Moviesప్రభాస్ ఈవెంట్ కోసం నవీన్ పొలిశెట్టి ఎంత తీసుకున్నారో తెలుసా..అస్సలు నమ్మలేరు..!!

ప్రభాస్ ఈవెంట్ కోసం నవీన్ పొలిశెట్టి ఎంత తీసుకున్నారో తెలుసా..అస్సలు నమ్మలేరు..!!

ఈ రంగుల ప్రపంచం సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి టైం ఎలా మారుతుందో ఎవరు చెప్పలేరు. అలా మారిన పేరే.. నవీన్ పోలిశెట్టి. ఒక్కప్పుడు ఈ పేరు చాలా తక్కువ మందికే తెలుసు. కానీ ఒక్క సినిమా .. ఒక్కే ఒక్క సినిమా తరువాత ఈయన బాగా పాపులర్ అయ్యిపోయాడు. అదే “జాతి రత్నాలు”. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమాతో హీరోగా మంచి గుర్తింపు అందుకున్న నవీన్ పోలిశెట్టి.. ఇటీవల వచ్చిన జాతి రత్నాలు సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ మూవీలో నవీన్ పర్ ఫామెన్స్ కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమా విడుదలైన చాలా కాలమే అయినా సినిమా ద్వారా ఆయనకు వచ్చినా క్రేజ్ మాత్రం తగ్గలేదు.

జాతిరత్నాలు సినిమా తరువాత ఈయన అసలు కనిపించలేదు. ఒక్క సినిమా కూడా కమిట్ అవ్వలేదు. ఆఫర్లు రాలేదో..లేక వచ్చినా ఈయనకు నచ్చలేదో తెలియదు కానీ ఈయన మాత్రం సినిమాలకి సైన్ చేయలెదు. అప్పుడు ఆ మధ్య అనుష్క తో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు అన్న టాక్ వచ్చినా..ఆ తరువాత దానీ పై ఎలాంటి ప్రకటన లేదు..క్లారిటీ లేదు. ఇక జనాలు ఈయనను మర్చిపోతున్న టైంలో మళ్ళీ తెర పై కనిపించి సందడి చేసాడు. యాక్టర్ గా కాదు హోస్ట్ గా. ‘రాధేశ్యామ్‌’ ప్రీ బ్రిలీజ్ ఈవెంట్ కి ఈయన యాంకర్ గా వ్యవహరించాడు. దీంతో మళ్లీ ఆయన కామెడీ టైమింగ్ చూసి ప్రజలు నవ్వుకున్నారు.

ఈవెంట్ కి వచ్చిన ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ తనదైన స్టైల్ లో పంచ్ లు వేస్తూ ఈవెంట్ కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. ప్రభాస్‌ హీరోగా రాధాకృష్ణ కుమార్‌ తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రం ‘రాధేశ్యామ్‌’. పూజాహెగ్డే కథానాయిక నటించిన ఈ సినిమా 2022 సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలకానున్న నేపథ్యంలో చిత్ర బృందం రామోజీ ఫిల్మ్‌ సిటీలో అభిమానులే అతిథులుగా ముందస్తు విడుదల వేడుకను నిర్వహించింది. ఈ ఈవెంట్ లో యాంకరింగ్ చేసినందుకు గాను నవీ ఎంత తీసుకుని ఉంటారు అనే మ్యాటర్ ఇప్పుడు అందరు ప్రధానంగా చర్చించుకుంటున్నారు.

ఇక లీకైన సమాచారం బట్టి అసలు నవీ ఈ ఈవెంట్ కి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట. ప్రభాస్ మీద ఉండే అభిమానంతో వాళ్ల మధ్య ఉండే ఫ్రెండ్ షిప్ తో ఈ ఈవెంట్ కు యాంకర్ గా చేసాడట. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు గ్రేట్ నవీన్.. మీ మధ్య ఫ్రెండ్ షిప్ లానే ఉమడాలి అంతూ కామెంట్స్ పెడుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news