Moviesబాల‌య్య ఫిల్మ్ స్టూడియో ఎక్క‌డ ప్లాన్ చేశారు.. ఏమైంది...!

బాల‌య్య ఫిల్మ్ స్టూడియో ఎక్క‌డ ప్లాన్ చేశారు.. ఏమైంది…!

దివంగత విశ్వవిఖ్యాత నటుడు నందమూరి తారకరామారావు వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ నాలుగు దశాబ్దాలుగా తెలుగు సినిమా పరిశ్రమలో తిరుగులేని స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. బాలయ్య ఆల్ రౌండర్… ఆయన హీరో మాత్రమే కాదు.. ఆయన ఒక నిర్మాత కూడా.. ఆయనలో ఒక దర్శకుడు కూడా దాగి ఉన్నాడు. తన తండ్రి వద్దే దర్శకుడిగా కూడా బాలయ్య మెళకువలు నేర్చుకున్నాడు. తన స్వీయ దర్శకత్వంలో నర్తనశాల సినిమా కూడా ప్రారంభమైంది.

అయితే అనివార్య కారణాల వల్ల ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయిన సంగతి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా సినిమా పరిశ్రమను అభివృద్ధి చేయాలన్న డిమాండ్లు వినిపించాయి. ఈ క్రమంలోనే నాటి చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఎందో మంది సినిమా వాళ్ల‌తో పాటు ఇండ‌స్ట్రీ నిర్మాత‌ల‌ను ఏపీకి ఆహ్వానించింది.

ఏపీలో నెల్లూరు జిల్లా త‌డ‌తో పాటు వైజాగ్‌లో సిని ప‌రిశ్ర‌మ అభివృద్ధి చేయాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. ఇక వైజాగ్‌లో స‌ముద్రం, బీచ్ కూడా ఉండ‌డంతో అక్క‌డ షూటింగ్‌లు జ‌రిగితే ల‌క్ష‌లాది మందికి ఉపాధి దొరుకుతుంద‌ని ఏపీ ప్ర‌భుత్వం ప్లాన్ చేసింది. ఏపీకి త‌ర‌లి వ‌చ్చే సినిమా వాళ్ల‌కు, ఇక్క‌డ స్టూడియోలు క‌ట్టేవాళ్ల‌కు భూమితో పాటు రాయితీలు కూడా ఇస్తామ‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. అల్లు అర‌వింద్‌, సురేష్‌బాబుతో పాటు కొంద‌రు నిర్మాత‌లు, హీరోలు కూడా ఇక్క‌డ భూమి కోసం అప్లికేష‌న్ పెట్టుకున్నారు.

ఈ క్ర‌మంలోనే నాడు బాల‌య్య ఎమ్మెల్యేగా ఉండ‌డంతో పాటు టీడీపీ ప్ర‌భుత్వం అధికారంలో ఉండ‌డంతో ఆయ‌న కూడా అప్లికేష‌న్ పెట్టుకున్నారు. బాల‌య్య త‌లచుకుంటే ఆ ఫైల్ అఫ్రూవ్ చేసుకుని.. వెంట‌నే స్టూడియో క‌ట్టేవారు. అయితే అంద‌రితో పాటు తాను ఉండాల‌ని.. ఆయ‌న ఫైర‌వీలు చేయ‌లేదు. అప్పుడు మొత్తం 110 ఎక‌రాల్లో 20 ఎక‌రాలు బాల‌య్య స్టూడియో కోసం కావాల‌ని ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. త‌ర్వాత ఏపీలో ప్ర‌భుత్వం మారింది. వైసీపీ అధికారంలోకి వ‌చ్చింది. అలా బాల‌య్య స్టూడియో నిర్మాణంలో వెన‌క‌డుగు వేయాల్సి వ‌చ్చింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news