Moviesఅమెరికాలో అఖండ మాస్ జాత‌ర‌... వీడియో వైర‌ల్ (వీడియో)

అమెరికాలో అఖండ మాస్ జాత‌ర‌… వీడియో వైర‌ల్ (వీడియో)

యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన అఖండ సినిమా ఈ రోజు ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. బాల‌య్య చ‌రిత్ర‌లోనే లేన‌ట్టుగా అఖండ సినిమాను యూఎస్‌లో 500 స్క్రీన్ల‌లో రిలీజ్ చేశారు. బాల‌య్య బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ సినిమాలు కూడా అక్క‌డ అన్ని స్క్రీన్ల‌లో రిలీజ్ చేయ‌లేదు. బోయ‌పాటి – బాల‌య్య కాంబినేష‌న్ కావ‌డంతో ఎలాంటి అంచ‌నాలు ఉన్నాయో ఆ అంచ‌నాల‌ను మించి మ‌రీ ఈ సినిమా హిట్ అయ్యింది.

ఇక లెజెండ్ త‌ర్వాత బాల‌య్య నుంచి ప‌వ‌ర్ ఫుల్ మాస్‌, యాక్ష‌న్ సినిమా కోసం ఆశించిన ప్రేక్ష‌కుల‌కు నిరాశే ఎదురైంది. చాలా కాలం నుంచి బాల‌య్య కోసం ఎలాంటి మాస్ ప్యాక్డ్ సినిమా కోసం ఆయ‌న అభిమానులు ఎదురు చూస్తున్నారో ఆ కొర‌త‌ను అఖండ తీర్చేసింది. అస‌లు ట్రైల‌ర్‌తోనే బాల‌య్య – బోయ‌పాటి ఏదో సంచ‌ల‌నం క్రియేట్ చేయ‌బోతున్నారు అన్న అంచ‌నాలు ప్ర‌తి ఒక్క‌రికి వ‌చ్చేశాయి. ఈ రోజు అవే నిజం అయ్యాయి.

అఖండ సినిమా చూసిన బాల‌య్య ఫ్యాన్స్ అయితే గ‌ర్వంగా ఇది మా హీరో సినిమా అని చెప్పుకుంటూ కాల‌ర్ ఎగ‌రేస్తున్నారు. తాజాగా ట్విట్ట‌ర్‌లో ఓ వీడియో తెగ వైర‌ల్ అవుతోంది. అమెరికాలోని డ‌ల్లాస్‌లో అఖండ మాస్ జాత‌ర జ‌రుగుతున్న‌ట్టుగా ఉంది. ఓ సినిమా రిలీజ్‌కు ముందు విదేశాల్లో ప్రీమియ‌ర్ షోలు వేస్తారు.

అఖండ సినిమా రిలీజ్ పుర‌స్క‌రించుకుని బాల‌య్య అభిమానులు అక్క‌డ భారీ ఎత్తున కార్ల‌తో చేసిన ర్యాలీ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది. బాల‌య్య‌కు అమెరికాలో ఎలాంటి అభిమాన గ‌ణం ఉంటారో ? ఈ వీడియో చెప్ప‌క‌నే చెప్పింది. ఏదేమైనా ఆంధ్రా, తెలంగాణ‌, క‌ర్నాట‌క టు అమెరికా ఎక్క‌డ చూసినా అఖండ మానియా అయితే మామూలుగా లేదు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news