Moviesఒక్కే హోటల్లో ధనుష్ ఐశ్వర్య..రజనీకాంత్ రూటే వేరబ్బా..?

ఒక్కే హోటల్లో ధనుష్ ఐశ్వర్య..రజనీకాంత్ రూటే వేరబ్బా..?

సినీ ఇండస్ట్రీలో వరుసగా ఒకరు తరువాత ఒకరు..స్టార్ సెలబ్రిటీల జంట విడాకులు తీసుకుంటూ అభిమానులకు షాక్ లు మీద షాకులు ఇస్తున్నారు. మొన్న సమంత నాగ చైతన్య ..అంతకముందు అమీర్ఖాన్..నిన్న ధనుష్ ఐశ్వర్య ఇలా ఎంతో అన్యోన్యంగా ఉండే జంటలు అంతా..విడాకులు తీసుకుని సింగిల్ గా బ్రతకడానికే ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య – హీరో ధనుష్ విడాకుల వ్యవహారం కేవలం టాలీవుడ్లోనే కాకుండా దేశవ్యాప్తంగా అన్ని సినిమా ఇండస్ట్రీలోని పెద్ద సంచలనంగా మారింది. కోళీవుడ్ లో టాప్ రెమ్యూనరేషన్ తీసుకునే ధనుష్ అంటే ఇష్టపడనని వాళ్లంటూ ఎవ్వరు ఉండరు.

ఎన్నో సినిమాల్లో తనదైన స్టైల్లో నటించి కొట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈయన తన 18 ఏళ్ల తన వైవాహిక జీవితానికి స్వస్తి పలికి రజని కుమార్తె ఐశ్వర్య నుంచి విడిపోతాడ‌ని అసలు ఎవరు ఎప్పుడు ఊహించలేదు. దీంతో ఆయన అభిమానులుడిలాపడిపోయారు. ప్లీజ్ ఇలా చేయకండి అంటూ సోషల్ మీడియా వేదికగా రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇక ధనుష్ తండ్రి కూడా వీరి విడాకుల పై స్పందిస్తూ ..పిల్లలు ఏదో కోఫంలో అలా అన్నారు. వాళ్లు విడిపోరు వాళ్ల పిల్లల్ల భవిష్యతు కోసం అయినా కలిసి ఉంటారు అంటూ కామెంట్స్ చేసారు.

ఇక ఈ క్రమంలోనే ధనుష్ ఐశ్వర్య ఒక్కే హోటల్లో ఉంటున్నారంటూ వార్తలు వస్తున్న నేపధ్యంలో అభిమానులు ఈ జంత కలిసిపోయారంటూ హ్యాపీ న్యూస్ త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తారంటున్నారు. ఇటీవల విడాకులతో వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతున్నాము అంటూ చెప్పిన ధనుష్ ఐశ్వర్య ఇద్దరు కూడా ప్రస్తుతం వారి వారి పనిలో మునిగి పోయి మళ్లీ బిజీ బిజీగా మారిపోయారు అని అర్థమవుతుంది. విడాకులు తర్వాత ఐశ్వర్య ధనుష్ హైదరబాద్ లో ఒకే హోటల్లో ఉన్నట్లు తెలుస్తుంది.

ప్రస్తుతం ధనుష్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇక షూటింగ్ నిమిత్తం ఇటీవలే హైదరాబాదుకు వచ్చాడట. ఇక ఐశ్వర్య కూడా ఓ లవ్ సాంగ్ షూటింగ్ కోసం హైదరబాద్ వచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఐశ్వర్య ధనుష్ ఇద్దరూ కూడా ఒకే హోటల్ లో ఉండేలా రజనీకాంత్ ప్లాన్ చేసి.. రామోజీరావు స్టూడియో లోని సితారా హోటల్లో ఇద్దరికి పక్క పక్కనే రూంస్ బుక్ చేసారట. దీంతో ధనుష్ ఐశ్వర్య మధ్య గొడవలు కొంచెం అయిన తగ్గి మళ్ళీ కలిసి ఉండటానికి ట్రై చేస్తారని ఇలా ప్లాన్ చేసిన్నట్లు తెలుస్తుంది. దీంతో విడాకుల తర్వాత మళ్లీ ఐశ్వర్య ధనుష్ కలుసుకున్నారు అంటూ వార్తలు ప్రస్తుతం వైరల్ గా మారిపోయాయ్. మరి చూడాలి రజనీ ప్లాన్ వర్క్ అవుట్ అవుతుందోలేదో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news