Movies"నీ ముఖం అద్దంలో చూసుకున్నావా" అని అడిగాడు ఆ డైరెక్టర్..ఓపెన్ గా...

“నీ ముఖం అద్దంలో చూసుకున్నావా” అని అడిగాడు ఆ డైరెక్టర్..ఓపెన్ గా చెప్పేసిన ఐశ్వర్య..!!

సినీ ఇండస్టృఈలో ఎంతో మంది హీరోయిన్స్ వస్తుంటారు పోతుంటారు కానీ కొందరు మాత్రమే చిరస్దాయిగా నిలిచిపోయే విధంగా పేరు తెచ్చుకుంటారు. అలాంటి వారిలో ఐశ్వర్య రాజేష్ కూడా ఒకరు. ఈమె ఎక్స్ పోజింగ్ చేయదు. వల్గర్ పాత్రలు అసలకే చేయదు. పద్ధతిగా కనిపిస్తూనే నటనపరంగా మెప్పిస్తూనే స్టార్ హీరోల సినిమాల్లో కూడా నటిస్తుంది. ఈమె ను చూసి మిగతా హీరోయిన్స్ కూడా ఎక్స్ పోజింగ్ చేయకుండా ఉంటే సినీ ఇండస్ట్రీ బాగుపడుతుందనేది సినీ పెద్దల ఆలోచన. కానీ అది జరిగే పని కాదు . ఆ విషయం వాళ్లకు తెలుసు. మనకు తెలుసు. మారుతున్న కాలానికి కొత్త కొత్త మార్పులను కోరుకుంటున్నారు నేటి యువత. యువతకు తగ్గటే ఫాలో అవుతున్నారు దఋశక నిర్మాతలు. ఇక్కడ తప్పు ఎవరిది అంటే ఎవరిని ఏం అనలేం.

తమిళ, తెలుగు భాషల్లో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్‌ క్రియేట్ చేసుకుని టాలెంటెడ్ నటిగా గుర్తింపు పొందింది ఐశ్వర్య రాజేష్. సన్ టీవీలో అస్తోపోవధ్ యారు అని పిలవబడే ఒక ప్రసిద్ధ కామెడీ షోలో ఆమె యాంకర్‌గా తన వృత్తిని ప్రారంభించింది. ఐశ్వర్య తండ్రి రాజేష్ తెలుగులో 54 చిత్రాలలో నటించిన నటుడు. ఆమె తాత అమరనాథ్ కూడా ప్రధాన పాత్రలలో నటించారు. ఆమె మేనత్త శ్రీలక్ష్మి 500 కి పైగా చిత్రాలలో నటించింది. ఇక రియాల్టీ షో మనాడా మయిలాడ గెలుచుకున్న తరువాత, ఆమె అవగాళమ్ ఇవర్గలం (2011) లో సినిమాల్లో పరిచయమయింది. అత్తాచాటి (2012) లో నటించిన తరువాత మంచి పేరు వచ్చింది. ఆమె మొట్టమొదటి మలయాళ చిత్రం జోమోన్నే సువిశ్శేంగల్. తర్వాత ఆమె నివిన్ పాలీతో రెండవ మలయాళ చిత్రం సఖవు (2017 చిత్రం)లో నటించింది. అర్జున్ రాంపాల్ సరసన డాడీ అనే హిందీ సినిమాలో ఆమె తొలిసారిగా నటించింది. 2014 లో ఆమె నటించిన కాక ముట్టై అనే తమిళ చిత్రానికి గాను ఉత్తమ నటిగా తమిళనాడు రాష్ట్ర చలన చిత్ర పురస్కారాన్ని అందుకుంది.

బహుభాష నటిగానే కాకుండా హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రాలకు కేరాఫ్‌గా మారిన నటి ఐశ్వర్య రాజేష్‌. తమిళంలో కనా, క.పే.రణసింగం వంటి విజయవంతమైన చిత్రాల తరువాత మరో హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ కథా చిత్రానికి సిద్ధమయ్యారు. మలయాళంలో సంచలన విజయం సాధించిన ది గ్రేట్‌ ఇండియన్‌ కిచెన్‌ చిత్ర తమిళ రీమేక్‌లో ఈమె నటిస్తున్నారు. నటుడు రాహుల్‌ రవిచంద్రన్‌ ప్రధాన పాత్రల్లో పోషిస్తున్న ఈ చిత్రాన్ని ఆర్‌.కన్నన్‌ స్వీయ దర్శకత్వంలో తన మసాలా పిక్చర్స్‌ పతాకంపై నిర్మిస్తున్నారు. కాగా ఆ మధ్య ఇంగ్లీష్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని నటి ఐశ్వర్య రాజేష్ తన సినీ జీవితంలో ఎదుర్కొన్నటువంటి ఒడిదుడుకులు మరియు సంఘటనల గురించి పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది.

ఆమె మాట్లాడుతూ”నా రంగు, అందం, ఆకారం అంటూ వేధింపులకు గురయ్యానని, సినిమా అవకాశాల విషయంలోనూ తాను లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్టు” ఐశ్వర్య రాజేష్ తెలిపారు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నీ రంగు ఎలా ఉందో తెలుసా, అద్దంలో ముఖం చూసుకున్నావా, నువ్వు ఇలా ఉన్నావు.. నీకు అవకాశాలు ఎవరిస్తారంటూ ఎగతాళి చేశారని చెప్పుకొచ్చిమది. సినిమా నేపథ్యం లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన వారితో పాటు.. ఫిల్మ్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన తనకు వేధింపులు తప్పలేదన్నారు. మరికొందరైతే ఏకంగా నీకు సినిమా అవకాశం ఇస్తే నాకేంటి అని అసభ్యకరంగా ప్రవర్తిస్తూ శారీరకంగా లొంగదీసుకోవాలని కూడా చూశారని తెలిపింది. అయితే ఏ విషయంలోనూ కాంప్రమైజ్ అవ్వకూడదని, టాలెంట్‌ను నమ్ముకంటే అవకాశాలు వస్తాయని అభిప్రాయపడ్డారు. ఆడియెన్స్ సైతం నువ్వు హీరోయినా అంటూ కామెంట్ చేసేవారని, అక్కాచెల్లెలు, ఇతర క్యారెక్టర్లు చేస్తే మేలని సలహాలు ఇచ్చారని ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news