Moviesజై బాలయ్య: అభిమానులకు పూనకాలు తెప్పిస్తున్న మోక్షజ్ఞ ట్వీట్..ఇక రచ్చ రచ్చే..!!

జై బాలయ్య: అభిమానులకు పూనకాలు తెప్పిస్తున్న మోక్షజ్ఞ ట్వీట్..ఇక రచ్చ రచ్చే..!!

టాలీవుడ్ నట సింహం నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలకు కమిట్ అవుతూ ఫుల్ జోష్ మీద ఉన్నాడు. రీసెంట్ గా అఖండ సినిమాలో నటించిన బాలయ్య..ఈ సినిమా ద్వారా తిరుగులేని విజయం తన ఖాతాలో వేసుకున్నారు. సింహా, లెజెండ్‌ తర్వాత మూడోసారి బాల‌కృష్ణ‌- బోయ‌పాటి శీను కాంబినేష‌న్‌లో రూపొందిన ఈ చిత్రంపై అభిమానులు పెట్టుకున్న అంచనాలు మించి ఉమడడంతో సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఇందులో బాలయ్య అఘోరగా, ఊరుపెద్ద మనిషిగా రెండు విభిన్న పాత్రల్లో కనిపించి అభిమానులని మెప్పించారు.

కాగా..ప్రస్తుతం బాలయ్య డైనమిక్ డైరెక్టర్ గోపీచంద్ మల్లినేని డైరెక్షన్ లో ఓ సినిమాను కమిట్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాలోనూ బాల‌య్య డ్యూయల్ రోల్‌లో క‌నిపించ‌బోతున్నార‌ట‌. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యమేమంటే, ఓ పాత్ర‌లో ఫ్యాక్ష‌నిస్ట్‌గా మ‌రో పాత్ర‌లో స్వామిజీగా అల‌రించ‌బోతున్నాడ‌ని స‌మాచారం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. ఇక బాలయ్య ఢీ కొట్టే కీలక పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ ను ఫిక్స్ చేసారు మేకర్స్ . రీసెంట్ గానే ఈ విషయాని అధికారికంగా ప్రకటించారు చిత్రబృందం. ఈ మాస్ సినిమాలో విలన్‌గా క‌న్న‌డ న‌టుడు దునియా విజ‌య్ టాలీవుడ్‌‌కు పరిచయం అవుతున్నాడు.

ఇక ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని ఆశ గా అప్డేట్స్ కోసం ఎదురుచూసిన అభిమానులకు గుడ్ న్యూస్ అందించింది మూవీ టీం. ఫైనల్ గా నిన్ననే ఈ సినిమా షూట్ ని మేకర్స్ స్టార్ట్ చేశారట. ఈ విషయాని అధికారికంగా ప్రకటించింది. సిరిసిల్ల ప్రాంతంలో ఇంట్రెస్టింగ్ షెడ్యూల్ తో స్టార్ట్ చేసిన్నట్లు చెప్పుకొచ్చారు. అయితే బాలయ్య కొడుకు మోక్షజ్ఞ కూడా ఈ సినిమా గురించి అప్డేట్ ఇస్తూ..హై వోల్టేజ్ యాక్షన్ అంటూ బాలయ్య పిక్ ను షేర్ చేశాడు. ఇక ఆ పిక్ చూసిన నందమూరి అభిమానులు బాలయ్య అచ్చం సింహం లానే ఉన్నారు..జై బాలయ్య అంటూ..కామెంట్స్ చేస్తున్నారు. కాగా, ఈ సినిమాలో లెటేస్ట్ సెన్సేషన్ శ్రీలీల కూడా నటిస్తుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. బాలకృష్ణ కూతురుగా అమ్మడు ఈ సినిమాలో కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ సంగీతం అందిస్తున్నాడు.

 

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news