Moviesమూడో భార్య‌పై న‌రేష్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు.. వీరి పెళ్లి వెన‌కే ఇంత...

మూడో భార్య‌పై న‌రేష్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు.. వీరి పెళ్లి వెన‌కే ఇంత ట్విస్ట్ ఉందా..!

సీనియ‌ర్ న‌టుడు న‌రేష్ పేరు చెప్పుకుని ర‌మ్య ర‌ఘుప‌తి అనే మ‌హిళ డ‌బ్బూలు వ‌సూలు చేస్తున్న‌ట్టు పోలీసుల‌కు ఫిర్యాదులు అందుతున్నాయి. ఇప్పుడు ఈ విష‌యం వైర‌ల్‌గా మార‌డంతో న‌రేష్ స్పందించారు. ర‌మ్య ర‌ఘుప‌తి అనే మ‌హిళ వ‌సూలు చేస్తున్న డ‌బ్బు వ‌సూళ్ల‌తో త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌ని న‌రేష్ ప్ర‌క‌టించారు. ఇప్ప‌టికే ర‌మ్య త‌మ ద‌గ్గర నుంచి డ‌బ్బులు వ‌సూలు చేస్తుందంటూ హైద‌రాబాద్ గ‌చ్చిబౌలి పోలీస్‌స్టేష‌న్లో ఐదుగురు మ‌హిళ‌లు ఫిర్యాదు చేయ‌డంతో పోలీసులు ఆమెపై కేసు న‌మోదు చేసిన‌ట్టు టాక్ ?

ఆమె న‌రేష్ పేరు చెప్పుకుని అనంత‌పురం, హిందూపుర్‌, హైద‌రాబాద్‌లో ప‌లువురు ద‌గ్గ‌ర నుంచి భారీ మొత్తంలో డ‌బ్బులు వ‌సూలు చేసిన‌ట్టు కూడా ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇక ర‌మ్య ర‌ఘుప‌తి ఎవ‌రు ? ఆమెతో న‌రేష్‌కు ఉన్న అనుబంధం ఏంట‌న్న‌ది ప‌రిశీలిస్తే ఆమెది కూడా కాస్త ప‌ర‌ప‌తి ఉన్న బ్యాక్‌గ్రౌండ్‌. ఆమె ఏపీ మాజీ మంత్రి ర‌ఘువీరారెడ్డి సోద‌రుడి కుమార్తె. ఆస్ట్రేలియాలో ఫిల్మ్ మేకింగ్ కోర్సు చేసిన ఆమె న‌రేష్‌కు మూడో భార్య‌.

8 ఏళ్ల క్రితం వీరు పెళ్లి చేసుకున్నారు. ఆస్ట్రేలియాలో ఫిల్మ్ మేకింగ్ కోర్సు అనంత‌రం ఆమె ద‌ర్శ‌కుడు నీల‌కంఠ ద‌గ్గ‌ర అసిస్టెంట్‌గా ప‌నిచేసింది. నంద‌న‌వ‌నం సినిమాకు అసిస్టెంట్‌గా ప‌నిచేస్తోన్న టైంలో న‌రేష్‌తో ఏర్ప‌డిన ప‌రిచయం ప్రేమ‌గా మారి వీళ్లు పెళ్లి చేసుకున్నారు. ఆ త‌ర్వాత న‌రేష్ రిక‌మెండేష‌న్‌తో ఆమె విజ‌య‌నిర్మ‌ల ద‌గ్గ‌ర కూడా కో డైరెక్ట‌ర్‌గా ప‌నిచేసింది. ఇరు కుటుంబాల వారిని ఒప్పించి వీళ్లు పెళ్లి చేసుకున్నారు. ఈ దంప‌తుల‌కు ర‌ణ‌వీర్ అనే కుమారుడు కూడా ఉన్నాడు.

ఇక వీరి పెళ్లి జ‌రిగిన‌ప్పుడు న‌రేష్‌కు 50 ఏళ్ల వ‌య‌స్సు కాగా.. అప్పుడు ర‌మ్య‌కు అందులో స‌గం మాత్ర‌మే వ‌య‌స్సు.. ఇద్దరి మ‌ధ్య దాదాపు 25 ఏళ్లు తేడా..! ఇక ఒక బాబు పుట్టాక వారి మ‌ధ్య విబేధాలు చోటు చేసుకున్నాయి. అనంత‌రం న‌రేష్ ఆస్తుల్లో త‌న‌కూ భాగం ఉంద‌ని ఆరోప‌ణ‌లు చేసిన ఆమె ఇప్పుడు ప‌లువురి నుంచి న‌రేష్ పేరు చెప్పుకుని భారీ మొత్తంలో డ‌బ్బులు వ‌సూలు చేసింద‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. అయితే న‌రేష్ మాత్రం ర‌మ్య వ‌సూళ్ల‌తో త‌న‌కు సంబంధం లేద‌ని ప్ర‌క‌టించారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news