Moviesఒక్కో సినిమాకు సాయిప‌ల్ల‌వి రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా...!

ఒక్కో సినిమాకు సాయిప‌ల్ల‌వి రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా…!

సౌత్ ఇండియాలో ఇప్పుడు సాయి పల్లవి హవా మామూలుగా లేదు. మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన సాయి పల్లవికి సొంత భాషలో కంటే ఇప్పుడు తెలుగు లోనే ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి. తెలుగు ప్రజలు సాయి పల్లవిని తెలుగింటి ఆడపడుచుగా భావిస్తున్నారు. ఫిదా సినిమాలో ఆమె త‌న మెస్మ‌రైజింగ్ న‌ట‌న‌తో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది. ఇక గతేడాది కూడా నాగచైతన్య సరసన లవ్ స్టోరీ…. నాని సరసన శ్యామ్‌సింగ‌రాయ్‌ సినిమాల్లో నటించి అద్భుతమైన నటనతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది.

తెలుగుతో పాటు తమిళంలోనూ ఆమెకు స్టార్ హీరోల సరసన వరుసగా అవకాశాలు వస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే ఆమె బిజీ షెడ్యూల్ తో మంచి సినిమాలు కూడా వదులుకున్న పరిస్థితి ఉంది. సింగ‌రాయ్ సినిమాలో దేవ‌దాసి పాత్ర‌లో ఆమె న‌ట‌న‌కు విమ‌ర్శ‌కుల ప్ర‌శ‌సంలు కూడా వ‌చ్చాయి. ఇక తాజాగా ఆమె వేణు ఉడుగుల ద‌ర్శ‌క‌త్వంలో విరాట‌ప‌ర్వం కూడా చేస్తోంది. ఇది కూడా క్రేజీ ప్రాజెక్టే.

న‌క్స‌లిజం నేప‌థ్యంలో వ‌స్తోన్న ఈ సినిమాలో సాయిప‌ల్ల‌వి పేదింటి యువ‌తి పాత్ర‌లో క‌నిపించ‌నుంది. ఇక సాయిప‌ల్ల‌వి రెమ్యున‌రేష‌న్ విష‌యానికి వ‌స్తే ఆమె ఒక్కో సినిమాకు కోటి నుంచి కోటిన్న‌ర వ‌ర‌కు తీసుకుంటోంద‌ట‌. అయితే ఆమె న‌టించిన కొన్ని సినిమాల‌తో నిర్మాత‌ల‌కు న‌ష్టం వ‌స్తే ఆమె రెమ్యున‌రేష‌న్ త‌గ్గించుకోవ‌డంతో పాటు తిరిగి ఇచ్చిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయి.

కేవ‌లం డ‌బ్బుకోస‌మే సాయిప‌ల్ల‌వి సినిమాలు చేయ‌దు.. పాత్ర త‌న‌కు న‌చ్చితేనే ఆమె సినిమాకు ఒప్పుకుంటుంది. పైగా ఆమె నుంచి ఎక్స్‌పోజింగ్ లాంటి పాత్ర‌లు కూడా ఉండ‌వు. పాత్ర న‌చ్చ‌క‌పోవ‌డంతో ఆమె ఇద్ద‌రు స్టార్ హీరోల సినిమాల్లో న‌టించే అవ‌కాశం కూడా వ‌దులుకుంది. ఇలా రు. 8 కోట్ల వ‌ర‌కు ఆమె న‌ష్ట‌పోయింద‌ట‌.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news