Moviesసూసైడ్ చేసుకోవాలి అనుకున్న శ్రీకాంత్..కారణం ఏంటో తెలుసా..!

సూసైడ్ చేసుకోవాలి అనుకున్న శ్రీకాంత్..కారణం ఏంటో తెలుసా..!

శ్రీకాంత్..టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేకమైన పేజీని లిఖించుకుని..వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఫ్యామిలీ సినిమాలతో పాటు యాక్షన్ సినిమాల్లో తనదైన ముద్ర వేసుకున్న హ్యాండ్‌సమ్ హీరో శ్రీకాంత్. టాలీవుడ్ పరిశ్రమలో హీరో శ్రీకాంత్ కూడా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా తన తెలివి తేటలతో ఎంతో కష్ట పడి సినిమా ఇండస్ట్రీకి వచ్చి మొదటిలో చిన్న చిన్న వేషాలు కట్టుకొని విలన్ గా కూడా నటించి ఆ తరువాత హీరోగా మారి మంచి లవర్ బాయ్ గా ఆ రోజుల్లో ఆడవాళ్ళ మనసుల్ని ఎంతగానో దోచుకొని మెప్పించారు.

ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన పీపుల్స్ ఎన్‌కౌంటర్ శ్రీకాంత్‌‌కు నటుడిగా మొదటి సినిమా. వన్‌‌బైటు (1993) హీరోగా శ్రీకాంత్ మొట్టమొదటి సినిమా. ఆ తర్వాత వచ్చిన తాజ్‌‌మహల్ (1995) సినిమా మంచి విజయం సాధించడంతో శ్రీకాంత్ హీరోగా నిలదొక్కుకున్నాడు. ఇక దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన పెళ్ళి సందడి (1996) చిత్రం శ్రీకాంత్ కెరీర్‌‌ని అమాంతం మార్చేసిందనే చెప్పాలి. ఒక టైం లో మంచి దశలో టాలీవుడ్ లో టాప్ హీరో గా ఓ రేంజ్లో కి శ్రీకాంత్ ఎదిగాడు .

కానీ కొన్ని రోజుల తర్వాత హిట్ లు రాకపోవడం తో హీరో అవకాశాలు తగ్గిపోయి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించే అవకాశాలు పెరిగిపోయాయి. దాంతో హీరో గా చేస్తూనే కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించాడు. ఇది ఇలా ఉండగా శ్రీకాంత్ గతంలో సూసైడ్ చేసుకోవాలి అనుకున్నారట. ఈ విషయాని స్వయంగా ఆయనే తెలిపారు. తన తండ్రితో గొడవపడి సంధర్భంలో ఏకంగా చెరువులో దూకుతానని బెదిరించారట.

శ్రీకాంత్ ఒక విషయంలో తప్పు చేసాడట. ఇక అప్పుడు తన తండ్రి వార్నింగ్ ఇచ్చి ఇంటికి రమ్మని పిలిచారట. అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత నన్ను కొడితే నేను చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంటానని తన తండ్రిని బెదిరించానని ఓ ఇంటర్వ్యుల్లో చెప్పుకొచ్చారు శ్రీకాంట్. రీసెంట్ గా ఈయన విలన్ గా నటించిన అఖండ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనకు తెలిసిందే.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news