MoviesNTR # 30.. ఫ్యీజులు ఎగిరిపోయేలా రెండు ఆప్‌డేట్స్ వ‌చ్చేశాయ్‌..

NTR # 30.. ఫ్యీజులు ఎగిరిపోయేలా రెండు ఆప్‌డేట్స్ వ‌చ్చేశాయ్‌..

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమా కమిట్ అయ్యి దాదాపుగా నాలుగు ఏళ్లు పూర్త‌య్యింది. 2018 చివ‌ర్లో వ‌చ్చిన అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ త‌ర్వాత ఎన్టీఆర్ సినిమా మ‌ళ్లీ రిలీజ్ కాలేదు. ఈ మ‌ధ్య‌లో బ‌న్నీ రెండు సార్లు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. మ‌హేష్‌బాబు సినిమా కూడా రిలీజ్ అయ్యింది. ఎన్టీఆర్ సినిమా మాత్రం రిలీజ్‌కాలేదు. త్రిపుల్ ఆర్ కోసం మూడేళ్లు ప‌నిచేయ‌డంతో పాటు క‌రోనా రెండు సార్లు రావ‌డంతో ఎన్టీఆర్ మ‌రో సినిమాలో న‌టించే ఛాన్స్ రాలేదు.

ఇక త్రిపుల్ ఆర్ నుంచి ఇప్పుడే బ‌య‌ట‌కు వ‌చ్చిన ఎన్టీఆర్ ఇప్పుడు కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. యువ‌సుధా ఆర్ట్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఎన్టీఆర్ 30వ సినిమాగా ఈ ప్రాజెక్టు ప‌ట్టాలు ఎక్క‌నుంది. ఆచార్యను ఫినిష్ చేసిన కొర‌టాల ఎన్టీఆర్ సినిమాను త్వ‌ర‌గా ప‌ట్టాలెక్కించే ప‌నిలో బిజీగానే ఉన్నారు.

ఇక ఈ సినిమా సెట్స్ మీద‌కు వెళ్ల‌కుండానే రెండు అదిరిపోయే అప్‌డేట్స్ ఇచ్చేందుకు యూనిట్ స‌భ్యులు రెడీగా ఉన్నారు. అందులో ఒక‌టి ఈ క్రేజీ ప్రాజెక్టులో ఎన్టీఆర్‌కు జోడీగా బాలీవుడ్ ముద్దుగుమ్మ ఆలియాభ‌ట్ న‌టిస్తుంద‌న్న వార్త‌. ఫిబ్ర‌వ‌రి ఫ‌స్ట్ వీక్‌లోనే ఆలియాభ‌ట్ అనౌన్స్‌మెంట్ ఉంటుంద‌ట‌. ఇప్ప‌టికే ఆలియాతో అగ్రిమెంట్ కూడా ఫినిష్ అయ్యింద‌నే అంటున్నారు. త్రిపుల్ ఆర్ సినిమాలో ఆలియా న‌టించినా ఆమె చ‌ర‌ణ్ ప‌క్క‌న క‌నిపిస్తుంది.

ఆలియా ఈ సినిమాకు యాడ్ అయితే బాలీవుడ్‌లో మంచి మార్కెట్ ఉండొచ్చు. ఇక రెండో అప్‌డేట్ ఈ సినిమాకు అనిరుధ్ ర‌విచంద్ర‌న్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా ఎంపిక‌య్యాడు. ఆలియా అనౌన్స్‌మెంట్‌తో పాటే అనిరుధ్ అనౌన్స్‌మెంట్ కూడా ఉంటుంద‌ని టాక్ ? ఏదేమైనా సెట్స్ మీద‌కు వెళ్ల‌కుండానే అంచ‌నాలు స్కై రేంజ్‌లో ఉండేలా ఎన్టీఆర్ 30 ఉండ‌బోతోంద‌న్న‌ది నిజం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news