ఆ వెయిట్.. అంతకన్న మించిన గొప్ప మనసు..ఇవి చాలదా ఆయనను అభిమానులు ఆరాధించడానికి. ప్రభాస్ సినిమా ల పరంగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ఏకంగా 150కోట్ల రూపాయలను ఒక్కొక్క సినిమాకు పారితోషికంగా అందుకుంటున్నారు. వర్షం, ఛత్రపతి, డార్లింగ్ సినిమాలతో అమ్మాయిల కలలు రాకుమారుడుగా మారాడు.ప్రభాస్ కెరీర్‌లో మాస్, క్లాస్ హిట్స్ ఉన్నాయి. బిల్లా మాస్ హిట్ అయితే.. మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి, డార్లింగ్ వంటి చిత్రాలు క్లాస్ హిట్స్‌గా నిలిచాయి. అలా ప్రభాస్ మాస్ ఆడియెన్స్, క్లాస్ ఆడియెన్స్ అని తేడా లేకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.

బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ చేస్తున్నవన్నీ పాన్ ఇండియా మూవీస్. ప్రభాస్ ప్రస్తుతం ఖణం కూడా తీరికలేకుండా ఫుల్ సినిమాలకే తన జీవితాని అంకితం ఇచ్చేశాడు. ఈ క్రమంలోనే బడా బడా డైరెక్టర్స్ తో పాన్ ఇండియా మూవీలు చేస్తున్నాడు. రాధే శ్యామ్ సినిమా రిలీజ్ కావడానికి రెడీ అయింది. ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో ‘సలార్’, ఓం రౌత్ డైరెక్షన్లో ‘ఆదిపురుష్’ , నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘ప్రాజెక్ట్-ఖ్’ ,డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, మారుతి ఇలా వరుస సినిమాలను లైన్లో పెట్టి ఉన్నాడు.

కాగా, ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆదిపురుష్ చిత్రాన్ని కంప్లీట్ చేశాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, వీడియోస్ సినిమాపై మరింత ఆసక్తిని క్రియేట్ చేశాయి. కాగా ఈ చిత్ర డైరెక్టర్ ఓంరౌత్ రీసెంట్ ఇంటర్వ్యుల్లో మాట్లాదుతూ..ప్రభాస్ రాముడు కాదని తేల్చి చెప్పాడు. ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనున్నారని ఓ వార్త ఎప్పటినుండో వైరల్ అవుతుంది. ఇక తాజా ఇంటర్వ్యుల్లో ఆయనకు అదే ప్రశ్న ఎదురవ్వగా..ఆయన మాట్లాడుతూ..”ప్రభాస్ ది అసలు రాముడు క్యారెక్టర్ కాదు అని చెప్పుకొచ్చాడు. ఆదిపురుష్ స్టోరీ మీరు ఊహించినది కాదంటూ షాకింగ్ న్యూస్ చెప్పాడు.ఇందులో ప్రభాస్ పేరు రాఘవ్‌ అని..ఎవ్వరు ఊహించని విధంగా ప్రభాస్ పాత్ర ఈ సినిమాలో ఉంటుందని చెప్పుకొచ్చాడు. దీంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news