Moviesఎన్టీఆర్ - కొర‌టాల సినిమా.. ఆలియా ఇలా హ్యాండ్ ఇచ్చిందేంటి...!

ఎన్టీఆర్ – కొర‌టాల సినిమా.. ఆలియా ఇలా హ్యాండ్ ఇచ్చిందేంటి…!

ఆలియాభ‌ట్ ఇప్పుడు నేష‌న‌ల్ వైడ్‌గా పాపులారిటీ ఉన్న కుర్ర హీరోయిన్ల‌లో ఒక‌రు. కావాల్సినంత అందంతో పాటు అభిన‌యం కూడా ఉండ‌డంతో ఆలియా మాంచి డిమాండ్ ఉన్న హీరోయిన్ అయ్యింది. ఆలియాను టాలీవుడ్‌లో న‌టింప‌జేయాల‌న్న ప్ర‌య‌త్నాలు గ‌త కొన్నేళ్ల నుంచి న‌డుస్తూనే ఉన్నాయి. అయితే రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిన త్రిబుల్ ఆర్ సినిమాలో ఆలియా రామ్‌చ‌ర‌ణ్‌స స‌ర‌స‌న న‌టించింది.

ఇక ఇప్పుడు ఎన్టీఆర్ – కొర‌టాల శివ కాంబోలో తెర‌కెక్కుతోన్న పాన్ ఇండియా సినిమాలో కూడా ఆలియాభ‌ట్‌నే హీరోయిన్‌గా తీసుకున్నారు. నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్ – కొర‌టాల ఫ్రెండ్ మిక్కిలినేని సుధాక‌ర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఆలియా ప్ర‌స్తుతం గుంగూబాయి క‌తియావాడీ సినిమాలో న‌టించింది. ముంబై క‌మాటీపుర రెడ్‌లైట్ ఏరియాలో ఒక‌ప్పుడు రాజ్యం న‌డిపించిన గంగూబాయి బయోపిక్ ఆధారంగా ఈ సినిమా తెర‌కెక్కింది.

పాన్ ఇండియా రేంజ్‌లో తెర‌కెక్కిన ఈ సినిమా ఈ నెల 25న రిలీజ్ అవుతోంది. ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో బిజీగా ఉన్న ఆలియా ఎన్టీఆర్ సినిమా ప్రారంభోత్స‌వానికి హ్యాండ్ ఇచ్చేసింది. ఎన్టీఆర్ – కొర‌టాల సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో తెర‌కెక్కుతోంది. ఈ క్ర‌మంలోనే లాంఛింగ్ నుంచే ఈ సినిమాను బాగా హైలెట్ చేయాల‌ని ఆలియాను కూడా ఇన్వైట్ చేశార‌ట‌. అయితే గంగూబాయి ప్ర‌మోష‌న్ల‌లో బిజీగా ఉన్న ఆలియా తాను ఈ ప్రోగ్రామ్‌కు రాలేన‌ని చివ‌ర్లో చెప్పింద‌ట‌.

దీంతో అట్ట‌హాసంగా చేయాల‌నుకున్న ఈ లాంఛింగ్ ప్రోగ్రామ్‌ను వాయిదా వేశార‌ట‌. ఆలియాకు ఎప్పుడు కుదిరితే అప్పుడే ఈ సినిమాను ఓపెనింగ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. మరి అలియా ఎప్పుడు తీరిక చేసుకుంటుందో చూడాలి. ఈ సినిమాలో ఎన్టీఆర్ స్టూడెంట్ లీడ‌ర్‌గా క‌నిపిస్తుండ‌గా.. బ‌స్తీ విద్యార్థుల హ‌క్కుల‌ను కాపాడే క్ర‌మంలో రాజ‌కీయ నాయ‌కుల‌కు ఎలా ఎదురు తిరిగాడు ? అన్న క‌థాంశంతో పాటు కొర‌టాల మార్క్ యాక్ష‌న్‌, ఎమోష‌న‌ల్‌గా ఈ సినిమా ఉంటుంద‌ని టాక్ ?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news