Moviesఎన్టీఆర్ బాల‌య్య షోకు ఆ కార‌ణంతోనే రాలేదా... సెకండ్ సీజ‌న్లో ఫ‌స్ట్...

ఎన్టీఆర్ బాల‌య్య షోకు ఆ కార‌ణంతోనే రాలేదా… సెకండ్ సీజ‌న్లో ఫ‌స్ట్ గెస్ట్‌గా ప‌క్కా..!

అఖండ స‌క్సెస్ త‌ర్వాత బాల‌య్య జోరు మామూలుగా లేదు. బాల‌య్య వ‌రుస పెట్టి సినిమాల మీద సినిమాలు ఓకే చేసుకుంటూ వెళుతున్నారు. ఓ వైపు మ‌లినేని గోపీచంద్ సినిమా ప‌ట్టాలు ఎక్కేసింది. అటు అనిల్ రావిపూడి సినిమా ఓకే అయ్యింది. ఇక అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్బీకే షో అయితే తిరుగులేని బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అయ్యింది. బాల‌య్య లాంటి స్టార్ హీరో ఈ టాక్ షోను ఈ రేంజ్‌కు తీసుకువెళ‌తార‌ని ఎవ్వ‌రూ ఊహించ‌లేదు.

ఫ‌స్ట్ సీజ‌న్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అవ్వ‌డంతో జూలై నుంచి సెకండ్ సీజ‌న్ స్టార్ట్ చేసేందుకు ఆహా వాళ్లు ప్లాన్ చేస్తున్నారు. 40 కోట్ల నిమిషాల పాటు వీక్షించిన టాక్ షోగా రికార్డుల‌కు ఎక్కిన ఈ షో బాల‌య్య స‌రిగా మాట్లాడ‌లేరు అని విమ‌ర్శిస్తోన్న ప్ర‌తి ఒక్క‌రు ముక్కున వేలేసుకునేలా చేసింది. ఇప్పుడు బాల‌య్య లాగా ఎవ్వ‌రూ మాట్లాడ‌లేరు.. ఆయ‌న స్థాయి ఎవ్వ‌రికి రాద‌ని చెపుతున్నారు.

బాల‌య్య త‌న‌దైన స్టైల్లో ప్ర‌శ్న‌లు వేస్తూ వారి నుంచి ఆన్స‌ర్లు రాబ‌ట్టిన తీరుకు ప్ర‌తి ఒక్క‌రు ఫిదా అవుతున్నారు. ఐఎండీబీ సైట్లోనే ఈ షో టాప్ ప్లేస్‌లో నిలిచింది. మోహ‌న్‌బాబు, మ‌హేష్‌బాబు, అల్లు అర్జున్ ఇలా వీరంతా ఈ షోలో సంద‌డి చేశారు. అయితే ఈ షోకు యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌, మెగాస్టార్ చిరంజీవి, యంగ్‌టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్‌, విక్ట‌రీ వెంక‌టేష్ లాంటి వాళ్లు రాలేదు.

బాబాయ్ బాల‌య్య‌, అబ్బాయ్ ఎన్టీఆర్ స్ట్రీమింగ్ ఎప్పుడు ఉంటుందా ? అని వెయిట్ చేసిన వారికి నిరాశే ఎదురైంది. ఎన్టీఆర్‌ను ఈ షోకు తీసుకువ‌చ్చే ప్ర‌య‌త్నం జ‌రిగింద‌ట‌. ఈ విష‌యాన్ని ఈ షోకు ప‌నిచేసిన స్టార్ రైట‌ర్‌, ద‌ర్శ‌కుడు బీవీఎస్‌. ర‌వి స్వ‌యంగా చెప్పారు. రాజ‌మౌళి – కీర‌వాణి – ఎన్టీఆర్ కాంబినేష‌న్లో ఎపిసోడ్ ప్లాన్ చేశార‌ట‌. అయితే ఎన్టీఆర్ బిజీ షెడ్యూల్‌తో ఉండ‌డంతో ఈ ఎపిసోడ్‌కు రాలేద‌ని చెప్పారు.

అయితే సెకండ్ సీజ‌న్లో ఫ‌స్ట్ ఎపిసోడ్‌కు ఎన్టీఆర్‌ను తీసుకువ‌చ్చే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంద‌ట‌. అలాగే సీనియ‌ర్ హీరో వెంక‌టేష్‌తో పాటు ప్ర‌భాస్ – కృష్ణంరాజుతో కూడా స్పెష‌ల్ ఎపిసోడ్స్ ప్లాన్ చేశామ‌ని.. ప్ర‌భాస్ రాధేశ్యామ్ ప‌నుల్లో బిజీగా ఉండ‌డంతో కుద‌ర్లేద‌ని ర‌వి తెలిపారు. ఏదేమైనా బాబాయ్ – అబ్బాయ్ ఎపిసోడ్ అంటే నంద‌మూరి అభిమానుల‌కు అంత‌క‌న్నా కావాల్సింది ఏముంటుంది ?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news