Moviesపోలీసుల‌కు ఫిర్యాదు... క‌రాటే క‌ళ్యాణిని చంపాల‌ని చూస్తోందెవ‌రు... !

పోలీసుల‌కు ఫిర్యాదు… క‌రాటే క‌ళ్యాణిని చంపాల‌ని చూస్తోందెవ‌రు… !

కరాటే కళ్యాణి ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో ఎన్నో సినిమాల‌లో పాపులర్ క్యారెక్టర్ పాత్రల‌లో నటించిన ఆమె ఇటీవల తరచూ ఏదో ఒక కాంట్రవర్సీ అంశాలతో వార్తల్లోకి ఎక్కుతున్నారు. విజయనగరం జిల్లాకు చెందిన కరాటే కళ్యాణి ప్రారంభంలో హరికథలు చెప్పేవారు. ఆ తర్వాత ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలగాలని ఇక్కడికి వచ్చారు. కెరీర్ ప్రారంభంలో చిన్నాచితక పాత్రలు వేసిన కళ్యాణి ఆ తర్వాత మంచి పాత్రలతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు.

ఆ త‌ర్వాత అదే పాపులారిటీతో బిగ్ బాస్ హౌస్ లో కూడా ఎంట్రీ ఇచ్చారు. ఇటు రాజకీయంగానూ యాక్టివ్‌గానే ఉంటారు. ఇక సోషల్ మీడియాలోనూ తాను ఏం చెప్పాలనుకుంటున్నానో అది ముక్కుసూటిగా చెప్పేస్తూ ఉంటారు. ఇక బిగ్ బాస్ షో నుంచి తొలివారంలోనే ఎలిమినేట్ అయిన కళ్యాణి బిగ్‌బాస్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బీజేపీ లో ఉన్న కళ్యాణి ఆ పార్టీలో ఫైర్‌బ్రాండ్‌గా ఎదిగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

క‌ళ్యాణి తాజాగా మరో వివాదంలో ఇరుక్కున్నారు. కొందరు వ్యక్తుల ఓ విషయంలో తనను చంపాలని ప్రయత్నిస్తున్నారంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ప్రాణాలకు వారి నుంచి ముప్పు ఉందని… తనకు రక్షణ కల్పించాలని ఆమె పోలీసులను ఆశ్రయించారు. క‌రాటే క‌ళ్యాణి తనకు ప్రాణ రక్షణ ఉందని పోలీసులకు ఫిర్యాదు చేయడం.. ఇప్పుడు మీడియా వర్గాల్లోనూ, ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

ఓ హ‌త్య కేసులో సాక్ష్యాలు తారుమారు చేసిన క్ర‌మంలోనే ఓ ప్ర‌ముఖ స్వ‌చ్ఛంద సంస్థ రు. 3 కోట్లు దుర్వినియోగం చేసింద‌ని.. ఈ విష‌యాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నందునే వాళ్లు త‌న‌ను చంపాల‌ని చూస్తున్నారంటూ ఆమె ఆరోపించింది. క‌ళ్యాణి ఫిర్యాదు స్వీక‌రించిన పోలీసులు విచార‌ణ చేస్తామ‌ని చెప్పారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news