Moviesహీరో ల‌వ‌ర్‌కు న‌చ్చ‌లేద‌ని స్టార్ హీరోయిన్‌ను సినిమా నుంచి తీసేశారా...!

హీరో ల‌వ‌ర్‌కు న‌చ్చ‌లేద‌ని స్టార్ హీరోయిన్‌ను సినిమా నుంచి తీసేశారా…!

బాలీవుడ్ సీనియ‌ర్ హీరోయిన్ ర‌వీనా టాండ‌న్ 48 ఏళ్ల వ‌య‌స్సులో ఉంది. యేడాదికేడాదికి ఆమె వ‌య‌స్సు పెరుగుతున్నా వ‌న్ను మాత్రం త‌గ్గ‌డం లేదు. ఆమె ప్ర‌ముఖ డిస్ట్రిబ్యూట‌ర్ అనిల్ థ‌డానీని ప్రేమ వివాహం చేసుకుని ఎంచ‌క్కా ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. తాజాగా కేజీఎఫ్ 2లో కీల‌క పాత్ర కోసం ఆమె సెకండ్ ఇన్సింగ్స్ స్టార్ట్ చేసింది. ఇక ఇటు ఓటీటీల కోసం వెబ్‌సీరిస్‌లు కూడా చేస్తోంది.

ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న ఓ షోకోసం ఆమె మీడియా ముందుకు వ‌చ్చింది. ఈ క్ర‌మంలోనే ఆమె కెరీర్ స్టార్టింగ్‌లో ఎదుర్కొన్న ఇబ్బందులు కూడా వెల్ల‌డించింది. ఓ స్టార్ హీరోతో క‌లిసి న‌టించాల్సిన రెండు, మూడు సినిమాలు క్యాన్సిల్ అయ్యాయ‌ని కూడా చెప్పింది. అప్ప‌టికే స‌ద‌రు స్టార్ హీరో, ర‌వీనా కాంబోలో చాలా హిట్ సినిమాలు వ‌చ్చాయ‌ట‌. అప్ప‌ట్లో ఈ జంట‌కు మార్కెట్లో క్రేజ్ ఉండ‌డంతో ఇద్ద‌రు ముగ్గురు ద‌ర్శ‌క నిర్మాత‌లు సైతం వీరి కాంబినేష‌న్ ఫిక్స్ చేశార‌ట‌.

ఇక ఈ సినిమాలు వ‌రుస‌గా సెట్స్ మీద‌కు వెళ్లే టైంలో ర‌వీనాను త‌ప్పించేసి ఇత‌ర హీరోయిన్ల‌ను తీసుకున్నార‌ట‌. అదేమిట‌ని అడిగితే స‌ద‌రు హీరో ప్రియురాలి ఒత్తిడి మేర‌కు ఆ ద‌ర్శ‌క నిర్మాత‌లు ర‌వీనాను త‌మ ప్రాజెక్టుల నుంచి త‌ప్పించేసి.. ఆ ప్లేసులో ఇత‌ర హీరోయిన్ల‌ను తీసుకున్నార‌ట‌. చాలా సార్లు సినిమాల్లో హీరోల ప్రియురాళ్ల సిఫార్సుల మేర‌కు హీరోయిన్ల‌ను ఎంపిక చేస్తుంటే.. మ‌రి కొన్నిసార్లు ద‌ర్శ‌క‌, నిర్మాతల అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్టుగా హీరోయిన్ల‌ను తీసుకునేవార‌ని చెప్పింది.

ఇక ర‌వీనా కెరీర్ ప‌రంగా మాంచి ఫామ్‌లో ఉన్న‌ప్పుడే అప్పుడు బాలీవుడ్ క్రేజీ హీరో అక్ష‌య్ కుమార్‌తో ప్రేయామ‌ణం సాగించింద‌న్న వార్త‌లు వ‌చ్చాయి. వీరు పెళ్లి చేసుకుంటారు అనుకుంటోన్న టైంలోనే బ్రేక‌ప్ అయ్యింది. త‌ర్వాత చాలా రోజులు వీరు ఎడ‌మొఖం.. పెడ‌మొఖంగా ఉన్నారు. ఆ త‌ర్వాత అక్ష‌య్‌, ట్వింకిల్ ఖ‌న్నాను ప్రేమించి.. ఆమెను పెళ్లాడాడు.

ఇక ర‌వీనా త‌ర్వాత అక్ష‌య్ శిల్పాశెట్టితో చాలా రోజులు ప్రేమ‌లో ఉన్నాడు. ఆమె వ‌ల్లే ర‌వీనాను కొన్ని సినిమాల నుంచి త‌ప్పించేశార‌న్న టాక్ అప్ప‌ట్లో వినిపించింది. ఆ త‌ర్వాత ట్వింకిల్‌ను భార్య‌ను చేసుకున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news