Moviesరెమ్యున‌రేష‌న్ పెంచేసిన పెళ్లిసందD శ్రీలీల‌... వామ్మో ఇంత రేటా ?

రెమ్యున‌రేష‌న్ పెంచేసిన పెళ్లిసందD శ్రీలీల‌… వామ్మో ఇంత రేటా ?

ఇప్పుడు హీరోయిన్లు బాగా ముదిరిపోయి ఉన్నారు.. ఒక్క సినిమా హిట్ అయితే చాలు రెమ్యున‌రేష‌న్ పెంచేస్తున్నారు. అనుష్క‌, త్రిష‌, న‌య‌న‌తార లాంటి ఒక‌రిద్ద‌రు హీరోయియ‌న్ల‌ను వ‌దిలేస్తే చాలా మంది హీరోయిన్ల‌కు కెరీర్ చాలా త‌క్కువ టైం ఉంటుంది. అందుకే క్రేజ్ ఉన్న‌ప్పుడు, ఫామ్లో ఉన్న‌ప్పుడే నాలుగు రాళ్లు వెన‌కేసుకోవాల‌ని చూస్తూ ఉంటారు. ఇక తెలుగు అమ్మాయి అయిన శ్రీలీల న‌క్క తోక తొక్కిందేమో గాని తొలి సినిమా పెళ్లిసందD సినిమాతో సూప‌ర్ హిట్ కొట్టేసింది.

బెంగ‌ళూరులో ఉంటూ తెలుగు మూలాలు ఉన్న శ్రీలీల పెళ్లిసంద‌డి సినిమాతో ఒక్క‌సారిగా పాపుల‌ర్ అయ్యింది. ఇంకా చెప్పాలంటే ఈ సినిమాకు ముందు డివైడ్ టాక్ వచ్చింది. శ్రీకాంత్ త‌న‌యుడు రోష‌న్ హీరోగా తెర‌కెక్కిన ఈ సినిమా చూసి ప్రేక్ష‌కులు, విమ‌ర్శ‌కులు కూడా పెద‌వి విరిచారు. అయితే శ్రీలీల అందంతో పాటు పెర్పామెన్స్ చూసిన జ‌నాలు ముక్కున వేల‌సుకున్నారు. ఈ సినిమా విజ‌యంలో స‌గం పాత్ర శ్రీలీల‌దే.

డివైడ్ టాక్‌తో కూడా పెళ్లిసంద‌డి సినిమాకు మంచి లాభాలు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలోనే శ్రీలీల‌కు మంచి అవ‌కాశాలు వచ్చాయి. మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ హీరోగా తెర‌కెక్కిన సినిమాలో శ్రీలీల‌కు అవ‌కాశం వచ్చింది. ఇప్పుడు టాలీవుడ్‌లో పెద్ద హీరోలు సైతం శ్రీల‌ల‌ను త‌మ సినిమాల్లో హీరోయిన్‌గా పెట్టుకోవాల‌ని చూస్తున్నారు. జూనియ‌ర్ ఎన్టీఆర్ సినిమాలో రెండో హీరోయిన్ ఛాన్స్ కోసం కూడా ఆమె పేరు ప‌రిశీల‌న‌కు వచ్చిందంటే శ్రీలీల మామూలుది కాదు.

ఇప్పుడు ఆమె ఒక్కో సినిమాకు రు. 75 ల‌క్ష‌లు డిమాండ్ చేస్తోంద‌ట‌. అస‌లు ఆమె తొలి సినిమా రెమ్యున‌రేష‌న్‌కు ఇప్పుడు తీసుకునే రెమ్యున‌రేష‌న్‌కు అస‌లు సంబంధ‌మే లేదు. వైష్ణ‌వ్ తేజ్ సినిమాతో పాటు న‌వీన్ పోలిశెట్టి సినిమాలో, సితార బ్యాన‌ర్లో తెర‌కెక్కే సినిమాలో కూడా ఆమె హీరోయిన్‌గా ఫిక్స్ అయిన‌ట్టు తెలుస్తోంది.

వ‌రుస‌గా క్రేజీ డైరెక్ట‌ర్ల‌తో పాటు కుర్ర హీరోల సినిమాల్లో ఆమెకు అవ‌కాశాలు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలోనే శ్రీలీల త‌న కెరీర్‌ను బాగా డిజైన్ చేసుకుంటూ గోల్డెన్ గ‌ర్ల్ అనిపించుకుంటోంది. మ‌రి ఈ ఫామ్ ఆమె ఎప్ప‌టి వ‌ర‌కు కంటిన్యూ చేస్తుందో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news