Moviesజై బాల‌య్య నినాదాలతో హోరెత్తిస్తోన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్‌..!

జై బాల‌య్య నినాదాలతో హోరెత్తిస్తోన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్‌..!

యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ ఈ రోజు అఖండ‌గా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేశాడు. సినిమాపై ఉన్న భారీ అంచ‌నాల‌ను రీచ్ అయ్యింద‌న్న టాక్ వ‌స్తోంది. ఓవ‌రాల్‌గా అయితే మాస్ ప్రేక్ష‌కుల‌కు, బాల‌య్య అభిమానుల‌కు మాత్రం విజువ‌ల్ ఫీస్ట్ అని చెపుతున్నారు. సినిమా టాక్ సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అవుతోంది. బాల‌య్య అభిమానులు సంబ‌రాలు చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఎప్పుడూ లేన‌ట్టుగా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానులు కూడా ఈ సినిమాను సోష‌ల్ మీడియాలో పచ్చి నాటు మాస్ డైలాగుల‌తో ఫుల్లుగా స‌పోర్ట్ చేస్తున్నారు.

ప‌వ‌ర్ స్టార్ ఫ్యాన్స్ జై బాల‌య్య నినాదాల‌తో సోష‌ల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. బాల‌య్య చంపేశాడ‌ని చెపుతున్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్ అంద‌రూ కూడా అఖండ‌కు సోష‌ల్ మీడియాలో బూస్ట‌ప్ ఇస్తుండ‌డం సినిమా వ‌ర్గాల్లో కూడా సంచ‌ల‌నంగా మారింది. ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్‌కు కూడా మెగా హీరో అల్లు అర్జున్ స్వ‌యంగా వ‌చ్చారు. ఇక ఇప్పుడు ప‌వ‌న్ అభిమానులు కూడా స‌పోర్ట్ చేస్తుండ‌డంతో సినిమాకు మ‌రింత హైప్ వ‌స్తోంది.

సోష‌ల్ మీడియాలో ట్విట్ట‌ర్ల ఖాతాల‌తో పాటు ప‌వ‌న్ ఫ్యాన్స్ గ్రూపుల్లోనూ, పేజీల్లోనూ అఖండ సూప‌ర్ హిట్ అని కామెంట్లు పెడుతున్నారు. అఖండ‌ను మ‌న వంతుగా ప్ర‌మోట్ చేయాల‌న్న కామెంట్లు క‌న‌ప‌డుతున్నాయి. ఏదేమైనా పెద్ద హీరోల అభిమానుల మ‌ధ్య ఈ త‌ర‌హా వాతావ‌ర‌ణం ఉండ‌డం మంచి విష‌య‌మే. రేప‌టి రోజును పుష్ప వ‌చ్చినా లేదా ఆర్ ఆర్ ఆర్ ఆ త‌ర్వాత భీమ్లా నాయ‌క్ సినిమా రిలీజ్ అయినా కూడా బాల‌య్య , నంద‌మూరి అభిమానుల స‌పోర్ట్ ఉండే ఆ సినిమాల‌కు మంచి ప్ల‌స్ అవుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news