Moviesబ‌న్నీకి బాల‌య్య అయితే మెగాస్టార్‌కు జూనియ‌ర్ ఎన్టీఆరా...!

బ‌న్నీకి బాల‌య్య అయితే మెగాస్టార్‌కు జూనియ‌ర్ ఎన్టీఆరా…!

టాలీవుడ్ లో ఎవరు ఎప్పుడు చూడని కాంబినేషన్లు ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి. నందమూరి నట సింహం బాలయ్య పెద్దగా బయటకు రారు… తన పనేదో తాను చూసుకుంటారు. అలాంటి వ్యక్తి ఒక్కసారిగా బుల్లితెరపై టాక్ షోను హోస్ట్ చేస్తున్నారు. అల్లు అరవింద్ కు చెందిన ఆహా ఓటీటీ ప్లాట్ ఫాంలో బాలయ్య టాక్ షో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ షో కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఈ క్రమంలోనే బాలయ్య నటించిన అఖండ సినిమా ప్రి రిలీజ్ ఫంక్ష‌న్‌ కు మెగా కాంపౌండ్ కు చెందిన హీరో అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా వచ్చారు. ఇది ఇండస్ట్రీలో పెద్ద గొప్పగా అందరూ చెప్పుకున్నారు.

సాధారణంగా అల్లు కాంపౌండ్ ఎప్పుడు నందమూరి హీరోల‌కు దూరంగా ఉంటూ వస్తుంది. అయితే బ‌న్నీ – ఎన్టీఆర్ మ‌ధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. ఇక ఇప్పుడు అదే నందమూరి హీరో బాలయ్య తో ఓటీటి టాక్ షో చేయించుకోవడంతో పాటు అదే బాలయ్య సినిమా ఫంక్షన్‌కు సైతం అల్లు అర్జున్ వెళ్లడంతో టాలీవుడ్ లో ఇప్పుడు కొత్త‌ కాంబినేష‌న్లు చూడబోతున్నాం అని మేకర్స్ సంతోషపడుతున్నారు. అల్లు అర్జున్ బాలయ్య సినిమాకు ముఖ్యఅతిథిగా రావడంతో అటు అల్లు అభిమానులు కూడా బాలయ్య సినిమాను సపోర్ట్ చేస్తున్నారు.

రేపొద్దున పుష్ప రిలీజ్ అయ్యాక ఆ సినిమాకు కూడా బాలయ్య ఫ్యాన్స్ సపోర్ట్ ఉంటుందని వేరే చెప్పక్కర్లేదు. ఇక ఇప్పుడు మరో అదిరిపోయే కాంబినేషన్ మనం చూస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. మెగాస్టార్ ఆచార్య మూవీ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ త్వరలోనే జరగబోతుంది. ఈ సినిమాకు జూనియర్ ఎన్టీఆర్ ని గెస్ట్ గా పిలవాలని భావిస్తున్నారట. ఎన్టీఆర్ – చెర్రీ కలిసి ఇప్పటికే ఆర్ ఆర్‌ సినిమాలో నటిస్తున్నారు.

దీనికితోడు ఆచార్య‌ డైరెక్టర్ కొరటాల శివ తర్వాత సినిమా ఎన్టీఆర్ తోనే ఉంది. ఎన్టీఆర్ – కొరటాల కూడా సన్నిహితులు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్‌ను ఆచార్య సినిమా రిలీజ్ ఫంక్షన్ కు గెస్ట్ గా పిలుస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఏదేమైనా ఇది ఇండ‌స్ట్రీలో మంచి వాతావ‌ర‌ణ‌మే అని చెప్పుకోవాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news