Moviesఅఖండకు బోయపాటి ఎక్కువ ప్రమోషన్స్ చేయకపోవడానికి రీజన్ ఇదేనా.?

అఖండకు బోయపాటి ఎక్కువ ప్రమోషన్స్ చేయకపోవడానికి రీజన్ ఇదేనా.?

యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ ఈ రోజు అఖండ‌గా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చి..తన కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ గా ఈ చితాని నిలబెట్టాడు. ముందు నుండే ఈ సినిమాపై ఉన్న భారీ అంచ‌నాల‌ను రీచ్ కావడమే కాకుండా టాలీవుడ్ సినీ చరిత్రను తిరగరాస్తుంది అంటున్నారు అభిమానులు. ఓవ‌రాల్‌గా అయితే మాస్ ప్రేక్ష‌కుల‌కు, బాల‌య్య అభిమానుల‌కు మాత్రం విజువ‌ల్ ఫీస్ట్ అని చెప్పక్క తప్పదు. ఇక ఈ విజయంతో బాల‌య్య అభిమానులు సంబ‌రాలు చేసుకుంటున్నారు.

మాస్ హీరోగా బాల‌య్య‌ను వెండితెర‌పై ఆవిష్క‌రించ‌డంలో బోయ‌పాటి శ్రీను త‌న‌దైన మార్కును చూపించి అంద‌రితో శ‌భాష్ అనిపించుకున్నారు. నంద‌మూరి బాల‌కృష్ణ‌, బోయ‌పాటి కాంబినేష‌న్‌లో సింహా, లెజెండ్ సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి సంచ‌లనాల‌ను సృష్టించాయో మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా ఆ రికార్డులు అన్నీ తుడిచేస్తాది అనడంలో సందేహం లేదు.

వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో నాలుగవ సినిమా కూడా వస్తే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు. ‘అఖండ‌’సినిమా ను అనౌన్స్ చేయ‌గానే అభిమానులు .. అస‌లు బోయ‌పాటి ఈసారి బాల‌కృష్ణ‌ను ఎలా చూపిస్తాడోన‌ని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూశారు. అభిమానుల ఆశలను నిరాశపరచకుం డా..ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్ ఇస్తూ.. త‌న గ‌త రెండు చిత్రాల త‌ర‌హాలోనే ఈ సినిమాలో బాల‌కృష్ణ‌తో ద్విపాత్రాభిన‌యం చేయించారు బోయపాటి.

ఇది ఇలా ఉంటే జనరల్ గా ఏ సినిమా అయినా విడుదలకు సిద్ధంగా ఉంది అంతే.. ముందు నుండే చాలా వరకు స్టార్ హీరోలు, దర్శకులు తమ సినిమాలను ప్రమోట్ చేసుకునేందుకు పలు మీడియా చానల్ కు ఇంటర్వ్యూలు ఇస్తూ..నానా హడావుడి చేస్తారు. కానీ బాలయ్య అలా ఏం చేయలేదు. ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను మాత్రం భారీగా చేసారు. అంతే.. ఆ తర్వాత మాత్రం చిత్ర బృందం సైలెంట్ అయిపోయింది.

అయితే దీనికి రీజన్ ఏంటా అని ఆరా తీస్తే..బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ నమ్మకం అని తెలుస్తుంది. ఇప్పటికే బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో సింహా, లెజెండ్ లాంటి రెండు బ్లాక్ బాస్టర్ విజయాలు రావడంతో అఖండ సినిమాకు ఏ విధమైన ప్రమోషన్ అవసరం లేదు అని కొంత మంది అభిప్రాయపడుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news